భాకరాపేట బస్సు ప్రమాదంలో 8మంది మృతి : ప్రధాని మోదీ, సీఎం జగన్ దిగ్భ్రాంతి.. రూ. 2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటన
చిత్తూరు జిల్లాలోని భాకరాపేటలో జరిగిన బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. ఈ ప్రమాదంలో 54 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. డ్రైవర్ అతివేగంగా బస్సును నడపడంతో మలుపు వద్ద అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లెందని అదికారులు వెల్లడించారు. అనంతపురం జిల్లా ధర్మవరంలోని రాజేంద్రనగర్‌కు చెందిన వేణుకు చిత్తూరు జిల్లా నారాయణవనంకు చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. తిరుచునూరులో ఏర్పాటు చేసుకున్న నిశ్చితార్థానికి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసింది. పెళ్లివారింట విషాద ఛాయలు అలముకున్నాయి.

బస్సు ప్రమాదంపై మోదీ, జగన్ దిగ్భ్రాంతి..
భాకరాపేటల బస్సు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలిపారు. ఈ దుర్ఘటనలో బాధితుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా అందిచాలని ఆదేశించారు. మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2లక్షలు , గాయపడిన వారికి రూ. 50 వేలు పరిహారాన్ని మోదీ ప్రకటించారు. అటు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ బస్సు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనకు గల కారణాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. బాధితులకు అత్యత్తమ వైద్య చికిత్స అందించాలని అదికారులను ఆదేశించారు. మరణించిన వారి కుటుంబాలకు రూ. 2లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేలు చొప్పున పరిహారం ప్రకటించారు సీఎం జగన్.

చంద్రబాబు, పవన్ కల్యాణ్ విచారం
ఈ బస్సు ప్రమాదంపై టీడీపీ అధినేత చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. బస్సు లోయలో పడి 8 మంది చనిపోవడం దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ఈ దుర్ఘటన పెళ్లింట్లో విషాదం నింపిందన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. భాకరాపేట ఘోర బస్సు ప్రమాదం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఇలాంటి బస్సులు నడుపుతున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బస్సు లోయలో పడిన చాలా సేపటి వరకు ప్రమాదాన్ని గుర్తించకపోడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

రుయా ఆస్పత్రిలో క్షతగాత్రులకు చికిత్స
భాకర పేట రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితులు తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స పొంతున్నారు. ఆ క్షతగాత్రులను మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి పరామర్శించారు. చికిత్స పొంతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వ పరంగా అన్ని విధాల ఆదుకుంటామని తెలిపారు. భాకరాపేట ఘాట్ రోడ్డులో తాత్కాలిక రక్షణ గోడ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ఈ మార్గాన్ని నాలుగువరుసల రోడ్డుగా మార్చేందుకు ఇప్పటికే రూ. 1500 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. ఈ ఘటనకు అతివేగమే కారణమని ప్రాథమికంగా నిర్థారించినట్లు పేర్కొన్నారు.
-
మార్కాపురం బస్సు ప్రమాద బాధితుల కోసం ప్రధాని కీలక ప్రకటన..!! -
పాలకోసం ఏడుస్తుందని పసిదాన్ని చంపేసిన తల్లి.. తిరుపతి జిల్లాలో దారుణం -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..!












Click it and Unblock the Notifications