చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీడీపీ సీనియర్ నేత కన్నుమూత: చంద్రబాబు, నారా లోకేష్ దిగ్భ్రాంతి

|
Google Oneindia TeluguNews

చిత్తూరు: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) మాజీ ఛైర్మన్ పీఆర్ మోహన్ కన్నుమూశారు. ఆయన వయస్సు 67 సంవత్సరాలు. జిల్లాలోని శ్రీకాళహస్తిలో గల తన నివాసంలో ఈ తెల్లవారు జామున గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. పీఆర్ మోహన్ మృతి పట్ల తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.

ఆయిల్ కంపెనీలకు రేట్లను తగ్గించడమూ తెలుసు: పెట్రోల్ మళ్లీ మండినా..డీజిల్ ధర తగ్గింపుఆయిల్ కంపెనీలకు రేట్లను తగ్గించడమూ తెలుసు: పెట్రోల్ మళ్లీ మండినా..డీజిల్ ధర తగ్గింపు

చిత్తూరు జిల్లాకు చెందిన పీఆర్ మోహన్.. దివంగత ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావుకు వీరాభిమానిగా గుర్తింపు పొందారు. ఆ అభిమానంతోనే తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆవిర్భావం నుంచి టీడీపీలో కొనసాగారు. వృత్తిరీత్యా ఆయన న్యాయవాది. తెలుగుదేశం పార్టీ తరఫున పలు కేసులను వాదించారు. టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరించేవారు. జిల్లాలో పార్టీ బలోపేతం కావడానికి కృషి చేశారు.

 TDP senior leader and Former SAAP chairman PR Mohan is passes away due to heart attack

ఆయన చేసిన సేవలను గుర్తించిన పార్టీ అధిష్ఠానం.. తమ ప్రభుత్వ హయాంలో ఆయనను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌కు ఛైర్మన్‌గా నామినేట్ చేసింది. రెండుసార్లు ఆయన శాప్ ఛైర్మన్‌గా పనిచేశారు. పీఆర్ మోహన్ ఆకస్మిక మరణం పట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోన్నారు. ఆయన కుటుంబానికి సంతాపాన్ని తెలుపుతున్నారు. సమాచారం తెలిసిన వెంటనే పార్టీ అధినేత చంద్రబాబు, మాజీమంత్రి నారా లోకేష్.. పీఆర్ మోహన్ కుటుంబ సభ్యులను ఫోన్‌లో పరామర్శించారు.

పీఆర్ మోహన్ మృతి తనను దిగ్భ్రాంతిని కలిగించిందని చంద్రబాబు, నారా లోకేష్ అన్నారు. అంకితభావం, నిబద్దతలతో పార్టీకి సేవలందించారని గుర్తు చేశారు. పీఆర్ మోహన్ మరణం పార్టీకి తీరని లోటుగా పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నట్లు ట్వీట్ చేశారు. శాప్ చైర్మన్‌గా ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేశారని, రాష్ట్రాన్ని స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దడానికి శ్రమించాని అన్నారు. పీఆర్ మోహన్ మృతితో టీడీపీ నిబద్ధత కలిగిన నేతను కోల్పోయిందని చెప్పారు.

English summary
Telugu Desam Party senior leader and Sports Authority of Andhra Pradesh (SAAP) former Chairman PR Mohan passes away due to heart attack. TDP Chief Chandrababu and former minister Nara Lokeshe expressed their condolence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X