చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హస్తినకు నల్లారి కిరణ్, సోనియా, రాహుల్‌తో భేటీ.. పీసీసీ పోస్ట్

|
Google Oneindia TeluguNews

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతు అయిపోయింది. అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు జరిగిన పోల్స్‌లో ఓటమి చవిచూసింది. ఆ పార్టీకి పీసీసీ చీఫ్‌లను మార్చిన ఫలితం లేకుండా పోయింది. రఘువీరా రెడ్డి, సాకే శైలజానాథ్.. పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ పార్టీ చివరి స్థానంలో నిలిచింది. ఏపీలో ఆ పార్టీకి జవసత్వాలు కలిగించేందుకు హై కమాండ్ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవీ కట్టబెట్టాలని చూస్తోంది.

హస్తినకు కిరణ్

హస్తినకు కిరణ్

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. కాంగ్రెస్ హై కమాండ్ నుంచి వచ్చిన పిలుపు మేరకు ఢిల్లీ వెళుతున్నారు. రెండు మూడు రోజులపాటు ఢిల్లీలోనే ఉంటారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీతోపాటు పలువురు సీనియర్ నేతలతో సమావేశం అవుతారని విశ్వసనీయ సమాచారం. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు హై కమాండ్ చర్చించే అవకాశం ఉంది.

పీసీసీ చీఫ్ పోస్ట్

పీసీసీ చీఫ్ పోస్ట్

కిరణ్‌కు పీసీసీ చీఫ్ పదవీ ఇస్తారనే జోరుగా ప్రచారం జరుగుతుంది. మరీ అందుకు ఆయన సంసిద్దత వ్యక్తం చేస్తారా లేదా అనే అంశంపై క్లారిటీ లేదు. ఉమ్మడి ఏపీ చివరి సీఎంగా కిరణ్ పనిచేశారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పోరాడారు. అయినప్పటికీ హై కమాండ్ వినిపించుకోలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కట్టుబడి ఉంది. రాష్ట్రపతి పాలన విధించి.. మరీ రాష్ట్ర విభజన చేసింది. ఆ తర్వాత కిరణ్ పత్తా లేకుండా పోయారు.

తగ్గిన ప్రభ

తగ్గిన ప్రభ


ఉమ్మడి రాష్ట్ర చివరి సీఎంగా రాజీనామా చేసిన తర్వాత.. కిరణ్ ప్రభ తగ్గిపోయింది. జై సమైక్యాంధ్ర పేరుతో పార్టీ ఏర్పాటు చేశారు. అయినప్పటికీ జనం విశ్వసించలేదు. ఫస్ట్ టైమ్ టీడీపీకి పట్టం కట్టారు. టీడీపీ అధికారం చేపట్టగా.. వైసీపీ ప్రతిపక్షంలో కూర్చొంది. కాంగ్రెస్, ఇతరులు పత్తా లేకుండా పోయారు. దాదాపు 8 ఏళ్లు అవుతున్న.. కాంగ్రెస్ పార్టీ చివరి స్థానంలో ఉంది. ఆ ఇమేజీ పోగెట్టేందుకు కాంగ్రెస్ హై కమాండ్ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా కిరణ్‌ను రంగంలోకి దించింది.

English summary
ex andhra pradesh chief minister kiran kumar reddy has goes to delhi. to meet sonia gandhi and rahul gandhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X