చిక్కుల్లో వెంకీ - త్రివిక్రమ్ సినిమా.. 'ఆదర్శ కుటుంబం'పై కాపీరైట్ వివాదం!

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా 'ఆదర్శ కుటుంబం'. భారీ అంచనాల నడుమ థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన వస్తోంది. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.16 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించినప్పటికీ.. వెంకటేష్-త్రివిక్రమ్ వంటి క్రేజీ కాంబినేషన్‌కు ఈ గణాంకాలు ఆశించిన స్థాయిలో లేవనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. వీకెండ్‌లో వసూళ్లు పుంజుకుంటాయని సినిమా బృందం ధీమాగా ఉన్న తరుణంలో.. ఈ చిత్రాన్ని ఓ అనూహ్య కాపీరైట్ వివాదం చుట్టుముట్టింది.

వస్తాడు.. ప్లాఫ్ ఇస్తాడు.. వెళ్తాడు.. రిపీటు..!
వస్తాడు.. ప్లాఫ్ ఇస్తాడు.. వెళ్తాడు.. రిపీటు..!

ఎస్ఎల్టీ ఫిల్మ్స్ పతాకంపై 'పర్ణశాల' అనే హారర్-కామెడీ థ్రిల్లర్‌ను నిర్మిస్తున్న ప్రముఖ నిర్మాత మంచి వెంకట్.. 'ఆదర్శ కుటుంబం' నిర్మాతలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ సినిమాలో ఉపయోగించిన ఓ జానపద గేయాన్ని 'ఆదర్శ కుటుంబం' సినిమాలో అనుమతి లేకుండా వాడారని ఆయన ఆరోపించారు.

Venkatesh and Trivikram Aadarsha Kutumbam Movie Faces Copyright Controversy Over Folk Song Details

జిమ్ జిమ్ తారా పాటపై వివాదం
జానపద కళాకారిణి జి.లక్ష్మీదేవి రచించి, ఆలపించిన 'జిమ్ జిమ్ తారా' అనే ఫోక్ సాంగ్ యూట్యూబ్‌తో పాటు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ పాటకు సంబంధించిన దాదాపు 15 సెకన్ల భాగాన్ని ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోకుండా 'ఆదర్శ కుటుంబం' సినిమాలో ఉపయోగించారని నిర్మాత మంచి వెంకట్ పేర్కొన్నారు. ఓ పెద్ద సినిమా నిర్మాణ సంస్థ తమ లాంటి చిన్న నిర్మాతల కష్టాన్ని, మేధో సంపత్తిని అనుమతి లేకుండా వాడుకోవడం సరికాదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యల వల్ల చిన్న సినిమాలకు రావాల్సిన గుర్తింపు, ప్రచార ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కాపీరైట్ ఉల్లంఘనపై న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు 'పర్ణశాల' చిత్రబృందం సమాయత్తమవుతున్నట్లు సమాచారం.

'ఆదర్శ కుటుంబం’ రివ్యూ: వెంకీ-త్రివిక్రమ్ మ్యాజిక్ వర్కౌట్ అయిందా?
'ఆదర్శ కుటుంబం’ రివ్యూ: వెంకీ-త్రివిక్రమ్ మ్యాజిక్ వర్కౌట్ అయిందా?

బాక్సాఫీస్ ఒత్తిడిలో మేకర్స్
ఓ వైపు థియేటర్లలో సినిమా కలెక్షన్లు పెరగడానికి అనుకూలమైన టాక్ అవసరమైన సమయంలో 'జిమ్ జిమ్ తారా' పాట వివాదం బయటకు రావడం 'ఆదర్శ కుటుంబం' చిత్ర బృందాన్ని తీవ్ర ఒత్తిడిలోకి నెట్టింది. మరి ఈ వ్యవహారంపై 'ఆదర్శ కుటుంబం' నిర్మాతలు స్పందించి వివాదాన్ని సర్దుబాటు చేసుకుంటారో లేక లీగల్‌గా ముందుకు వెళ్తారో వేచి చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+