వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Lady Finger Benefits: బెండకాయ తింటున్నారా.. అయితే మీ కొలెస్ట్రాల్ తగ్గుతుంది..!

|
Google Oneindia TeluguNews

చాలా మంది కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా బెండకాయ తినడం వల్ల కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. ఇందులో విటమిన్లు, మినరల్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. బెండకాయలో ఉండే పేక్టిన్ కారణంగా చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

రోగ నిరోధక శక్తి

రోగ నిరోధక శక్తి

బెండకాయ తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇమ్యూనిటీని పెంచడంలో బెండకాయ ప్రముఖ పాత్ర వహిస్తుందట. బెండకాయలో అధికంగా ఉండే ఫైబర్ కడుపుకు సంబంధించిన సమస్యల్ని దూరం చేస్తుందట. డయాబెటిస్ రోగులకు కూడా బెండకాయ మంచి ఆహారం. దీన్ని తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటుంది.

క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది

క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది

మీ గుండెను ఫిట్‌గా ఉంచుతుంది. బెండకాయ విటమిన్లు, ఖనిజాలు, పీచు మాత్రం పుష్కలంగా దొరుకుతాయని పోషక నిపుణులు పేర్కొంటున్నారు. బెండకాయలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల వీటిల్లో దొరికే లెక్టిన్ అనే ప్రొటీన్ రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బెండలోని ఫోలేట్లు అనేక రకాల క్యాన్సర్లను అడ్డుకుంటాయి. ఫోలేట్ లోపం వల్ల రొమ్ము, మెడ, క్లోమ, ఊపిరితిత్తుల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు.

యాంటీ ఆక్సిడెంట్లు

యాంటీ ఆక్సిడెంట్లు

లేడిఫింగర్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అలాగే విటమిన్లు, మినరల్స్‌తో సహా అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇతర కూరగాయల కంటే బెండలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయట. అందువల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని నిపుణులు వివరిస్తున్నారు. మీ ఆహారంలో బెండను చేర్చుకోవాలని సూచిస్తున్నారు.

English summary
Experts say that eating okra is very good for health. Eating okra not only lowers cholesterol but also reduces the risk of cancer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X