ప్రస్తుత ఈఎంఐలు మీ పర్సనల్ లోన్ అర్హతను తగ్గిస్తాయా?

మీరు ఒక పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేసినప్పుడు ప్రస్తుతం ఉన్న ఈఎంఐలు మీ ఆర్ధిక ప్రొఫైల్ లో ఒక ముఖ్యమైన భాగం అవుతాయి. అవి మీ నెలవారి ఆదాయములో ఇప్పటికే ఋణ తిరిగిచెల్లింపుల బాధ్యత మీపై ఎంత ఉందు అనేది చూపుతాయి మరియు మరొక అదనపు ఈఎంఐని మీరు సౌకర్యవంతంగా నిర్వహించగలరా అని అంచనావేయడములో ఋణదాతలకు సహాయపడతాయి. అధిక ఈఎంఐ భారము మీ పర్సనల్ లోన్ అర్హతను తగ్గించవచ్చు, అందించబడే ఋణ మొత్తాన్ని ప్రభావితం చేయవచ్చు లేదా అందుబాటులో ఉన్న తిరిగిచెల్లింపు నియమాలను ప్రభావితం చేయవచ్చు.

అయితే, ప్రస్తుతం ఒక ఋణం ఉండడం వలన మీరు ఆటోమాటిక్ గా అనర్హులు కారు. మీ ఆదాయము, క్రెడిట్ స్కోర్, ఉపాధి స్థిరత్వము, తిరిగిచెల్లింపు చరిత్ర మరియు ఇతర ఆర్ధిక బాధ్యతలు కూడా ఋణదాత నిర్ణయాన్ని ప్రభావితం చేస్తాయి.

మీరు ఒక పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేయాలని అనుకుంటూ ఉంటే, ప్రస్తుతం ఉన్న ఈఎంఐలు మీ అర్హతను ఎలా ప్రభావితం చేస్తాయి అనేది అర్థంచేసుకోవడం మీరు బాధ్యతాయుతంగా ఋణం తీసుకోవడములో మరియు తగిన ఋణాన్ని సురక్షితం చేసుకోవడానికి మీకు ఉన్న అవకాశాలను మెరుగుపరచడానికి సహాయపడుతుంది

do-existing-emis-reduce-personal-loan-eligibility-factors-you-should-know

ప్రస్తుత ఈఎంఐలు మీ పర్సనల్ లోన్ అర్హతను ఎలా ప్రభావితం చేస్తాయి?

మీ నెలవారి ఈఎంఐలు మీ ప్రస్తుత ఆర్ధిక బాధ్యతలను సూచిస్తాయి. మీరు ఒక పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేసినప్పుడు, ఋణదాతలు మీరు మరొక ఋణాన్ని సౌకర్యవంతంగా తిరిగిచెల్లించగలరా లేదా అని నిర్ణయించుటకు మీ బాధ్యతలతోపాటు మీ ఆదాయాన్ని సమీక్షిస్తారు.
వాళ్ళు సాధారణంగా ఈ క్రింది అంశాలను అంచనావేస్తారు:

  • నెలవారి ఆదాయము
  • నెలవారి ఖర్చులు
  • నగరము
  • పుట్టిన తేది

ఒకవేళ మీ ప్రస్తుత ఈఎంఐలు మీ నెలవారి ఆదాయములో గణనీయమైన భాగము అయితే, ప్రస్తుతం మీకు ఉన్న తిరిగిచెల్లింపు సామర్థ్యం తగ్గుతుంది. దీని ఫలితంగా, ఋణదాత మీకు తక్కువ ఋణ మొత్తాన్ని లేదా మీ ఆర్ధిక వివరాల ఆధారంగా వేరొక తిరిగిచెల్లింపు కాలాన్ని అందించవచ్చు.

ఋణదాతలు ప్రస్తుత ఈఎంఐలను ఎందుకు పరిగణిస్తారు?
ఋణగ్రహీతలు ఋణ తిరిగిచెల్లింపులను సౌకర్యవంతంగా ఎలాంటి ఆర్ధిక ఒత్తిడి లేకుండా నిర్వహించుకోగలుగుతారు అని నిర్ధారించుకోవడమే ఋణదాతల లక్ష్యము. ప్రస్తుత ఈఎంఐలు ద్వారా వాళ్ళు మీ ప్రస్తుత ఋణ బాధ్యతలను అర్థంచేసుకోవడానికి మరియు మరొక ఋణము తీసుకోవడం సరైనదేనా అని అంచనావేయడములో సహాయపడతాయి.

మీ తిరిగిచెల్లింపు బాధ్యతలను సమీక్షించడం అనేది బాధ్యతాయుతమైన ఋణ విధానాలకు సహకరిస్తుంది మరియు సమయానికి వాయిదా చెల్లించకపోవడం వలన జరిగే నష్టాన్ని తగ్గించడములో సహాయం చేస్తుంది.

పర్సనల్ లోన్ అర్హత కాలిక్యులేటర్ ఏ విధంగా సహాయపడుతుంది?
ఒక పర్సనల్ లోన్ అర్హత కాలిక్యులేటర్ మీ ఆర్ధిక వివరాల ఆధారంగా మీరు ఎంత ఋణ మొత్తానికి అర్హత కలిగి ఉన్నారు అనేదాని గురించి అంచనా ఇస్తుంది.
సాధారణంగా, మీరు ఈ క్రింది సమాచారాన్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది:

  • నెలవారి ఆదాయము
  • ప్రస్తుతం ఉన్న ఈఎంఐలు
  • ఉపాధి రకము
  • ప్రాధాన్యత ఋణ కాలవ్యవధి

ఈ కాలిక్యులేటర్ క్షణాలలో ఋణము తీసుకునే సామర్థ్యము గురించిన అంచనాను అందిస్తుంది. ఫలితము కేవలం సూచనాత్మకమైనా కూడా, ఇది ఒక ఋణ దరఖాస్తును సబ్మిట్ చేసే ముందు మీ ఆర్ధిక వ్యవహారాలను ప్రణాళిక చేసుకోవడములో మీకు సహాయపడుతుంది.

మీ పర్సనల్ లోన్ అర్హతను ఏ అంశాలు ప్రభావితం చేస్తాయి?
ప్రస్తుతం ఉన్న ఈఎంఐలు అంచనాలో ఒక భాగం మాత్రమే. ఋణదాతలు ఒక పర్సనల్ లోన్ ను ఆమోదించేముందు అనేక ఇతర అంశాలను కూడా పరిగణిస్తారు.

నెలవారి ఆదాయము
అధిక మరియు స్థిరమైన ఆదాయము మీ తిరిగిచెల్లింపు సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది, ఇది మీ అర్హతను పెంచవచ్చు.

క్రెడిట్ స్కోర్
ఒక మంచి క్రెడిట్ స్కోర్ మీ బాధ్యతాయుతమైన క్రెడిట్ ప్రవర్తనను ప్రతిబింబిస్తుంది. క్రమానుసార ఈఎంఐ చెల్లింపులు మరియు సరైన సమయానికి చేసే బిల్లు చెల్లింపులు ఆరోగ్యకరమైన క్రెడిట్ ప్రొఫైల్ ను నిలిపి ఉంచడములో మీకు సహాయపడవచ్చు.

ఉపాధి సుస్థిరత
స్థిరమైన ఆదాయము మరియు నిలకడగా ఉన్న ఉపాధి రికార్డులు ఉన్న ఉద్యోగులు మరియు స్వయం-ఉపాధి పొందిన దరఖాస్తుదారులు ఎక్కువ యోగ్యత కలిగి ఉంటారు.

ఋణ కాలవ్యవధి
సుదీర్ఘ తిరిగిచెల్లింపు కాలవ్యవధిని ఎంచుకోవడం వలన మీ నెలవారి ఈఎంఐని తగ్గించవచ్చు, అయితే అది ఋణకాలములో చెల్లించవలసిన మొత్తం వడ్డీని పెంచవచ్చు.

ప్రస్తుత ఆర్ధిక బాధ్యతలు
ఋణము ఈఎంఐలు కాకుండా, ఋణదాతలు మీ తిరిగిచెల్లింపు సామర్థ్యాన్ని అంచనావేసేటప్పుడు మీ ఆర్ధిక బాధ్యతలను కూడా పరిగణించవచ్చు.

మీ పర్సనల్ లోన్ అర్హతను మీరు మెరుగుపరచుకోగలరా?

మీ అర్హత అనేక అంశాలపై ఆధారపడి ఉండగా, మీరు దరఖాస్తు చేసే ముందు మీ ఆర్ధిక ప్రొఫైల్ ను బలోపేతం చేసుకోవచ్చు.
మీరు వీటిని పరిగణించవచ్చు:

  • ప్రస్తుత ఈఎంఐలను సరైన సమయానికి చెల్లించడం.
  • వీలైతే, బాకీ ఉన్న ఋణాన్ని తగ్గించుకోవడం.
  • తక్కువ కాలములో అనేక ఋణ దరఖాస్తులను నివారించడం.
  • మంచి క్రెడిట్ స్కోర్ నిలిపి ఉంచడం.
  • అనుకూలమైన తిరిగిచెల్లింపు కాలవ్యవధిని ఎంచుకోవడం.
  • మీకు నిజంగా కావలసిన మొత్తము కొరకు మాత్రమే దరఖాస్తు చేయడం.

బాధ్యతాయుతంగా ఋణం తీసుకోవడం అనేది మీ అర్హతను మెరుగుపరచడం మాత్రమే కాకుండా మీ తిరిగిచెల్లింపులను సౌకర్యవంతంగా నిర్వహించుకోవడములో కూడా సహాయపడుతుంది.

ఎందుకు పర్సనల్ లోన్ సౌకర్యవంతమైన ఆర్ధిక ఎంపిక అవుతుంది?
అనేక విధాలైన ప్రణాళిక చేయబడిన మరియు అనుకోని ఖర్చులకు ఎలాంటి తాకట్టు పెట్టవలసిన అవసరం లేకుండా ఉపయోగించుకోవచ్చు కాబట్టి పర్సనల్ లోన్ అనుకూలతను అందిస్తుంది.
మీరు దీనికి ఈ అవసరాలకు ఉపయోగించవచ్చు:

  • వైద్య అత్యవసర పరిస్థితులు
  • ఉన్నత విద్య
  • పెళ్ళి ఖర్చులు
  • ఇంటి పునరుద్ధరణ
  • ప్రయాణ ఖర్చులు

బజాజ్ ఫైనాన్స్ పర్సనల్ లోన్ 12 నెలల నుండి 108 నెలల వరకు తిరిగిచెల్లింపు కాలవ్యవధులతో రూ. 40,000 నుండి రూ. 55 లక్షల వరకు ఉండే ఋణ మొత్తాలను అందిస్తుంది. వడ్డీ రేట్లు మీ అర్హత మరియు క్రెడిట్ ప్రొఫైల్ ఆధారంగా ఏడాదికి 10% నుండి 30.5% ఉంటాయి. ఈ ఋణానికి ఎలాంటి తాకట్టు అవసరం లేదు మరియు అర్హులైన దరఖాస్తుదారులకు సత్వర ఆమోదము, నామమాత్రపు డాక్యుమెంటేషన్ మరియు 24 గంటలలోపు పంపిణీతో వస్తుంది.

బజాజ్ ఫైనాన్స్ పర్సనల్ లోన్ కోసం ఎవరు దరఖాస్తు చేయవచ్చు?
అర్హత అనేది ఋణదాతల ప్రమాణాలు మరియు మీ ఆర్ధిక ప్రొఫైల్ పై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా, దరఖాస్తుదారులు ఈ క్రింది అంశాల ఆధారంగా అంచనావేయబడతారు:

జాతీయత భారతీయులు
వయసు 21 సంవత్సరాల నుండి 80 సంవత్సరాలు*.
ఉద్యోగము ప్రభుత్వము, ప్రైవేట్ లేదా ఎంఎన్‎సి
CIBIL స్కోర్ 650 లేదా అంతకంటే ఎక్కువ
వినియోగదారు ప్రొఫైల్ స్వయం-ఉపాధి పొందినవారు లేదా ఉద్యోగులు

*ఋణము కాలవ్యవధి ముగిసే సమయానికి మీ వయసు 80 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువగా ఉండాలి.
ప్రతి దరఖాస్తు విడివిడిగా అంచనావేయబడుతుంది కాబట్టి అర్హత ప్రమాణలను నెరవేర్చడం మాత్రమే ఋణ ఆమోదానికి హామీ కాదు.

సాధారణంగా ఏయే దస్తావేజులు అవసరం అవుతాయి?
బజాజ్ ఫైనాన్స్ పర్సనల్ లోన్ కోసం డాక్యుమెంటేషన్ ఆవశ్యకతలు నామమాత్రంగా ఉంటాయి. దరఖాస్తు సమయములో అవసరం అయిన దస్తావేజుల జాబితా ఈ క్రింద ఇవ్వబడింది:

డాక్యుమెంట్ వర్గము అంగీకరించబడే ఎంపికలు
KYC రుజువు ఆధార్ / పాస్పోర్ట్ / వోటర్ ఐడి / డ్రైవింగ్ లైసెన్స్ / నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ లేఖ / ఎన్‎ఆర్‎ఈజిఏ జాబ్ కార్డ్
గుర్తింపు రుజువు PAN కార్డు, వాస్తవ-సమయ చిత్రము / ఫోటో
ఉద్యోగం రుజువు ఉద్యోగి ఐడి కార్డు, ఉద్యోగ యజమాని జారీ చేసిన వసతి కేటాయింపు లేఖ
ఆదాయ రుజువు వేతన చీటీలు - గత 3 నెలలు, బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్స్ - గత 3 నెలలు
ఇతరములు పెన్షన్ ఆర్డర్, యుటిలిటి బిల్, ఫోన్ బిల్, పైప్డ్ గ్యాస్ బిల్, ఆస్తి / మునిసిపల్ పన్ను రసీదు

తిరిగిచెల్లింపు ఎంపికలు మెరుగైన ఆర్ధిక ప్రణాళికకు ఎలా సహకరిస్తాయి?
సరైన తిరిగిచెల్లింపు కాలవ్యవధిని ఎంచుకోవడం అనేది మీ నెలవారి బడ్జెట్ ను నిర్వహించుకోవడములో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

తక్కువ కాలవ్యవధి చెల్లించదగిన మొత్తాన్ని తగ్గించవచ్చు కాని మీ నెలవారి ఈఎంఐని పెంచుతుంది దీర్ఘకాలిక కాలవ్యవధి మీ నెలవారి ఈఎంఐని తగ్గించవచ్చు కాని తిరిగిచెల్లింపులు ఎక్కువ కాలానికి విస్తరిస్తాయి.

ఒక పర్సనల్ లోన్ కోసం మీరు దరఖాస్తు చేసే ముందు, మీ బడ్జెట్ కు సరిపోయే తిరిగిచెల్లింపు ఎంపికను ఎంచుకోవటానికి మీ నెలవారి ఆదాయము, ప్రస్తుత ఈఎంఐలు మరియు ఆర్ధిక లక్ష్యాలను అంచనా వేయండి.

బాధ్యతాయుతంగా ఋణము తీసుకోవడం అనేది ఆర్ధిక స్థిరత్వాన్ని నిలిపి ఉంచుకోవడములో సహాయపడుతుంది

ఒక పర్సనల్ లోన్ తీసుకోవడం అనేది అనవసరమైన ఆర్ధిక ఒత్తిడిని సృష్టించకుండా మీ ఆర్ధిక లక్ష్యాలకు సహకరించాలి.

ఋణము తీసుకునేముందు:

  • మీ నెలవారి తిరిగిచెల్లింపు సామర్థ్యాన్ని అంచనావేయండి.
  • మీకు కావలసినంత మొత్తం మాత్రమే ఋణము తీసుకోండి.
  • అన్ని ఈఎంఐలను సరైన సమయాన్ని చెల్లించడం కొనసాగించండి.
  • మీ ఋణ సామర్థ్యాన్ని అంచనా వేయుటకు మీరు పర్సనల్ లోన్ అర్హత కాలిక్యులేటర్ ఉపయోగించండి.
  • ఆఫర్ ను అంగీకరించే ముందు ఋణ నియమాలను జాగ్రత్తగా చదవండి.

బాధ్యతాయుతంగా ఋణము తీసుకోవడం వలన మీరు మీ ఆర్ధిక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించుకుంటూ ఆరోగ్యకరమైన క్రెడిట్ ప్రొఫైల్ ను నిలిపి ఉంచవచ్చు.

ప్రస్తుత ఈఎంఐలు మీ పర్సనల్ లోన్ అర్హతను నిర్ణయించడములో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి, ఎందుకంటే అవి మీ నెలవారి తిరిగిచెల్లింపు సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తాయి. మీ ఆదాయము, క్రెడిట్ ప్రొఫైల్, ఉపాధి స్థిరత్వము మరియు తిరిగిచెల్లింపు చరిత్రతోపాటు అవి మీరు బాధ్యతాయుతంగా ఎంత ఋణము తీసుకోగలుగుతారు అనేని అంచనావేయుటకు ఋణదాతలకు సహాయపడతాయి. దరఖాస్తు చేసే ముందు పర్సనల్ లోన్ అర్హత కాలిక్యులేటర్ ఉపయోగించడం వలన మీరు ఉపయోగకరమైన అంచనా అందిస్తుంది మరియు మీ ఆర్ధిక వ్యవహారాలను నమ్మకంగా ప్రణాళిక చేసుకోవడములో సహాయపడుతుంది.
*షరతులు వర్తిస్తాయి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+