అమెరికా దాడులు చేస్తే తీవ్రమైన ప్రతి దాడులు చేస్తాం: ఖమేనీ వార్నింగ్

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్- అమెరికా మధ్య మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్, అమెరికా జరిపే దాడులకు ఎలా ప్రతిస్పందించాలో ఇరాన్ ఆర్మీకి, ప్రజలకు తెలుసని అన్నారు. " ఒకవేళ శత్రు దేశాలు ఇరాన్ పై మిలిటరీ దాడులు కానీ టెర్రరిస్ట్ దాడులకు గానీ పాల్పడితే వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టి ప్రతి దాడులు ఎలా చేయాలో ఇరాన్ ఆర్మీకి బాగా తెలుసు" అని అన్నారు. ఇరాన్ పై ఇజ్రాయెల్- అమెరికా దాడులు చేస్తాయని వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

శత్రు దేశాలు దాడులకు పాల్పడితే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తక్షణమే తీవ్రతరమైన ప్రతి దాడులు చేపట్టాలని సమర్థవంతంగా దాడులు ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఎటువంటి భౌగోళిక పరిమితులు లేని రీతిలో దాడులను వెంటనే ఉద్ధృతం చేయాలని స్పష్టం చేశారు. ఈ మేరకు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ.. ఇరాన్ మిలిటరీ అధికారులతో సమావేశం నిర్వహించినట్లు సమాచారం అందుతోంది. ఈ సమీక్షలోనే ఖమేనీ కీలక ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

అలాగే ఇరాన్ టార్గెట్ కు సంబంధించిన లిస్టును మరోసారి చెక్ చేయాలని ఖమేనీ.. ఇరాన్ ఆర్మీ అధికారులకు సూచనలు చేశారు. అమెరికా- ఇరాన్ లో ఎక్కడెక్కడ దాడులు చేయాలని అనుకుంటున్నారో ఆ ప్రాంతాలు, స్థావరాలకు సంబంధించిన లిస్టును మరోసారి చెక్ చేసుకోవాలని సూచనలు చేశారు. ఇక ఖమేనీ తాజాగా ఇచ్చిన వార్నింగ్ తో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి తీవ్రతరం అయ్యాయి. ఈ ఏడాది జూన్ లో ఇరు దేశాల మధ్య 12 రోజులు యుద్ధం ముగిసిన తర్వాత ఈ రేంజ్ లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడటం ఇదే తొలిసారి అని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక గతంలో ఇరు దేశాల మధ్య సీజ్ ఫైర్ అయిన సంగతి తెలిసిందే.

Iran Supreme Leader warning US Israel stating that they not anyone else will decide when war ends

ఇక అటు ఇరాన్ తో యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ తో యుద్ధాన్ని ముగించడానికి అమెరికా ఏమాత్రం తొందరపడడం లేదన్నారు. ఏడు నెలలకు పైగా సాగుతున్న ఈ యుద్ధాన్ని అసాధారణ యుద్ధంగా పరిగణించలేమని పేర్కొన్నారు. అలాగే అమెరికాతో చర్చలు జరిపేందుకు ఇరాన్ ఆసక్తి చూపిస్తోందని అన్నారు. ఆ దేశం ప్రస్తుతం చాలా ఇబ్బందుల్లో ఉందని విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+