బైక్‌ను తప్పించబోయి.. ట్రక్కును ఢీకొట్టి: నెల్లూరు జిల్లా వాసులు దుర్మరణం: నుజ్జునుజ్జు

చిత్తూరు: చిత్తూరు జిల్లాలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మితిమీరిన వేగమే దీనికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. సంఘటనా స్థలంలో కనిపించిన భయానక దృశ్యాలు.. ప్రమాద తీవ్రతను తెలియజేస్తున్నాయి. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు. మరొకరు గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. గాయపడ్డ మహిళను ఆసుపత్రికి తరలించారు.

చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యం మండలం బలిజిపల్లి వద్ద చెన్నై-బెంగళూరు జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లాకు చెందిన వెంకటేశ్వర రెడ్డి తన భార్య శిరీషతో కలిసి బెంగళూరులో నివసిస్తున్నారు. ఆదివారం ఉదయం ఆయన తండ్రి శ్రీనివాసులు రెడ్డి, తల్లి రత్నమ్మతో కలిసి బెంగళూరులోని కుందనహళ్లిలో తమ నివాసం నుంచి కారులో ఆదివారం తెల్లవారు జామున నెల్లూరుకు బయలుదేరారు. మార్గమధ్యలో వారు ప్రయాణిస్తోన్న కారు బలిజిపల్లి వద్దకు చేరుకోగానే అదుపు తప్పింది.

Four people died in a road accident in Bangarupalyam of Chittoor district

బైక్‌ను తప్పించబోయి అదే వేగంతో.. రోడ్డుపక్కన నిలిపి ఉంచిన ఓ భారీ ట్రక్కును వెనుక నుంచి బలంగా డీ కొట్టింది. ఎంత వేగంతో కారు ఆ ట్రక్కును ఢీ కొట్టిందంటే.. కారు బోనెట్ మొత్తం దాని ఛాసిస్ కిందికి వెళ్లిపోయింది. ఈ ఘటనలో శ్రీనివాసులు రెడ్డి, ఆయన భార్య రత్నమ్మ, వెంకటేశ్వర రెడ్డి మరణించారు. శిరీషకు తీవ్ర గాయాలు అయ్యాయి. బైక్‌పై వెళ్తోన్న బంగారుపాళ్యానికి చెందిన బాబు అనే వ్యక్తి కూడా ఈ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. కారు ముందుభాగం మొత్తం నుజ్జునుజ్జు అయింది.

Recommended Video

    Sonu Sood Help to AP Farmer With Tractor

    ప్రమాద సమయంలో శ్రీనివాసులు రెడ్డి కారును డ్రైవ్ చేస్తున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. వెనుక సీట్లో కూర్చున్న రత్నమ్మ సంఘటనాస్థలంలో మరణించారు. శిరీష గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టమ్ కోసం తరలించారు. గాయపడ్డ శిరీషను బంగారుపాళ్యం ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం చిత్తూరు జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+