Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

విద్య పేరుతో లైంగిక వేధింపులు.. అక్కాచెళ్లెలు ఇద్దరికీ.. ఎక్కడ అంటే..

ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న ఇద్దరు అక్కా చెల్లెళ్లకు ఓ కీచకుడు వేధించాడు. చదువు చెప్పించే ముసుగులో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో వెలుగుచూసింది. తమకు చదువు చెప్పిస్తున్న వ్యక్తి వికృత రూపం చూసి పోలీసులను ఆశ్రయించారు అక్కా చెల్లెళ్లు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. దీంతో మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్పందించారు.

ఆర్థిక ఇబ్బందులు

ఆర్థిక ఇబ్బందులు

కాకినాడ రూరల్ పరిధిలోని గ్రామీణ ప్రాంతానికి చెందిన అక్కా చెల్లెళ్ళ కుటుంబ ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీంతో వారు కాకినాడ అశోక్ నగర్‌లోని మడికి రాజేశ్వర దయాళ్, రెండో భార్య స్వాతి వద్దు ఉంటున్నారు. దాదాపు 10 ఏళ్ల నుంచి వారి వద్దే ఉంటూ చదువుకుంటున్నారు. అయితే గత కొంతకాలం నుంచి రాజేశ్వర్ దయాళ్ ఇద్దరు యువతులను లైంగికంగా వేధించడం ప్రారంభించాడు.

పెళ్లి చేసుకోవాలని వేధింపులు

పెళ్లి చేసుకోవాలని వేధింపులు

తననుపెళ్లి చేసుకోవాలని వారిని ఇబ్బంది పెట్టాడు. అందుకు అతని రెండో భార్య కూడా మద్దతు ఇస్తూ వారిని ఒత్తిడి చేసింది. మాట వినకపోతే చంపేస్తానని బెదిరిస్తున్నాడు. చదువు చెప్పించి , ఆశ్రయం కల్పించి అండగా ఉంటున్నాడనుకున్న వ్యక్తి వికృత రూపం బయటపడటంతో అక్కా చెల్లెళ్లిద్దరూ తమ స్వగ్రామానికి చేరుకున్నారు. బాధిత యువతుల్లో ఒకరు తిమ్మాపురం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. భార్యాభర్తలపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 స్పందించిన వాసిరెడ్డి పద్మ

స్పందించిన వాసిరెడ్డి పద్మ

బాధిత యువతులకు రక్షణ కల్పించాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. వారిని వేధిస్తున్న రాజేశ్వర్ దయాళ్ పై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని ఆదేశాలు జారీ చేశారు. దీంతో పోలీసులు చర్యలకు ఉపక్రమించారు.

Recommended Video

    Temperatures Risen వడగాలులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. వేసవి చిట్కాలు Summer Safety Tips
     కఠిన చట్టాలు ఉన్నా సరే..

    కఠిన చట్టాలు ఉన్నా సరే..

    రోజుకో చోట లైంగిక వేధింపుల ఘటన వెలుగులోకి వస్తోంది. దగ్గరి వారే హరాస్ చేయడం విశేషం. అన్నీ ఘటనల్లో చర్యలు తీసుకుంటున్న మృగాళ్లలో ఆశించిన స్థాయిలో మార్పు రావడం లేదు. నిర్భయ, అభయ లాంటి చట్టాలు ఉన్నా సరే.. ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తప్పు చేసేవాడు మరింత రెచ్చిపోతున్నాడే తప్ప.. తగ్గడం లేదు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+