చీరె పెట్టి, బొట్టు పెట్టి పిలవాలా?: పవన్ సమక్షంలో ఎమ్మెల్యే రాపాకకు అవమానం
గుంటూరు: జనసేన పార్టీ నుంచి అసెంబ్లీకి ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలోనే ఆయన అవమానాన్ని ఎదుర్కొన్నారు. జనసేన పార్టీలో నంబర్ టూగా గుర్తింపు పొందిన నాదెండ్ల మనోహర్.. రాపాకపై ఆగ్రహాన్ని ప్రదర్శించారు. మీరు ఆలస్యంగా వస్తే.. మేమేం చేసేది. చీర పెట్టి, బొట్టు పెట్టి పిలవాలా?.. అంటూ రాపాకను ఉద్దేశించిన వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తాజాగా వైరల్ గా మారింది. నాదెండ్ల మనోహర్ వైఖరిపై సొంత క్యాడర్ నుంచే వ్యతిరేకత ఎదురవుతోంది.
పవన్ కల్యాణ్ ఇటీవలే ఓ సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్, పార్టీ సీనియర్ నాయకుడు వేదికపై కూర్చున్నారు. రాపాక వరప్రసాద్ ఆలస్యంగా వచ్చారు. వచ్చిన వెంటనే నేరుగా ఆయన పవన్ కల్యాణ్ వద్దకు వెళ్లారు. ఆలస్యంగా రావడానికి కారణాన్ని రాపాక వివరిస్తుండగా.. నాదెండ్ల మనోహర్ తన కుర్చీ నుంచీ లేచారు. మీరు ఆలస్యంగా వస్తే మేమేం చేయాలి. కుర్చీలు వేయాలా? చీర పెట్టి, బొట్టు పెట్టి మిమ్మల్ని పిలవాలా? అంటూ అసహనంగా కనిపించారు. నాదెండ్ల మనోహర్ పక్కన వేసిన కుర్చీలో కూర్చున్నారు. నాదెండ్లను నచ్చ చెప్పారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నాదెండ్ల మనోహర్ వైఖరిపై జనసేన పార్టీ సోషల్ మీడియా విభాగం ప్రతినిధులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నాదెండ్ల మనోహర్ వల్లే పార్టీ నాశనమైందంటూ నిప్పులు చెరుగుతున్నారు. ఘాటుగా కామెంట్లు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ ను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
రాపాక వరప్రసాద్ పార్టీకి ఉన్న ఏకైక శాసనసభ్యుడ విషయాన్ని కూడా విస్మరించి, ఆయన పట్ల అవమానకరంగా ప్రవర్తించడం సరికాదని చెబుతున్నారు. పవన్ కల్యాణ్ సమక్షంలోనే ఇదంతా చోటు చేసుకున్నప్పటికీ.. ఆయన నోరు మెదపక పోవడం పట్ల ప్రతికూల సంకేతాలు వెళ్తాయని వాపోతున్నారు.
.@PawanKalyan నీకు ని పక్కన ఉన్న
— Ram (@KYADHAV20) October 11, 2019
సన్నాసికి గెలిచే scene లేదు .. మీ ఉప్మా మొహాలకి గెలిచింది ఒక్క సీట..
ఒక దళిత mla కి మీరు ఇచ్చే గౌరవం ఇదేనా ??#ShamelessJanasenani pic.twitter.com/wHXZNLtRKa












Click it and Unblock the Notifications