టీడీపీకి రెబెల్స్ షాక్: చేజారిన మేయర్ పదవి: భారీ మెజారిటీ ఉన్నా..!
కాకినాడ: కాకినాడ మేయర్ సుంకర పావని తన పదవిని కోల్పోయారు. తెలుగుదేశం పార్టీకి చెందిన తిరుగుబాటు కార్పొరేటర్లు ఆమెపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఈ అవిశ్వాసానికి తీర్మానానికి అనుకూలంగా 36 మంది కార్పొరేటర్లు ఓటు చేశారు. పావనికి అనుకూలంగా వారు ఎవరూ కూడా నిల్చోలేదు. అవిశ్వాస తీర్మానానికి ఒక్క కార్పొరేటర్ కూడా వ్యతిరేకతను వ్యక్తం చేయలేదు. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసిన వారిలో తెలుగుదేశం పార్టీ తిరుగుబాటు కార్పొరేటర్లు 21 మంది ఉన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎనిమిది మంది, భారతీయ జనతా పార్టీకి చెందిన ఇద్దరు కార్పొరేటర్లు ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. ఇద్దరు ఇండిపెండెంట్లు సైతం టీడీపీ తిరుగుబాటు కార్పొరేటర్ల వైపే మొగ్గ చూపారు. సుంకర పావనికి వ్యతిరేకంగా ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని సమర్థించారు. కాకినాడ రూరల్ శాసన సభ్యుడు, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, స్థానిక లోక్‌సభ సభ్యురాలు వంగా గీత, కాకినాడ సిటీ శాసన సభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎక్స్ ఆఫీషియో హోదాలో పాల్గొన్నారు.

వారంతా టీడీపీ తిరుగుబాటు కార్పొరేటర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలికారు. సుంకర పావనిపై ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా మొత్తం 36 ఓట్లు పడ్డాయి. కోర్టు తీర్పు నేపథ్యంలో ఈ నెల 22వ తేదీ వరకూ సుంకర పావని మేయర్‌గా కొనసాగుతారు. కాకినాడ కార్పొరేషన్‌పై తెలుగుదేశం పార్టీకి గట్టి పట్టు ఉంది. ప్రస్తుతం ఉన్న 44 మంది కార్పోరేటర్లలో టీడీపీకి చెందిన వారే మెజారిటీ సంఖ్యలో ఉన్నారు.
కాకినాడ మేయర్, డిప్యూటీ మేయర్‌పై అవిశ్వాస తీర్మానానికి సంబంధించి ఇవాళ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రిసైడింగ్ అధికారి, జాయింట్ కమిషనర్ లక్ష్మీష అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మూజువాణి ద్వారా ఓటింగ్ నిర్వహించారు. మేయర్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకించే వారు చేతులు ఎత్తాలని కోరగా.. ఎవ్వరూ అనుకూలతను వ్యక్తం చేయలేదు. వ్యతిరేకంగా చేతులు ఎత్తాలని సూచించగా.. కార్పొరేటర్లందరూ ఇందులో పాల్గొన్నారు. అవిశ్వాసానికి మద్దతుగా చేతులు ఎత్తారు.
దీనితో సుంకర పావని తన మేయర్ పదవిని కోల్పోయినట్టయింది. కోర్టులో కేసు నడుస్తున్నందున.. తీర్పు వెలువడిన తరువాతే ఈ ఫలితాలను వెల్లడిస్తారు. అప్పటిదాకా ఈ ఫలితాన్ని రిజర్వ్ చేశారు. కోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఈ ఫలితాలను వెల్లడిస్తామని కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పేర్కొన్నారు. అప్పటిదాకా సుంకర పావని ఆపద్ధర్మ మేయర్‌గా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో ఎలాంటి కీలక నిర్ణయాలను కూడా తీసుకోకూడదని చెబుతున్నారు.
టీడీపీకి రెబెల్స్ షాక్: చేజారిన మేయర్ పదవి: భారీ మెజారిటీ ఉన్నా..!#TDP, #EastGodavari, #SunkaraPavani pic.twitter.com/xecu7ygbeP
— oneindiatelugu (@oneindiatelugu) October 5, 2021
టీడీపీకి రెబెల్స్ షాక్: చేజారిన మేయర్ పదవి: భారీ మెజారిటీ ఉన్నా..!#TDP, #EastGodavari, #SunkaraPavani pic.twitter.com/gg65qbDsqU
— oneindiatelugu (@oneindiatelugu) October 5, 2021












Click it and Unblock the Notifications