
health tips: అతిగా తింటున్నారా? డేంజర్ లో ఆరోగ్యం; వైద్యులు ఏం చెప్తున్నారంటే!!
మనం జీవించాలంటే ఆహారం తీసుకోవడం అవసరమే. అయితే మితాహారం తీసుకోవడం ఆరోగ్యాన్ని కాపాడతుంది , లిమిట్ లేకుండా ఆహారాన్ని తీసుకోవడం అనారోగ్యాలకు కారణమవుతుంది. శరీరాన్ని రోగాల పుట్టగా మారుస్తుంది. మన శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువగా భోజనం చేయడం వల్ల విపరీతంగా బరువు పెరుగుతారు. బరువు పెరగడం వల్ల శరీరంలో అనేక అవయవాలపైన స్వల్ప, దీర్ఘకాలిక ప్రభావం ఏర్పడుతుంది.
health tips: డేంజర్ బెల్స్ మోగిస్తున్న ఊబకాయం: లక్షణాలు, వచ్చే జబ్బులు ఇవే.. బీ అలెర్ట్!!

అతిగా తింటే హెల్త్ డేంజర్ లో పడినట్టే
చాలామంది నోటిని కంట్రోల్ చేసుకోలేరు. ఏదైనా ఇష్టమైంది కళ్లకు కనిపిస్తే తినాలని చూస్తారు. ఎంత తింటున్నాము అన్నది కూడా గమనించుకోకుండా ఇష్టారాజ్యంగా భుజిస్తారు. ఇక అటువంటి వారు తీవ్ర అనారోగ్యాల బారిన పడతారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అతిగా తినడం వల్ల అవాంఛిత బరువు పెరగవచ్చు మరియు అధిక బరువు కారణంగా క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి.

అతిగా తినటం వల్ల దుష్ప్రభావాలివే
అతిగా భోజనం చేయడం వల్ల మన పొట్ట సాధారణ పరిమాణానికి మించి విస్తరిస్తుంది. ఇది ఎక్కువ మొత్తంలో ఆహారాన్ని కడుపులో సర్దుబాటు చేస్తుంది. ఇక పొట్ట పెరగడం ఇతర అవయవాలపై ప్రభావం చూపిస్తుంది. అలసటగా ఉండటం, నిద్రాభంగం, శరీరం యాక్టివ్ గా లేకపోవడం వంటి అనేక సమస్యలు వస్తాయి. ఇక ఏదైనా పని చేస్తే విపరీతంగా కష్టం అనిపిస్తుంది. ఎక్కువగా తిన్న ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికి శరీరం నార్మల్ గా పనిచేసే దానికంటే ఎక్కువ పని చేయాల్సి వస్తుంది. దీనివల్ల జీర్ణ వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఆరోగ్యం కోసం ఆహారం తినే విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని వైద్యులు చెబుతున్నారు.

ఆహారం ఏ విధంగా తీసుకోవాలో చెప్తున్న వైద్యులు
ఇక ఆహారాన్ని ఏ విధంగా తినాలి అన్న దానిపైన వైద్యులు కొన్ని సూచనలు చేస్తున్నారు. సులభంగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను తీసుకోవాలని సూచిస్తున్నారు . తీసుకునే ఆహార పరిమాణంపై జాగ్రత్త వహించాలని, తాజా పండ్లు కూరగాయలను తినాలని చెప్తున్నారు. డిన్నర్ చెయ్యటానికి బదులుగా కట్ చేసుకున్న కూరగాయలను తినాలని, సలాడ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయని సలహా ఇస్తున్నారు.

బాగా నచ్చిందని విపరీతంగా తింటే ప్రమాదమే
తినే సమయంలో టీవీ చూడటం, సెల్ ఫోన్లు ఉపయోగించడం వంటి పనులు చేయకూడదని, భోజనాన్ని నెమ్మదిగా తినాలని సలహా ఇస్తున్నారు. భోజనానికి ముందు, భోజనం సమయంలో మరియు తర్వాత తగినంత నీరు తాగాలని సూచిస్తున్నారు. జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలని అంటున్నారు. బాగా నచ్చిందని విపరీతంగా ఆహారం తీసుకోరాదని అంటున్నారు. ఈ సలహాలు పాటించి విపరీతంగా ఆహారాన్ని తీసుకునే అలవాటును తగ్గించుకోవడంతో పాటుగా, ఆరోగ్యంగా ఉండటంపై దృష్టి సారించాలని సలహా ఇస్తున్నారు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.