ఆంజనేయుడి దివ్యమంత్రం
హిందువుల ముఖ్య పండుగలలో ఒకటి.. హనుమాన్ జయంతి. పవన సుతుడు శ్రీ ఆంజనేయుడి జన్మదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుపుకొంటారు. హనుమాన్ జనమోత్సవంగా కూడా పిలిచే ఈ పండుగ చైత్ర మాసం శుక్ల పక్ష పౌర్ణమి తిథి నాడు వస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్ 2న హనుమాన్ జయంతిని జరుపుకోనున్నారు.
పౌర్ణమి తిథి ఈ ఉదయం 7:06 నిమిషాలకు ప్రారంభమై, ఏప్రిల్ 2, 2026 ఉదయం 7:41 గంటలకు ముగుస్తుంది. ఉదయాది తిథి కారణంగా, ఏప్రిల్ 2న హనుమాన్ జయంతిని జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. తెల్లవారుజామున 6:10 గంటల నుండి ఉదయం 7:44, మధ్యాహ్నం 12:25 నుండి మధ్యాహ్నం 3:32 వరకు, సాయంత్రం 5:05 నుండి రాత్రి 8:05, అభిజిత్ ముహూర్తం ఏప్రిల్ 2 మధ్యాహ్నం 12:00 గంటల నుండి మధ్యాహ్నం 12:50 గంటల ఉంటుంది.

చైత్ర మాసం శుక్ల పక్ష పౌర్ణమి తిథి నాడు అంజనాదేవి గర్భాన కేసరి పుత్రుడిగా హనుమాన్ జన్మించాడు. జ్ఞానం, విశ్వసనీయత, అచంచలమైన భక్తి, ధైర్యం, నిర్భయత్వం, అపారమైన బలం, శక్తికి హనుమంతుడు ప్రతీక. భూమిపై నివసిస్తున్న చిరంజీవులలో హనుమాన్ ఒకడు. త్రేతాయుగంలో శ్రీరాముడు జన్మించిన కాలంలోనే ఆయన కూడా జన్మించాడు. ఈ పవిత్ర దినాన శ్రీరాముడు, హనుమాన్ భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ పండుగను జరుపుకొంటారు.
అత్యంత శక్తిమంతమైన దేవతలలో ఆంజనేయుడు ఒకరు. పరమశివుని రుద్రాంశ సంభూతుడిగా, రుద్ర అవతారంగా హనుమాన్‌ను భావిస్తారు. శ్రీరాముని పట్ల ఆయనకు ఉన్న అచంచలమైన భక్తికి, నిస్వార్థ సేవకు ప్రసిద్ధి. ఆయనను శ్రీరాముని గొప్ప భక్తులలో ఒకరిగా పరిగణిస్తారు. వినయం, క్రమశిక్షణ, సంపూర్ణ శరణాగతి, భక్తి, విశ్వసనీయత వంటి అనేక గుణాలను హనుమాన్ నుండి నేర్చుకోవచ్చు. భక్తులను శత్రువులు, చెడు దృష్టి, ప్రతికూల శక్తుల, కష్టాల నుండి కాపాడతాడు.
హిందూ గ్రంథాల ప్రకారం హనుమాన్ అష్ట సిద్ధులు (ఎనిమిది అతీంద్రియ శక్తులు), నవ నిధులకు (తొమ్మిది దివ్య నిధులు) అధిపతి. చిన్నతనంలోనే సూర్యుడిని ఒక పండుగా భావించి మింగేసినప్పుడు హనుమాన్ తన అసాధారణ శక్తులను, బలాన్ని ప్రదర్శించాడు. ఈ పవిత్ర దినాన్ని భక్తులు అత్యంత వైభవంగా, అంకితభావంతో జరుపుకుంటారు.
హనుమంతుడి ఆశీస్సులు పొందడానికి భక్తులు మల్లె నూనెతో దీపం వెలిగిస్తారు. వివిధ మంత్రాలు, స్తోత్రాలు, సుందరకాండ, హనుమాన్ చాలీసా పారాయణం చేస్తారు. ఆలయాలను సందర్శించినప్పుడు సింధూరం, మల్లె నూనె, తీపి తమలపాకు, కొబ్బరికాయ, చోళం, లడ్డూలు వంటివి నైవేద్యంగా సమర్పిస్తారు. హనుమాన్ జయంతి నాడు భక్తులు సుందరకాండ పారాయణాలు చేస్తారు. హనుమాన్ చాలీసాను పఠిస్తారు. సుందరకాండ పారాయణంలో పాల్గొనడంహనుమాన్ జన్మదినాన్ని పురస్కరించుకుని, ఆలయాలను దీపాలతో, పూలతో అలంకరిస్తారు, పండుగ వాతావరణం నెలకొంటుంది.
ఓం అంజనీ సుతాయే నమః..!!
ఓం హం హనుమతే నమః..!!
ఓం హనుమతే రుద్రాత్మకాయే నమః..!!
ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి, తన్నో హనుమంత ప్రచోదయాత్..!!












Click it and Unblock the Notifications