వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Custard Apple: సీతాఫలం తింటున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే..

|
Google Oneindia TeluguNews

సీజనల్ పండ్లలో సీతాఫలం ఒక్కటి. ఈ పండు శీతాకాలంలోనే లభిస్తుంది. అందుకే ఈ పండ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటాయి. ముఖ్య విషయం ఏమిటంటే ఈ పండ్లు సహజ సిద్ధంగా లభిస్తాయి. ఇవి తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. అలా అని మరి ఎక్కువ తింటే కూడా సమస్యలు వస్తాయట.

యాంటీ ఆక్సిడెంట్లు

యాంటీ ఆక్సిడెంట్లు


సీతాఫలంలో క్యాలరీ కంటెంట్‌ యాపిల్స్‌లో కంటే రెట్టింపు ఉంటుందట.'అరిస్టోక్రాట్ ఆఫ్ ఫ్రూట్స్'గా పేరొందిన దాని పేరే సీతాఫలంలో సి విటమిన్‌తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుందట. ఇందులో పుష్కలంగా ఉండే పొటాషియం, కండరాల బలహీనతను తగ్గించడంతో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

రక్తపోటు

రక్తపోటు

సాధారణంగా ఎక్కడంటే అక్కడ సులభంగా పెరిగే సీతాఫలంలో శరీరానికి అవసరమయ్యే అన్ని రకాల పోషకాలు ఉంటాయట. ప్రొటీన్లూ ఫైబర్‌, విటమిన్లు, కొద్దిశాతం కొవ్వు.. ఇలా అన్ని పోషకాలు పుష్కలంగా లభించే పండ్లోలో సీతాఫలం ఒక్కటి. సీతాఫలంలో ఉండే సోడియం, పొటాషియం శరీరంలో రక్తపోటును కంట్రోల్‌ చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయట.

అల్సర్‌

అల్సర్‌


అల్సర్‌, పొట్ట సమస్యలతో బాధపడే వారికి సీతాఫలాలు మంచివట. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పొట్ట సంబంధిత వ్యాధులను తగ్గిస్తాయి. ఇందులోని అధిక మెగ్నీషియం ప్రేగుల కదలికల్లో చలనం తీసుకొస్తాయట. తియ్యని ఆ రుచి వల్లే దీన్ని షుగర్ ఆపిల్ అని కూడా పిలుస్తుంటారట.

ఔషధ తయారీలో

ఔషధ తయారీలో


ఈ పండు ఒత్తిడిని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు.ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు డిప్రెషన్‌ను దూరం చేస్తాయట. ఈ జాతి పండ్లన్నీ కూడా ఔషధఫలాలే. మన ఆయుర్వేద వైద్యంతో పాటు స్థానిక దక్షిణ అమెరికన్లు సైతం ఈ చెట్ల భాగాలన్నింటినీ కూడా మందుల తయారీలో ఉపయోగిస్తారట.

English summary
Eating cantaloupe can reduce many problems. Importantly, the severity of diseases like ulcers and blood pressure is reduced.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X