అంఫన్ తుఫాన్ వేళ.. తూర్పు గోదావరిలో విచిత్రం.. ఎగబడ్డ జనం..
తూర్పు గోదావరి జిల్లాలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. కొత్తపల్లిలో ఉప్పాడ సముద్ర తీర ప్రాంతానికి సమీపంలోని కొన్ని ఇళ్లు అలల ధాటికి ధ్వంసమయ్యాయి. ఈ క్రమంలో ఓ ఇంటి గోడల నుంచి వెండి నాణేలు బయటపడ్డాయి. దీంతో స్థానికులు వాటిని ఏరుకునేందుకు ఎగబడ్డారు.
గ్రామంలో సుమారు 8 ఇళ్లు ధ్వంసమైనట్టు తెలుస్తోంది. అందులో ఓ ఇంటి పునాది గోడ కూలిపోవడంతో.. అందులో వెండి నాణేలు బయటపడ్డట్టు చెబుతున్నారు. ఈ నాణేలు బ్రిటీష్ కాలం నాటివి అని అంటున్నారు. అప్పట్లో బొందు అమ్మోరయ్య,ఎల్లమ్మ అనే ధనవంతులైన మత్స్యకార కుటుంబం ఆ ఇంట్లో నివసించేదని.. ఆ సమయంలోనే గోడల్లో వెండి నాణేలు దాచిపెట్టి ఉంటారని అంటున్నారు.

Recommended Video
నాణేలు దొరికిన చాలామంది విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నట్టు సమాచారం. ఎక్కడా పురావస్తు శాఖ వారు తిరిగి వాటిని లాక్కెళ్లిపోతారేమోనన్న భయంతో తమకేమీ తెలియదని చెబుతున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి అంఫన్ తుఫాన్ వేళ తూర్పుగోదావరిలో చోటు చేసుకున్న ఈ ఘటన చర్చనీయాంశమైంది.












Click it and Unblock the Notifications