వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చలికాలంలో చర్మం పొడిబారటం, పెదవులు, పాదాలు పగుళ్ళు వేధిస్తున్నాయా? అయితే ఈ చిట్కాలు పాటించండి!!

|
Google Oneindia TeluguNews

చలికాలం వచ్చిందంటే చాలు మన చర్మం విపరీతంగా పాడైపోతుంది. విపరీతమైన చలి దెబ్బకు చర్మం తన సున్నితత్వాన్ని కోల్పోయి రఫ్ గా తయారవుతుంది. పొడిబారిపోయినట్లు మారుతుంది. ఒక్కోసారి మనల్ని మనం చూసుకోడానికి అసహ్యంగా అనిపిస్తుంది. చలికాలం చర్మ సంరక్షణపై దృష్టి సారించకపోతే కచ్చితంగా అందవిహీనంగా తయారవుతాము. అందుకే చలికాలం చర్మ రక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? పాదాల పగుళ్ళు? పెదవుల పగుళ్లు నివారించడం ఎలా? వంటి అనేక విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

చలికాలంలో చర్మం పొడిబారే సమస్య.. పెదవుల పగుళ్ళకు ఈ చిట్కాలు పాటించండి

చలికాలంలో చర్మం పొడిబారే సమస్య.. పెదవుల పగుళ్ళకు ఈ చిట్కాలు పాటించండి


చలికాలంలో ఎక్కువగా చర్మం పొడిబారిపోయి ఉంటుంది. ఈ పొడిబారిన చర్మాన్ని కాపాడుకోవడానికి మార్కెట్లో అనేక క్రిములు, ఆయిల్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిని కొనుగోలు చేయలేని వారు కొబ్బరి నూనెను చర్మాన్ని సంరక్షించుకోవడానికి ఉపయోగిస్తే మంచిదని చెబుతున్నారు. పాలలోని మీగడను, వెన్నను కూడా శరీరానికి, పెదవులకు అప్లై చేసుకోవచ్చని, తద్వారా పొడిబారడం తగ్గుతుంది అని శరీరం మృదువుగా మారుతుంది అని చెబుతున్నారు.

తగినంత నీరు, పోషకాహారం కూడా చర్మ సంరక్షణకు అవసరం

తగినంత నీరు, పోషకాహారం కూడా చర్మ సంరక్షణకు అవసరం


ఇక చలికాలం శరీరానికి కావలసినంత నీటిని తాగకపోవడం కూడా చర్మం పొడిబారడాన్ని కారణంగా చెబుతారు. వాతావరణం చల్లగా ఉంటే మనం సాధారణంగానే తక్కువ నీటిని త్రాగుతాం. కాబట్టి శరీరం డీ హైడ్రేడ్ అయ్యి చర్మం పొడి బారటానికి ఒక కారణంగా మారుతుంది. అందుకే చలికాలం నీటిని తాగడం పైన కూడా శ్రద్ధ వహించాలి. నిత్యం నాలుగు నుండి ఐదు లీటర్ల నీటిని కనీసం తాగాలని వైద్యులు చెబుతున్నారు. శరీరానికి కావలసినంత నీటిని తాగడం, సరైన పౌష్టికాహారాన్ని తీసుకోవడం వల్ల చర్మాన్ని సంరక్షించుకోవాలి అని, పెదవుల పగుళ్లను కూడా నివారించవచ్చని చెబుతున్నారు.

కాళ్ళ పగుళ్ళకు ఈ జాగ్రత్తలు పాటించండి

కాళ్ళ పగుళ్ళకు ఈ జాగ్రత్తలు పాటించండి


ఇక చలికాలం కాళ్ళ పగుళ్ళ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పొరపాటున కూడా కాళ్ళను చన్నీటితో కడగకూడదు అని, మరీ సలసలా కాగే నీళ్ళతో కడగకూడదని అంటున్నారు. పాదాలను గోరు వెచ్చని నీటితో కళ్ళను కడుక్కోవాలి అని చెబుతున్నారు. పాదాల విషయంలో జాగ్రత్తగా లేకుంటే మడమల పగుళ్లు తీవ్ర ఇబ్బందికి గురి చేస్తాయని సూచిస్తున్నారు. ఒక్కోసారి అవి రక్తస్రావానికి కారణం అవుతాయని అంటున్నారు. అంతేకాదు ప్రతిరోజు రాత్రి పాదాలను వేడి నీటితో కడుక్కున్న తర్వాత శుభ్రంగా తుడిచి కొబ్బరి నూనె కానీ మాయిశ్చరైజర్ కానీ అప్లై చేయాలని సూచిస్తున్నారు. పాదాల సంరక్షణ విషయంలో జాగ్రత్త తీసుకోకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది అంటున్నారు.

విటమిన్ డీ లోపంతోనూ చర్మ సమస్యలు... ఈ పని చెయ్యండి

విటమిన్ డీ లోపంతోనూ చర్మ సమస్యలు... ఈ పని చెయ్యండి


ఇక చలికాలంలో విటమిన్ లోపం వల్ల కూడా ఒక్కొక్కరిలో చర్మ సమస్యలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ డి లోపం వల్ల అనేక రకాల చర్మ సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఇక ఇటువంటి వారు ఉదయం సూర్యరశ్మి తగిలేలా శరీరాన్ని చూసుకోవాలని, అది సాధ్యం కాకపోతే విటమిన్ డీ త్రీ టాబ్లెట్ లను వైద్యుల సూచనల మేరకు ఉపయోగించాలని చెబుతున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా శ్రద్ధ లేకపోతే చర్మం పాడవుతుందని, నిర్లక్ష్యం చేస్తే అది తీవ్రంగా మరి ఇబ్బంది పెడుతుందని గుర్తించి ఎప్పుడూ శరీరాన్ని తేమ ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. ఒక చిన్న శ్రద్ధ మీ చర్మాన్ని రక్షిస్తుందని చెప్తున్నారు.


disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

health tips: బిజీలో పడి నీళ్ళు తాగటం మరచిపోతున్నారా? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడ్డట్టే!!health tips: బిజీలో పడి నీళ్ళు తాగటం మరచిపోతున్నారా? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడ్డట్టే!!

English summary
For Dry winter skin, dry lips and feet in this winter season it is better to apply coconut oil, moisturizers, butter. Moreover, it is good to take the water and nutrition required to the body.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X