వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Garlic Benefits: వెల్లుల్లితో ఎన్ని లాభాలో తెలుసా..

|
Google Oneindia TeluguNews

మనం వంట చేసుకుంటే కర్రీలో వెల్లుల్లి వేసుకుంటాం. అయితే ఈ వెల్లుల్లితో చాలా ప్రజయోజనాలు ఉన్నాయి. అందుకే వంటల్లో కచ్చితంగా వెల్లుల్లి వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. పురుషులకు వెల్లుల్లి చాలా ప్రయోజనకరంగా ఉంటుందట. శారీరక బలం కోసం రోజూ పరగడుపున వెల్లుల్లి తీసుకోవాలట. దీనివల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.

రక్తం

రక్తం


వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అది శరీరం లోపల రక్తం గడ్డకట్టకుండా ఉంటుంది. ఇందులోని యాంటీ క్లాటింగ్ గుణాలే దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గుండె జబ్బుతో బాధపడే వారు వెల్లుల్లిని రోజూ తినడం వల్ల గుండెకు రక్తప్రసరణ మెరుగుపడి.. గుండెపోటు రాకుండా జాగ్రత్తపడచ్చట.

అలిసిన్‌

అలిసిన్‌


వెల్లుల్లిలో ఉండే అలిసిన్‌ వల్ల త్వరగా బరువు తగ్గే అవకాశాలున్నాయట. అందుకే శరీరంలో పేరుకున్న అధిక కొవ్వును కరిగించడంలో వెల్లుల్లికి సాటి లేదని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ఔషధ గుణాలు రక్తంలోని ట్రైగ్లిజరైడ్స్‌ని తగ్గించి, శరీర బరువును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి వివరిస్తున్నారు.

అల్జీమర్స్‌

అల్జీమర్స్‌


వెల్లుల్లిలో అల్జీమర్స్‌ను తగ్గించే లక్షణాలు మెండుగా ఉంటాయట. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాల వల్ల మెదడు పనితీరుపై ప్రభావం చూపించే అల్జీమర్స్, డిమెన్షియా వంటి వ్యాధుల బెడద ఉండదని నిపుణులు చెబుతున్నారు. వెల్లుల్లి తీసుకోని వారితో పోల్చితే.. తరచూ ఆహారంలో భాగంగా దీన్ని తీసుకునే వారిలో జలుబు, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు తక్కువగా వచ్చే అవకాశం ఉందట.

రక్తహీతన

రక్తహీతన


రక్తహీతన సమస్యను అధిగమించేందుకు వెల్లుల్లి సరైన ఔషధం. వెల్లుల్లిని రోజూ ఆహారంలో భాగం చేసుకునే వారు రక్తహీనత నుంచి త్వరగా బయటపడచ్చని పలు అధ్యయనాలు కూడా వివరిస్తున్నాయి. వెల్లుల్లిలోని రసాయనాలు ఐరన్ విడుదలను ఎక్కువగా ప్రేరేపిస్తాయట.

English summary
There are benefits of eating garlic. Eating garlic can help you lose weight.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X