లోకసభ ఎన్నికలు 2019 : ఏలూరు నియోజకవర్గం గురించి తెలుసుకోండి

ఏలూరు పట్టణంలో రాజకీయాలు ఎప్పటికప్పుడు కొత్త పోకడలను ప్రదర్శింస్తుయి. . మారుతున్న కాలం ప్రకారం ప్రజల ఆలోచనా దోరణి లో కూడా వేగవంతమైన మార్పు చోటుచేసుకుంటుంది. రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉండే ఏలూరు ప్రజానికం ఎక్కువ శాతం వివిధ వ్యాపారాలు చేస్తూ జీవనం కొనసాగిస్తుంటారు. ఒక సారి విజయం సాదించిన అభ్యర్థి పనితీరు, గుణగణాలను బట్టి వచ్చే ఎన్నికల్లో గెలుపోటములు ఆధారపడి ఉంటాయి, ప్రజోపయోగ కార్యక్రమాలు చేసిన అభ్యర్థులకు మాత్రమే ఏలూరు ప్రజలు పట్టం కడతారంటే రాజకీయ చైతన్యం ఎంత ఉందో అర్ధం చేసుకోవచ్చు.
ఏలూరు నగరం ప్రధానంగా జాతీయ రహదారి వెంట విస్తరించి ఉంది. పట్టణం మధ్యగా తమ్మిలేరు కాలువ ప్రవహిస్తుంది.స్థూలంగా పట్టణాన్ని I టౌన్మరియు II టౌన్ గా విభజించవచ్చు. అయితే పోస్టల్ వారి ప్రకారం ఏలూరు-1 , ఏలూరు-2, ఏలూరు-3 ఏలూరు-4, ఏలూరు-5 , ఏలూరు-6 , ఏలూరు-7 ప్రాంతాలుగా విభజించబడింది.
ఏలూరు నగరానికి ఒక ప్రక్క పల్లపు ప్రాంతాలు కొల్లేరు, కైకలూరు, మరొక ప్రక్క మెరక ప్రాంతాలు (చింతలపూడి, జంగారెడ్డిగూడెం) ఉన్నందున ఇక్కడి నిత్య జీవనంలో రెండు ప్రాంతాల ప్రభావం కనిపిస్తుంది.మెరక ప్రాంతమైన చింతలపూడి వైపు నుండి వచ్చే తమ్మిలేరు వాగు ఏలూరి చివర రెండుగా చీలుతుంది (అశోక్ నగర్ వద్ద) . ఎడమవైపు చీలిన వాగు తంగెళ్లమూడి మీదుగా ప్రవహిస్తూ నగరానికి ఒక వైపు సరిహద్దుగా ఉంటుంది. రెండవ చీలిక ఆశోక్ నగర్, అమీనా పేట మీదుగా ప్రవహిస్తూ బస్‌స్టాండు, సి.ఆర్.రెడ్డి కాలేజీ పక్కగా ప్రవహిస్తూ, నగరానికి వేరే సరిహద్దుగా కనిపిస్తుంది. ఈ రెండు చీలికలమధ్య డెల్టాలా ఏలూరు ప్రధాన పట్టణం వుంటుంది. ఈ కారణం వల్లే నాగిరెడ్డి గూడెం ప్రాజెక్ట్ కట్టక మునుపు ఏలూరు ముంపుకు గురి అయ్యేది.

గ్రామ చరిత్ర
హేలాపురి (ఏలూరు) పాత కాలంనుండి వేంగి అను రాజ్యములో భాగముగా ఉంది. తూర్పు చాళుక్యులు, వేంగి రాజధానిగా 700 నుండి 1200 వరకు తీరాంధ్ర ప్రాంతాన్ని పరిపాలించారు. ఏలూరు (హేలపురి) అప్పటి చాళుక్య సామ్రాజ్యములో ఒక ప్రాంతముగా ఉండేది. 1471లో ముస్లింల దండయాత్ర జరిగే వరకు ఏలూరు కళింగ రాజ్యములో భాగముగా ఉంది. ఆ తరువాత గజపతుల చేతుల్లోకి వచ్చి వారి పరిపాలనలో ఉంది. 1515లో శ్రీ కృష్ణదేవరాయలు గజపతుల నుండి దీనిని చేజిక్కించుకొన్నాడు. ఆ తరువాత గోల్కొండ నవాబు మహమ్మద్ కులీ కుతుబ్ షా వశమైంది. ఏలూరుకు సమీపములో ఉన్న పెదవేగి మరియు గుంటుపల్లె (జీలకర్ర గూడెం) గ్రామాలలో ఇందుకు సంబంధించిన అనేక చారిత్రక ఆధారాలు ఉన్నాయి.
బ్రిటిష్ వారి కాలంలో ఉత్తర సర్కారు ప్రాంతాలను జిల్లాలుగా విభజించినప్పుడు ఏలూరును మచిలీపట్నం జిల్లాలో చేర్చారు. తరువాత 1859లో గోదావరి జిల్లాలో భాగమైంది. తరువాత కృష్ణా జిల్లాకు కేంద్రంగా ఉంది. 1925లో పశ్చిమ గోదావరి జిల్లాలను ఏర్పరచినపుడు ఆ జిల్లాకు కేంద్రంగా ఏలూరు అయ్యింది. పట్టణం ఎదుగుదల ఫలితంగా 2005 ఏప్రిల్‌లో ఏలూరు మునిసిపాలిటీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మునిసిపల్ కార్పొరేషన్‌గా మార్చింది. ఆ సమయంలో చుట్టుప్రక్కల కొన్ని గ్రామాలు ఏలూరు నగరంలో కలుపబడ్డాయి.
ఏలూరు పార్లమెంట్ నియోజక వర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు:-
ఉంగుటూరు, దెందులూరు, ఏలూరు, పోలవరం, చింతలపూడి, నూజివీడు, కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గం తో కలిపి మొత్తం ఏడు నియెజక వర్గాలు ఈ పార్లమెంట్ సెంగ్మెంట్లో ఉన్నాయి.
ఇక పార్లమెంట్ స్ధానానికి ఏపార్టీ అభ్యర్థి ఏ పార్టీ తరుపున గెలుపొందారో ఒక సారి చూద్దాం.
మొదటి సారి 1952-57లో భారతీయ కమ్యూనిస్తు పార్టీనుండి కొండ్రు సుబ్బారావు, గెలుపొందారు.
రెండవ సారి 1957-62 కాంగ్రెస్ పార్టీ నుండి మోతే వేదకుమారి ఎంపీగా గెలుపొందగా, మూడవ సారి 1962-67లో కమ్యూనిస్టు పార్టీ నుండి వి. విమల దేవి గెలిచారు. ఇక నాలుగవ సారి 1967-71లో కాంగ్రెస్ నుండి కొమ్మారెడ్డి సూర్యనారాయణ గెలుపొందగా ఐదవసారి కూడా 1971-77లో ఆయనే కొమ్మారెడ్డి సూర్యనారాయణ భారత జాతీయ కాంగ్రెసు పార్టీ నుండి గెలిచారు. ఆరవసారి 1977-80లో కొమ్మారెడ్డి సూర్యనారాయణ మూడవ సారి భారత జాతీయ కాంగ్రెస్ తరుపున ఎన్నికయ్యారు. ఇక ఏడవ సారి 1980-84లో చిట్టూరి సుబ్బారావుచౌదరి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. ఎనిమిదవ సారి 1984-89లో బోళ్ళ బుల్లిరామయ్య తెలుగు దేశం పార్టీ నుంచి ఎంపికయ్యారు.
ఇక తొమ్మిదవ సారి 1989-91లో ఘట్టమనేని కృష్ణ కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొందారు. పదవసారి 1991-96 బోళ్ళ బుల్లిరామయ్య మళ్లీ తెలుగు దేశం పార్టీ నుంచి గెలుపొందారు. ఇక పదకొండవ సారి 1996-98 లో బోళ్ళ బుల్లిరామయ్య మళ్లీ తెలుగుదేశం పార్టీ నుండి గెలుపొందారు. పన్నెండవ సారి 1998-99లో మాగంటి వెంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొందారు. పదమూడవ సారి 1999-2004లో బోళ్ళ బుల్లిరామయ్య తెలుగు దేశం పార్టీ నుంచి గెలుపొందగా 14వ సారి 2004-09లో కావూరు సాంబశివరావు కాంగ్రెస్ పార్టీ తరుపున గెలిచారు. ఇక 15వ 2009-14 కావూరు సాంబశివరావు కాంగ్రెస్ పార్టీ తరుపున గెలుపొందారు. ఇక 16వ లోక్ సభకు 2014-ప్రస్తుతం మాగంటి వెంకటేశ్వరరావు (బాబు) తెలుగుదేశం పార్టీ పార్టీ తరుపున ఎంపీ గా కొనసాగుతున్నారు.
వ్యాపార కేంద్రాలు: మెయిన్ బజారు, ఆర్.ఆర్. పేట, బిర్లా భవన్ సెంటర్, చాటపర్రు రోడ్ సెంటర్, ఘడియారపు స్తంభం, నరసింహా రావు పేట, పత్తేబాద, జి యన్ టి రోడ్. ప్రయాణ కేంద్రాలు: పెద్ద రైల్వే స్టేషను, పవర్ పేట రైల్వే స్టేషను, వట్లూరు రైల్వే స్టేషన్, క్రొత్త బస్ స్టాండు, పాత బస్ స్టాండు, ఆశ్రం హాస్పిటల్. వైద్య కేంద్రాలు: రామ చంద్రరావు పేట, వెంకట్రావు పేట, పెద్దాసుపత్రి, ఆశ్రం హాస్పిటల్ మరియు మెడికల్ కాలేజీ
కూడళ్ళు: I టౌన్ : గడియారపు స్తంభం సెంటర్, పెద్ద వంతెన సెంటర్, కర్ర వంతెన సెంటర్, వసంత మహల్ సెంటరు, బిర్లా భవన్ సెంటర్, కొత్త రోడ్డూ, వంగాయగూడెం సెంటర్ చౌరాస్తా, జ్యూట్ మిల్ జంక్షన్
వ్యాపారం, పరిశ్రమలు :-
పారిశ్రామికంగా ఏలూరు చెప్పుకోదగినంత అభివృద్ధి సాధించలేదనే అనవచ్చును. ఎంతో కాలంగా నడుస్తున్న జూట్ మిల్లు తప్పించి ఇక్కడ ఎక్కువ మందికి ఉపాధి కలిగించే పెద్ద పరిశ్రమలు లేవు. అంబికా దర్బార్ బత్తి మాత్రమే ఏలూరు నుండి ప్రసిద్ధమైన బ్రాండ్ ఉత్పత్తి. పారిశ్రామిక వాడలో ఉన్న కొద్దిపాటి పరిశ్రమలు ఇంకా కుటీర, చిన్నతరహా పరిశ్రమల స్థాయిలోనే ఉన్నాయి. కనుక ఏలూరులో వ్యాపారం అధికంగా రెండు రంగాలలో కేంద్రీకృతమయ్యింది - (1) చుట్టుప్రక్కల లభించే వ్యవసాయ, అనుబంధ ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపారం - ధాన్యం, కూరగాయలు, పుగాకు, చేపలు, వంట నూనెలు వంటివి (2) పట్టణంలోను, చుట్టుప్రక్కల గ్రామాలలోను ఉన్న ప్రజల వినియోగవసరాలు తీర్చే వ్యాపారాలు - పచారి సరుకులు, బట్టలు, నిత్యావసర వస్తువులు, గృహోపకరణాలు, గృహనిర్మాణావసరాలు, ఆభరణాలు, ఆర్థిక సేవలు (బ్యాంకులు, తాకట్టు వ్యాపారం, ఫైనాన్సింగ్) వంటివి. ఇటీవల విద్య, వైద్య సదుపాయాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, వాహనాలు, పెట్రోలు వంటివి కూడా ఈ వ్యాపారాలలో చేరాయని చెప్పవచ్చు.
అంబికా గ్రూప్ - 60 యేళ్ళపైగా ఈ వ్యాపార సంస్థ ఉత్పత్తి చేసే "అంబికా దర్బార్ బత్తి", మరి కొన్ని అగర్‌బత్తిలు దేశవ్యాప్తంగా గుర్తింపు కలిగి ఉన్నాయి. ఈ గ్రూప్ అధిపతులు ఇంకా సినిమా నిర్మాణం, విద్యుత్తు, హోటళ్ళు వంటి మరికొన్ని వ్యాపారాలు కూడా నిర్వహిస్తున్నారు. సుమారుగా 5000 మందికి ఉపాధి కల్పిస్తున్నారు.
పూర్ణిమా కెమికల్ ఇండస్ట్రీస్ . ఈ సంస్థ ద్వారా ఉపాధి లభిస్తున్నది. జూట్ మిల్లు - ఈస్టిండియా కమర్షియల్ కార్పొరేషన్ వారి జనపనార పరిశ్రమ పట్టణం నడిబొడ్డున ఉన్న పెద్ద పరిశ్రమ. సుమారు 5000 మంది కార్మికులు ఉపాధి కలిగిస్తుంది. గోనె సంచులు, మరియు ఇతర జనప నార ఉత్పత్తులు వీరి ఉత్పాదనలు.
గుప్తా గ్రూప్ - ప్రధానంగా ఎగుమతి వాణిజ్యం నిర్వహిస్తున్నారు. వెంట్రుకలు, తివాచీలు, ఇతర వ్యవసాయోత్పత్తులు.
ఇతరాలు - మిరప పొడి, పొగాకు, జీడిమామిడి, దినుసులు, ఉల్లి, పచ్చళ్ళు, మామిడికాయలు, బియ్యం వంటి వాటికి సంబంధించిన ఉత్పత్తులను తయారు చేసే లేక విక్రయించే సంస్థలున్నాయి.
ఆలయాలు:- ఏలూరు పట్టణానికి వేయి సంవ్సరాలకు పైబడి చరిత్రవుంది. అలానే ఇక్కడి ఆలయాల్లో కొన్నిటికి సహస్రాబ్దికి పైబడిన వయస్సువుంది. వెయ్యి సంవత్సరాలకు పైబడి చరిత్రవున్న ఆలయాల్లో రామలింగేశ్వరస్వామి ఆలయం, జ్వాలాపహరేశ్వరస్వామి ఆలయం, కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయం, జనార్దన కన్యకాపరమేశ్వరీదేవి గుడి, మార్కండేయాలయం, ఓంకారేశ్వరస్వామి ఆలయం ఉన్నాయి.