వీడు మాములోడు కాదు.. లాంగ్ డ్రైవ్ అని చెప్పి.. గదిలో బంధించి
గొర్రె కసాయినే నమ్ముతుంది.. అలాగే అమ్మాయిలు మోసం చేసే వారినే నమ్ముతారు. ఇదీ నిజం.. చాలా సందర్భాల్లో రుజువు కూడా అయ్యింది. అలా ఓ పోకిరి యువతిని ఛీట్ చేశాడు. మోసం అంటే మాములుగా కాదు.. లాంగ్ డ్రైవ్ పేరుతో.. బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో జరిగింది. వెంటనే పోలీసులు కేసును ఛేజ్ చేశారు.
స్నాప్ చాట్‌లో పరిచయం అయిన యువకుడితో లాంగ్ డ్రైవ్‌కు వెళ్లింది. ఆ తర్వాత చిక్కుల్లో పడింది. ఆ అమ్మాయిని ఓ గదిలో బంధించి డబ్బులు డిమాండ్ చేశాడు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆ యువకుడిని పట్టుకుని యువతిని రక్షించారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్ వంటి యాప్‌లలో అమ్మాయిలు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. సోషల్ మీడియాలో తెలియని వ్యక్తులతో స్నేహం చేయడంపై ఆలోచించాలి. ఇలాంటి విషయాలు తెలియకే ఓ విద్యార్థిని చిక్కుల్లో పడింది. తీరా అక్కడికి వెళ్లాక అతని నిజ స్వరూపం తెలుసుకుంది. హతవిధి అంటూ కుమిలిపోయింది. కానీ పోలీసులు వెంటనే చేరుకోవడంతో ప్రమాదం తప్పింది.

స్నాప్‌చాట్ ద్వారా పరిచయమైన యువకుడితో లాంగ్ డ్రైవ్‌కి వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకుంది. వాళ్ల కుటుంబ సభ్యులకు కూడా కంటిమీద కునుకు లేకుండా చేసింది. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో కిడ్నాప్ అయిన ఇంజనీరింగ్ విద్యార్థిని కేసును పోలీసులు ఛేదించారు. సీసీటీవీ ఆధారంగా కొన్ని గంటల్లోనే నిందితుడిని గుర్తించారు. భీమవరంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. స్నాప్ చాట్ ద్వారా పరిచయమైన ఫణీంద్ర అనే యువకుడు లాంగ్ డ్రైవ్‌కు వెళ్దామని విద్యార్థినిని నమ్మించాడు.
భీమవరం బులుసుమూడిలోని ఓ రూమ్‌లో నిర్భంధించాడు. యువతి కాళ్లు చేతులు కట్టేసి చేతిపై కత్తితో దాడి చేశాడు. ఇదంతా వీడియో తీసి వాటిని యువతి తల్లిదండ్రులకు పంపించాడు. 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు భీమవరంలో నిందితుడు ఫణీంద్రను అరెస్టు చేశారు. దీంతో యువతి సహా ఆమె పేరంట్స్ ఊపిరి పీల్చుకున్నారు.












Click it and Unblock the Notifications