పండంటి జీవితానికి 13 సూత్రాలు
పండంటి జీవితం అంటే ఆర్థికంగా మనం స్థిరపడి, సొంత ఇల్లు సమకూర్చుకొని అందులో హాయిగా నివసించడంకాదు. జీవితాన్ని ఎలా పండించుకోవాలి? మన జీవిత లక్ష్యం ఏమిటి? ఎక్కడి నుంచి వచ్చాం? ఎక్కడికి వెళ్లాలి? మన గమ్యం ఏమిటి? ఇత్యాది ప్రశ్నలన్నింటికీ నీ దగ్గరే సమాధానం దొరుకుతుంది. ఆధ్యాత్మికంగా ఉన్నతస్థాయికి చేరుకోవాలంటే మనిషికి ప్రధాన అడ్డంకిగా అహం నిలుస్తుంది. అహాన్ని తొలగించుకొని జీవితాన్ని పండించుకోవడానికి పెద్దలు 13 సూత్రాలు చెప్పారు. అవేమిటో ఒకసారి పరిశీలిద్దాం..
1.నేను.. నేను.. నేను.. అన్న దేహం బూడిద అవుతుంది ఏదో ఒక రోజు.
2. నాది.. నాది అన్నవన్నీ మరణంతో వదిలిపోతాయి ఒకరోజు
3. ఒక్క చావుతో బంధాలు అన్నీ తెగిపోతాయి ఏదో ఒక రోజు
4 . ఇక్కడికి ఒంటరిగానే వచ్చావు.. ఒంటరిగానే వెళ్ళిపోతావు.. ఏదో ఒక నాడు చుట్టూ అందరు ఉన్నా, ఎందరు ఉన్నా సరే
5 . ఇద్దరు కలిస్తే జననం.. నలుగురు మోస్తే మరణం
6. మాయతో పుట్టావు.. మాయలో జీవిస్తావు.. మాయ మర్మం తెలుసుకోలేక వెళ్ళిపోతావు

7. జీవుడు పుట్టేటప్పుడు దైవాన్ని చేరాలి అని అనుకుంటాడు.. పుట్టిన తర్వాత అన్నీ మర్చిపోయి తిరుగుతాడు
8. ఎన్నో అనుభవిస్తావు.. నిద్రలో కి జారిపోయిన తర్వాత అన్ని మర్చిపోతావు
9. నీ కష్టాలకు, నీ సుఖాలకు కారణం నీవే
10. నీవు పుట్టడానికి కారణం కూడా నీవే.. ఇలా బ్రతకడానికి కారణం నీవే.. ఇవన్నీ నీవు తగిలించుకున్నవే.. చేతులారా నీవు చేసుకున్నవే
11. ఎలా తగిలించుకున్నావో అవన్నీ బ్రతికి ఉన్నప్పుడు మనసు పూర్తిగా వదిలించుకునే బాధ్యత నీదే.. లేకపోతే మరో జన్మ కు సిద్ధం అవుతావు
12. బ్రతికి ఉన్నప్పుడే దైవ నామాన్ని పట్టుకో లేదా బ్రతికి ఉన్నప్పుడు దైవాన్ని ఆశ్రయించు లేదా బ్రతికి ఉన్నప్పుడే గురువును ఆశ్రయించు
13. ఒట్టి చేతులతో వచ్చావు.. 10 మంది సహకారంతో బ్రతుకుతావు.. పోయేటప్పుడు ఒట్టి చేతులతో వెళతావు.












Click it and Unblock the Notifications