నేడే ఆదిశంకరాచార్యుల జయంతి- ఆ నాలుగు శక్తిపీఠాలు ఇవే

నేడు ఆదిశంకరాచార్యుల జయంతి. వేదాంత తత్వవేత్తగా, జ్ఞాన సూర్యుడిగా ప్రసిద్ధి చెందిన శంకరాచార్యుల ఆలోచనలు శతాబ్దాలుగా ఆధ్యాత్మిక చింతనపై చెరగని ముద్ర వేశాయి. ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ పంచమి తిథి నాడు జరుపుకొంటారు. ఈ తిథి ఈ తెల్లవారుజామున 4:14 నిమిషాలకు ప్రారంభమై, మరుసటి రోజు వేకువజామున 1:19 గంటలకు ముగుస్తుంది. ఇది ఆదిశంకరాచార్యుల వారి 1238వ జయంతి.

788లో ప్రస్తుత కేరళలోని కాలడిలో జన్మించారు ఆదిశంకరాచార్యులు. ఆయన తల్లి ఆర్యయమ్మ, తండ్రి శివగురు. భారతీయ తత్వశాస్త్రంలో అత్యంత మేధావులలో ఒకరిగా గుర్తింపు పొందిన ఆయన 32 సంవత్సరాల వయస్సులోనే క్రీస్తుశకం 820లో కన్నుమూశారు. ఇంత తక్కువ జీవితకాలంలోనే ఆధ్యాత్మిక, మేధో రంగాలలో ఆయన రచనలు భారతదేశ ఆధ్యాత్మిక, తాత్విక ప్రపంచంపై అపారమైన ప్రభావాన్ని చూపాయి.

Celebrate Adi Shankaracharya Jayanti Honoring the Philosopher-Saint Who Reshaped Hindu Thought

ఎనిమిదేళ్ల ప్రాయంలోనే అద్భుతమైన మేధస్సుతో వేదాలను పూర్తిగా అవగాహన చేసుకున్నారు. ఆ కాలంలో తీవ్ర వివక్ష, మతపరమైన గందరగోళం ఉండేది. సరైన వేద జ్ఞానం లేక ప్రజలు అనేక శాఖలుగా విడిపోయారు. ఈ సమస్యల పరిష్కారానికి, సనాతన ధర్మాన్ని రక్షించి, సంఘటితం చేసి, జ్ఞానాన్ని వ్యాపింపజేయడమే లక్ష్యంగా ఆది శంకరాచార్యులు నాలుగు దిక్కులలో మఠాలను స్థాపించారు. ధర్మ ప్రచారం, జ్ఞాన వ్యాప్తిని లక్ష్యంగా చేసుకున్న ఈ మఠాల స్థాపన తర్వాతే 'చార్ ధామ్ యాత్ర' సంప్రదాయం ప్రాచుర్యంలోకి వచ్చింది.

ఆది శంకరాచార్యులు స్థాపించిన ఆ నాలుగు మఠాలు.. దక్షిణాన కర్ణాటకలోని శృంగేరి మఠం, పశ్చిమాన గుజరాత్‌లోని ద్వారకా మఠం, తూర్పున ఒడిశాలోని పూరి మఠం, ఉత్తరాన ఉత్తరాఖండ్‌లోని జ్యోతిర్మఠం (బద్రీనాథ్). నేటికీ ఇది కోట్లాది భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా భాసిల్లుతున్నాయి. ధర్మ విజ్ఞానాన్ని పునరుద్ధరించడంలో, అద్వైత వేదాంత తత్వాన్ని స్థిరీకరించడంలో ఆదిశంకరాచార్యులకు నివాళి అర్పిస్తారు.

ఆయన పోషించిన కీలక పాత్రను స్మరించుకుంటారు. ప్రార్థనలు, ఆధ్యాత్మిక సమావేశాలతో పాటు, ఆయన స్థాపించిన పీఠాలు, మఠాలను సందర్శించడం ఆనవాయితీ. ఈ జయంతి- హిందూ తత్వశాస్త్ర అవగాహనను మార్చిన మేధో చర్చలు, క్రమశిక్షణకు ప్రతీక. ఆదిశంకరాచార్యులు అద్వైత వేదాంతాన్ని పునరుద్ధరించి, వ్యవస్థీకరించారు. ఉపనిషత్తులు, భగవద్గీత వంటి ముఖ్య గ్రంథాలపై ఆయన రచించిన ప్రభావవంతమైన వ్యాఖ్యానాలు నేటికీ ప్రామాణికంగా నిలుస్తాయి.

మేధో చర్చలను, క్రమశిక్షణతో కూడిన ఆధ్యాత్మిక సాధనను ప్రోత్సహించిన ఆయన, దేశం నలుమూలలా నాలుగు ముఖ్యమైన మఠాలను స్థాపించి, ధర్మ ప్రచారానికి పునాదులు వేశారు. హిందూ సంస్కృతి అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నప్పుడు శంకరాచార్యులు దాన్ని పునరుద్ధరించడంలో కీలక పాత్ర పోషించారని చరిత్రకారులు చెబుతారు. దేశాన్ని ఆధ్యాత్మికంగా ఏకం చేశారు. సనాతన ధర్మంలో ఆది శంకరాచార్యులకు అత్యంత విశిష్ట స్థానం ఉంది. చిన్న వయసులోనే సన్యాసం స్వీకరించిన శంకరాచార్యులు జ్ఞానాన్వేషణకు దేశ పర్యటన చేసి, ఆలోచనలను ప్రజల్లోకి విజయవంతంగా తీసుకెళ్లారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+