ఏపీలో ప్రమాదకరంగా గోదావరి: హెచ్చరిక జారీ
Godavari floods 2024: వారం రోజుల కిందట సంభవించిన భారీ వర్షాలు, వరదల వల్ల రెండు తెలుగు రాష్ట్రాలను అల్లకల్లోలానికి గురయ్యాయి. దారుణంగా దెబ్బతిన్నాయి. పలు ప్రాంతాలు నీట మునిగాయి. పల్లెలు, పట్టణాలు అనే తేడా ఉండట్లేదు. నదులు, చెరువులు ఏకం అయ్యాయి. జనావాసాలన్నీ జలమయం అయ్యాయి.
ప్రత్యేకించి- రాజధాని అమరావతి ప్రాంతం మొత్తం నీట మునిగింది. విజయవాడలో ఇదే పరిస్థితి నెలకొంది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో వరద ఉధృతి నెలకొంది. వేలాదిమందిని ముంపు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రదేశాలకు తరలించారు అధికారులు.

అదే తరహా పరిస్థితులు తెలంగాణలోనూ ఏర్పడ్డాయి. ప్రత్యేకించి- ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, సూర్యాపేట్ జిల్లాలు దారుణంగా దెబ్బతిన్నాయి. విజయవాడలో బుడమేరు తరహాలోనే ఖమ్మంలో మున్నేరు వాగు పొంగిపొర్లింది. ఈ నగరాన్ని ముంచెత్తింది. మున్నేరు ఉధృతికి పలు కాలనీలు జలమయం అయ్యాయి.
ఇప్పుడు ఇదే తరహా పరిస్థితులు గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో సంభవించే ప్రమాదం లేకపోలేదు. గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతూ పోతోండటమే దీనికి ప్రధాన కారణం. తెలంగాణలోని భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం ప్రమాదకరంగా పెరిగింది. ప్రస్తుతం 43.3 అడుగులకు చేరింది.
మహారాష్ట్ర ఎగువ పరివాహక ప్రాంతాలు, ఉపనదుల్లో కొద్ది రోజులుగా కురుస్తోన్న వర్షాల వల్ల గోదావరి నది నీటిమట్టం గణనీయంగా పెరుగుతోంది. వివిధ ప్రాజెక్టుల నుంచి విడుదల చేసిన వరద జలాలు దీనికి తోడయ్యాయి. మహారాష్ట్రలోని నాందేడ్ సహా గోదావరి పరీవాహక ప్రాంతాల్లో నీటి మట్టం గరిష్ఠస్థాయికి చేరుకుంటోంది.
ప్రాణహిత, ఇంద్రావతి, తాలిపేరు, కిన్నెరసాని, శబరి వంటి ఉపనదుల వరద ప్రవాహం అధికంగా ఉండటం వల్ల గోదావరి క్రమంగా ఉప్పొంగుతోంది. నదీ పరీవాహక ప్రాంతాల్లో ఇప్పటికే హైఅలర్ట్ జారీ అయింది. మున్ముందు నదీ నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తోన్నారు.
బుధవారం నాడు భద్రాచలం వద్ద 42.2 అడుగుల నీటి మట్టం నమోదు కాగా.. ఇప్పుడది 43.3 అడుగులకు పెరిగడం దీనికి నిదర్శనం. దీని ప్రభావం ధవళేశ్వరం బ్యారేజీపై పడింది. ఇన్ ఫ్లో 10.52 లక్షల క్యూసెక్కులకు చేరింది. వచ్చిన వరద నీటిని వచ్చినట్టే దిగువకు విడుదల చేస్తోన్నట్లు ఏపీ విపత్తు నిర్వహణ విభాగం వెల్లడించింది. అవుట్ ఫ్లో 10.52 లక్షల క్యూసెక్కులు ఉంటోంది.
దీన్ని దృష్టిలో ఉంచుకుని జల వనరుల మంత్రిత్వ శాఖ అధికారులు ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications