వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

health tips: పరగడుపున నీళ్ళు తాగితే.. బీపీ, డయాబెటిస్ కంట్రోల్; బోలెడు హెల్త్ బెనిఫిట్స్!!

|
Google Oneindia TeluguNews

ఆరోగ్యంగా ఉండాలనుకునే వారు ఉదయం లేచిన వెంటనే చేయాల్సిన ముఖ్యమైన పని పరగడుపునే నీళ్లను తాగడం. పరగడుపున నీళ్లు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. ఎన్నో అనారోగ్య సమస్యలకు నివారణిగా, మన శరీరానికి ఉత్తేజాన్నిచ్చే మెడిసిన్ గా పరగడుపున తాగే నీళ్లు ఉపయోగపడతాయని చెబుతున్నారు. పరగడుపున మంచి నీరు తాగడం వల్ల అసాధారణమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వైద్య శాస్త్రం కూడా ధ్రువీకరించింది.

పరగడుపున నీళ్ళు తాగటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

పరగడుపున నీళ్ళు తాగటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే


నిద్ర లేచిన వెంటనే చక్కగా కూర్చుని ఒక లీటరున్నర మంచి నీళ్లు తాగితే మంచిదని చెబుతున్నారు. అయితే ఉదయం పొద్దున్నే లేచిన తర్వాత నీటిని తాగి తర్వాత గంట వరకు ఎటువంటి ఆహారం తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. ఉదయం పరగడుపున నీటిని తాగడం వల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాలను చూస్తే పరగడుపున ఖాళీ కడుపుతో మంచినీళ్లు తాగడం వల్ల పెద్దపేగు శుభ్రపడి మరిన్ని పోషకాలను గ్రహిస్తుందని చెబుతున్నారు. అంతేకాదు కొత్త రక్తం తయారీ, కండర కణాల వృద్ధి ఉదయాన్నే నీళ్లు తాగడం వల్ల పెరుగుతుందని చెబుతున్నారు.

పరగడుపున నీరు తాగటం వల్ల మెటబాలిజం ఎంత పెరుగుతుంది అంటే

పరగడుపున నీరు తాగటం వల్ల మెటబాలిజం ఎంత పెరుగుతుంది అంటే


పొద్దున్నే కనీసం అరలీటరు నీటిని తాగడం వల్ల 24 శాతం శరీరం మెటబాలిజం పెరుగుతుందని, తద్వారా ఇది బరువు తగ్గడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. పరగడుపున నీరు త్రాగడం వల్ల రక్త కణాలు శుద్ధి అవుతాయని, తద్వారా శరీరంలోని మలినాలు తొలగిపోతాయని చెబుతున్నారు. పరగడుపున ఉదయాన్నే నీరు తాగడం వల్ల చర్మం కూడా శుభ్ర పడుతుందని శరీర ఛాయ పెరుగుతుందని, శ్వేద ధాతువులను సమతుల్యం చేస్తుందని చెబుతున్నారు. ఈ గ్రంధుల వల్ల రోజువారీ కార్యక్రమాలలో ఎటువంటి ఆటంకం లేకుండా శరీరం ద్రవపదార్ధాన్ని కోల్పోకుండా కాపాడతాయని, అలాగే ఇన్ఫెక్షన్ దరిచేరకుండా పోరాడుతుందని చెబుతున్నారు.

రక్తపోటు, మధుమేహం కంట్రోల్ కోసం కూడా ఈ పని చెయ్యాల్సిందే

రక్తపోటు, మధుమేహం కంట్రోల్ కోసం కూడా ఈ పని చెయ్యాల్సిందే

ఉదయం లేవగానే మంచి నీళ్లు తాగడం వల్ల మలవిసర్జన సులభంగా జరుగుతుందని, పేరుకుపోయిన వ్యర్థాలను ఇది తొలగిస్తుందని చెబుతున్నారు. ఉదయం నీరు తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుందని, ఆకలితో పాటు అరుగుదల కూడా పెరుగుతుందని చెబుతున్నారు. అధిక రక్తపోటు, మధుమేహం ఉన్నవారు కూడా ఉదయాన్నే నీళ్లు తాగడం వల్ల వాటిని అదుపులో ఉంచే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఉదయాన్నే నీళ్లు తాగడం ఒత్తిడి పైన పోరాటం చేస్తుందని, ఒత్తిడిని అదుపులో ఉంచటానికి నీళ్ళు త్రాగటం అవసరం అని అంటున్నారు.

పరగడుపున నీళ్ళు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

పరగడుపున నీళ్ళు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు


ఉదయం ఖాళీ కడుపుతో బ్రష్ చేయకుండా నీటిని తాగడం వల్ల ఊబకాయం సమస్య కూడా దరిచేరదని చెబుతున్నారు. శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంచుకుంటే, చాలా రోగాల నుంచి ఉపశమనం దొరుకుతుందని అంటున్నారు. అందం కోసం, ఆరోగ్యం కోసం, జుట్టు కోసం కూడా పరగడుపున తాగే మంచినీళ్ళు మేలు చేస్తాయని అంటున్నారు. ఏది ఏమైనా పరగడుపున నీళ్లు తాగడం ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలని చెబుతున్నారు.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

health tips: లవంగం అని లైట్ తీసుకోకండి.. పోషకాలు, హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకున్నాకే వాడండి!!health tips: లవంగం అని లైట్ తీసుకోకండి.. పోషకాలు, హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకున్నాకే వాడండి!!

English summary
Doctors say that drinking water early in the morning with empty stomach can control BP and diabetes and has many health benefits.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X