కుప్పకూలిన టీడీపీ వేదిక: చినరాజప్ప, చింతమనేనికి గాయాలు- సెటైర్లు షురూ

ఏలూరు: మహానాడులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన ఎన్నికల తొలి విడత మేనిఫెస్టోపై పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు సాగుతున్నాయి. ఊరూరా ప్రచార కార్యక్రమాలను చేపట్టారు టీడీపీ నాయకులు. మేనిఫెస్టోను జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు. రాష్ట్రాన్ని అయిదు జోన్లుగా విభజించి.. ఈ క్యాంపెయిన్‌ను నిర్వహిస్తోన్నారు.

ఇటీవలే చంద్రబాబు జెండా ఊపి ఈ అయిదు బస్సులను ప్రారంభించారు. మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలపై విస్తృతంగా ప్రచారం చేస్తోన్నారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జీలు ఇందులో పాల్గొంటోన్నారు. భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో అవగాహన సభలను నిర్వహిస్తోన్నారు. తాము అధికారంలోకి వస్తే అమలు చేయడానికి ప్రతిపాదించిన హామీల గురించి ప్రజలకు వివరిస్తోన్నారు.

A Dias, participated by the TDP leaders was collapsed

వీటి ప్రచారంలో భాగంగా ఏలూరు జిల్లాలోని నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో గల బత్తులవారి గూడెంలో నిర్వహించిన ప్రచార సభలో అపశృతి చోటు చేసుకుంది. హోం శాఖ మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రసంగిస్తోన్న సమయంలో వేదిక- ఒక్కసారిగా పూర్తిగా కుప్పకూలింది. చినరాజప్పతో పాటు వేదికపై కూర్చున్న మాజీ మంత్రులు పితాని సత్యనారాయణ, పీతల సుజాత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్.. ధబేల్ మంటూ కిందపడ్డారు.

దీనిపై అప్పుడే సోషల్ మీడియాలో సెటైర్లు మొదలయ్యాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులు పెద్ద ఎత్తున మీమ్స్‌కు పని చెప్పారు. ఈ సీన్ రామ్ గోపాల్ వర్మకు పనికొచ్చేలా ఉందంటూ ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకుల భవిష్యత్తుకే గ్యారంటీ లేకుండా పోయిందంటూ చురకలు అంటించడం మొదలుపెట్టారు. దీనితో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

రాజమండ్రిలో నిర్వహించిన మహానాడు వేదికపై నుంచి చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించిన విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన వెంటనే మహాశక్తి, యువగళం, ఇంటింటికీ మంచినీరు, పూర్ టు రిచ్, అన్నదాత, బీసీలకు రక్షణ చట్టం.. పేర్లతో కొత్త పథకాలను ప్రవేశపెడతానంటూ మహానాడు వేదికగా ప్రకటించారు. మహిళల స్వయం సమృద్ధి, యువతకు ఉపాధి కల్పించడాన్ని తన బాధ్యతగా తీసుకుంటానని చెప్పారు.

ఇందులో భాగంగా జగన్ ప్రభుత్వ అమలు చేస్తోన్న అమ్మ ఒడి తరహాలో తల్లికి వందనం పేరుతో ప్రతి సంవత్సరం 15,000 రూపాయలను తల్లుల అకౌంట్‌లో జమ చేయడం, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరినీ ఉచితంగా చదివించడం, కర్ణాటక తరహాలో మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం, బీజేపీ మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు వంట గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తానంటూ చంద్రబాబు ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+