CSK vs SRH : నేడు చెన్నై-హైదరాబాద్ ఢీ... రాయుడు రాక ధోనీసేనకు కలిసొస్తుందా..?

ఐపీఎల్ 13వ సీజన్‌లో భాగంగా శుక్రవారం(అక్టోబర్ 1) చెన్నై సూపర్ కింగ్స్-సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. గత ఐపీఎల్ సీజన్ వరకూ చెన్నై మ్యాచ్ అంటే చాలు క్రికెట్ అభిమానులందరిలో ఏదో తెలియని ఉత్సుకత ఉండేది. కానీ ఈ సీజన్‌లో ధోనీ సేన పేలవ ప్రదర్శన అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. ఆడిన 3 మ్యాచ్‌లలో రెండింటిలో ఓడిపోయి పాయింట్ల పట్టికలో అట్టడుగున్న వున్న చెన్నై.. సన్ రైజర్స్‌తో మ్యాచ్‌లోనైనా గాడిన పడుతుందా అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో ఉన్న ఈ రెండు జట్లకు తాజా మ్యాచ్‌లో గెలుపు అత్యంత కీలకం. మున్ముందు ప్లే ఆఫ్ అవకాశాలు జటిలం కాకుండా చూసుకోవాలంటే ఇందులో విజయం తప్పనిసరి. కాబట్టి ఈ మ్యాచ్‌లో రెండు జట్లు స్పెషల్ ఫోకస్‌తో ఆడే అవకాశం ఉంది. తమ చివరి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై గెలవడంతో సన్ రైజర్స్ ఒకింత ఆత్మవిశ్వాసంతో బరిలో దిగనుంది. గత మ్యాచ్‌లో లాగే ఈ మ్యాచ్‌లోనూ బౌలింగ్,బ్యాటింగ్‌లో సమిష్టిగా రాణించాలని భావిస్తోంది.

CSK vs SRH Preview Ambati Rayudu comeback big boost as Chennai take on upbeat Hyderabad

నేటి మ్యాచ్‌లో స్టార్ బ్యాట్స్‌మెన్ అంబటి రాయుడు చెన్నై జట్టు తరుపున బరిలో దిగుతుండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. ముంబైతో మొదటి మ్యాచ్‌లో రాయుడు గాయపడి చెన్నై జట్టుకు దూరమయ్యాక.. ఆ జట్టు ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. రాయుడి చేరికతో చెన్నై జట్టు బ్యాటింగ్ బలోపేతం కానుంది. రాయుడు టాప్ ఆర్డర్‌లో ఆడితే మురళీ విజయన్‌ను పక్కన పెట్టే అవకాశం ఉంది. ఇప్పటివరకూ ఆడిన మూడు మ్యాచ్‌లలో విజయ్ విఫలమయ్యాడు. ఇక ఫామ్ కోల్పోయి సతమతమవుతున్న కేదార్ జాదవ్ స్థానంలో బ్రావో జట్టులో చేరవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+