Fenugreek Side Effects: వారు మెంతులు అస్సలు తినొద్దు.. ఎందుకంటే..
మనం వంటల్లో వాడే పదార్థాల్లో మెంతులు ఉంటాయి. ఇవి రుచికి చేదుగానే ఉన్నా, ఇవి తింటే శరీరానికి మంచిది. మెంతుల్లో ఫైబర్, ప్రొటీన్, కొవ్వు, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం ఉండడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు, కీళ్ల నొప్పులను తగ్గుతాయట. బరువు కూడా ఫాస్ట్ గా తగ్గుతారట. కానీ కొందరు ఈ మెంతులు తీసుకోవడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
గర్భిణీలు
గర్భంతో ఉన్న వారు మెంతులు తినకూడదట. ఇవి కడుపులో పెరుగుతున్న పిండంపై చెడు ప్రభావాన్ని చూపెడుతాయట. అంటే బిడ్డకు వైకల్యం వచ్చే అవకాశం ఉంటుందట. అందుకే గర్భిణులు మెంతులను అస్సలు తీసుకోకూడదని చెబుతున్నారు.శ్వాస కోస సమస్యలున్నవారు మెంతులు వాడొద్దట. అధిక రక్తపోటుతో బాధపడేవారు కూడా మెంతులను తీసుకోకపోవడమే మంచిదని చెబుతున్నారు.

బీపీ ఉన్నవారు
ఎందుకంటే ఈ గింజలు బీపీని మరింత పెంచుతాయని హెచ్చరిస్తున్నారు. పిల్లలకు కూడా మెంతులను ఎక్కువగా పెట్టకూడదట. అయితే ఏ పదార్థాలు అయినా మితంగా వాడితే ఇబ్బంది ఉండదని నిపుణులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications