కాళహస్తిలో భక్తుల ఇక్కట్లు.. జరగని పూజలు, కారణమిదే..?
శ్రీకాళహస్తి.. అంటే శైవాలయం కానీ.. అందులో నిర్వహించే రాహు కేతు పూజకు చాలా ప్రసిద్ది. చాలా మంది పూజ చేసుకుంటారు. ఆ తర్వాత తమకు మంచి జరిగిందని చాలామంది అంటుంటారు. అయితే పూజకు నాగ పడక ఇలా ఇంపార్టెంట్.. ఇప్పుడు వాటి కొరత నెలకొంది. దీంతో పూజ చేయడం సాధ్యం కాదు. సో ఇప్పటికే వచ్చిన భక్తులు నిరుత్సాప పడుతున్నారు.

నాగ పడగల కొరత
రాహు కేతు పూజలో వినియోగించే నాగ పడగలకు తీవ్ర కొరత ఏర్పడడంతో భక్తులు పూజలు చేయడానికి వీల్లేకుండా ఉంది. పూజకు అవసరమైన నాగ పడగలు లేకపోవడంతో ఆలయ అధికారులు టికెట్ల పంపిణీని నిలిపివేశారు. దీంతో గత మూడు రోజులుగా ముక్కంటి ఆలయంలో రాహు -కేతు పూజలు నిలిచిపోయాయి. విషయం తెలియని భక్తులు రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రల నుంచి ఇప్పటికే భారీగా చేరుకున్నారు.

భక్తుల నిరాశ
పూజలు నిలిచిపోవడంపై భక్తులు నిరాశకు గురవుతున్నారు. ఆలయ మింట్‌లో ఉద్యోగుల సెలవులు ఉండటంతో నాగపడగల తయారీ నిలిచిపోయింది. దీంతో నాగపడగల కొరత ఏర్పడిందని ఆలయ అధికారులు పేర్కొన్నారు. దోష నివారణ పూజలపై ఆలయ అధికారులు ముందస్తు ప్రకటన చేయకపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాగపడగలు ఎపుడు అందుబాటులోకి వస్తాయనే విషయంపై స్పష్టత లేకపోవడంపై అధికారుల తీరు పట్ల భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Recommended Video

భక్తుల రాక
రాహు కేతు దోష నివారణ నిమిత్తం దేశవిదేశాల నుంచి భక్తులు శ్రీకాళహస్తీ ఆలయానికి విచ్చేసి పూజలు నిర్వహిస్తారనే సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది వెళుతుంటారు. ఇతర రాష్ట్రాల నుంచి పెద్దగా జనం వస్తుంటారు. కానీ నాగ పడకల కొరత వల్ల వచ్చిన వారు ఏం చేద్దాం అనుకుంటున్నారు. అయితే అవీ ఎప్పుడూ అందుబాటులోకి వస్తాయనే అంశంపై కూడా సమాచారం లేదు.












Click it and Unblock the Notifications