చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కుప్పంలో జూ.ఎన్టీఆర్ జెండా.. రాజకీయాల్లోకి రావాలంటూ... చంద్రబాబుకు..

|
Google Oneindia TeluguNews

ఏపీ రాజకీయాల్లోకి ఎన్టీఆర్ రావాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. తారక్ ఎప్పుడూ రాజకీయాలపై ప్రత్యక్షంగా మాట్లాడలేదు. ఆయన అభిమానులు మాత్రం బలంగా కోరుతున్నారు. అయితే తాజాగా నూతన జెండా వెలవడం చర్చకు దారితీసింది. అదీ కూడా చంద్రబాబు నాయుడు ఇలాఖా కుప్పంలో వెలుగుచూడటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఒకరకంగా ఇదీ చంద్రబాబును ఇరుకున పెట్టే అంశమే.. దీనిపై ఆయన, టీడీపీ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలీ మరీ.

రాజకీయాల్లోకి రండి.. ప్లీజ్

రాజకీయాల్లోకి రండి.. ప్లీజ్

జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని అతని ఫ్యాన్స్ నూతన జెండా తయారు చేసి ఆవిష్కరించారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం మంకలదొడ్డి పంచాయములకలపల్లి గ్రామంలో తారక్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు తమ అభిమానాన్ని చాటుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌‌ను రాజకీయాల్లోకి తీసుకురావాలని జనవరిలో చంద్రబాబు పర్యటించిన సమయంలో ఆయన దృష్టికి తీసుకెళ్లారు. జూనియర్ ఎన్టీఆర్ త్వరగా రావాలని ఫ్యాన్ అంటోన్న.. తారక్ మాత్రం నోరువిప్పడం లేదు.

 మాస్ హీరో..

మాస్ హీరో..

జూనియర్ ఎన్టీఆర్ మాస్ హీరో. రాజకీయ పార్టీ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి. తాత ఎన్టీఆర్ పోలికలతో ఉన్న వ్యక్తి.. ఎంతటివారినైనా మాటలతో ఆకట్టుకునే తత్వం గలవారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్‌ను తెలుగుదేశం పార్టీలో క్రీయాశీలకంగా చూడాలని ఆయన అభిమానులు భావిస్తున్నారు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ తరపున ఎన్నికల ప్రచారం చేశారు. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తల పని చేస్తానని, ఎప్పుడు తన అవసరం వస్తే అప్పుడు సేవలందిస్తానని గతంలోనే ప్రకటించారు. ప్రస్తుతం టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ అవసరం ఉందని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం పెదవి విప్పిన సందర్భం లేదు.

చంద్రబాబు పరిస్థితి ఇదీ..?

చంద్రబాబు పరిస్థితి ఇదీ..?

వాస్తవానికి నందమూరి కుటుంబం.. పార్టీకి దూరంగా ఉండాలని చంద్రబాబు అనుకుంటారు. ఆయన వ్యవహారశైలి అలా అనిపిస్తోంది. తన కుమారుడు లోకేశ్‌ను ప్రమోట్ చేయడమే ప్రాధాన్యంలా భావిస్తారని ఆనలిస్టులు అంటుంటారు. అలాంటి సమయంలో తారక్ పేరుతో జెండా వెలువడం చంద్రబాబును ఇబ్బందికి గురిచేస్తోంది. అదీ కూడా చిత్తూరు జిల్లా.. కుప్పంలో వెలువడంతో మింగలేక కక్కలేని పరిస్థితి ఉంది. కానీ పైకి మాత్రం.. అలా కాదని చంద్రబాబు చెప్పే అవకాశం ఉంటుంది.

English summary
junior ntr flag in Chittoor kuppam. fans want he will enter politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X