తూర్పుగోదావరి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇంట్లో భజన చేశారు .. తూర్పు గోదావరి జిల్లాలో ఒకే కుటుంబంలో 21 మందికి కరోనా భజాయించింది

|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. మరోమారు ప్రళయంలో విరుచుకుపడుతుంది. కరోనా మొదటి వేవ్ కంటే కరోనా సెకండ్ వేవ్ మరింత ప్రమాదకరంగా మారుతుంది . ఇటు దేశవ్యాప్తంగానే కాకుండా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ఒకపక్క కేసుల పెరుగుదల ఎక్కువగా ఉందని అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వాలు చెబుతున్నా పట్టించుకోని ప్రజల తీరు కేసుల పెరుగుదలకు కారణం గా మారుతోంది.

వచ్చే ఎన్నికల్లో మన పార్టీదే విజయం..నేనే తెలంగాణ సీఎం: నేతలతో వైయస్ షర్మిల (ఫోటోలు)

 తూర్పుగోదావరి జిల్లా తొండంగిలో కరోనా కలకలం

తూర్పుగోదావరి జిల్లా తొండంగిలో కరోనా కలకలం

తాజాగా తూర్పుగోదావరి జిల్లా తొండంగిలో కరోనా కలకలం సృష్టించింది. ఒకే ఉమ్మడి కుటుంబంలో 21 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడం స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల ఆ కుటుంబం ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లి వచ్చిన క్రమంలో, మరో నాలుగు కుటుంబాలతో కలిసి ఇంట్లో భజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ భజన కార్యక్రమంలో పాల్గొన్న వారికి కొందరికి జ్వరం రావడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నారు. దీంతో ఆధ్యాత్మిక భజన కార్యక్రమాల్లో పాల్గొన్న మొత్తం 21 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

ఒకే కుటుంబంలో 21 మందికి కరోనా పాజిటివ్.. అలెర్ట్ అయిన అధికారులు

ఒకే కుటుంబంలో 21 మందికి కరోనా పాజిటివ్.. అలెర్ట్ అయిన అధికారులు


ఒకే కుటుంబంలో 21 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో, అప్రమత్తమైన అధికారులు వీరిని కలిసిన ప్రైమరీ కాంటాక్ట్ లకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక గ్రామం మొత్తం శానిటైజ్ చేసి గ్రామస్తులకు కరోనా జాగ్రత్తలు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ ఇప్పటికే పలు మార్గదర్శకాలను జారీ చేసింది.

కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని జిల్లాల అధికార యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది .

కరోనా నియంత్రణకు ప్రయత్నం చేస్తున్న ఏపీ సర్కార్ .. ప్రజల సహకారం అవసరం

కరోనా నియంత్రణకు ప్రయత్నం చేస్తున్న ఏపీ సర్కార్ .. ప్రజల సహకారం అవసరం

వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా యుద్ధ ప్రాతిపదికన కొనసాగించాలని, స్కూళ్లు, కాలేజీలు యధావిధిగా నిర్వహించాలని, జనజీవనానికి ఇబ్బంది లేకుండా ఉండేలా కరోనా నిబంధనలు పాటిస్తూ కరోనా కట్టడికి పనిచేయాలని ఏపీ సర్కార్ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే కరోనా నిబంధనలు పాటించాలని అటు ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇలాగే భారీగా కేసులు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది.

English summary
Recently, the Corona created a stir in Thondagi, East Godavari district. The fact that 21 people in a single joint family have been diagnosed with a corona positive . Recently the family arranged a bhajan program at home with four other families in order to went on a spiritual journey. Some of the participants in the bhajan program underwent corona tests due to fever. This confirmed the corona positive for a total of 21 people who participated in the spiritual worship activities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X