వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

health tips: ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయం అల్పాహారంలో ఈ మూడు పదార్థాలు ఉండేలా చూసుకోండి!!

|
Google Oneindia TeluguNews

ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అటువంటి ఆరోగ్యాన్ని ఎవరు కోరుకోరు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని, ఫిట్ నెస్ తో సంతోషంగా జీవించాలని భావిస్తారు. అయితే అటువంటి వారు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రోజు సమయానికి అల్పాహారం తీసుకోవడం చాలా ముఖ్యమని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు.ఇక శీతాకాలంలో ఆహారం విషయంలో చిన్నపాటి మార్పులు మంచిదని అంటున్నారు.

 శీతాకాలంలో అల్పాహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలివే

శీతాకాలంలో అల్పాహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలివే

ముఖ్యంగా శీతాకాలంలో తరచుగా అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే ముఖ్యంగా చలికాలంలో ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అనారోగ్యం బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండడానికి మనం తీసుకునే అల్పాహారంలో ముఖ్యంగా మూడు ఆహారపదార్థాలను చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుందని సూచిస్తున్నారు. ఇంతకీ ఆ మూడు ఆహార పదార్థాలు ఏంటి అనేది ఇక్కడ తెలుసుకుందాం.

అల్పాహారమే మనిషికి కావాల్సిన శక్తిని ఇస్తుంది

అల్పాహారమే మనిషికి కావాల్సిన శక్తిని ఇస్తుంది

మన దైనందిన జీవితంలో ఒక మూడు ఆహారపదార్ధాలను నిత్యం మన ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటాము. ఉదయం ఖాళీ కడుపుతో వీటిని తీసుకోవడం వల్ల ఈ రోజంతా మీకు శక్తి లభించడమే కాకుండా, ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. సరైన అల్పాహారం మాత్రమే రోజంతా మనిషికి కావల్సిన శక్తిని ఇస్తుంది. ఇక అల్పాహారంలో తీసుకోవలసిన పౌష్టికాహార వివరాలను చూస్తే

 నానబెట్టిన బాదంపప్పులు, వాల్ నట్ లతో ఎంతో మేలు

నానబెట్టిన బాదంపప్పులు, వాల్ నట్ లతో ఎంతో మేలు

అల్పాహారంలో నానబెట్టిన బాదం పప్పులను, వాల్నట్ లను తినడం ఎంతో మంచిదని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. నానబెట్టిన బాదం పప్పును ఖాళీకడుపుతో తినడం వల్ల అది అనేక వ్యాధుల నుండి మనలను కాపాడుతుందని చెబుతున్నారు. బాదంపప్పులో మన శరీరానికి కావలసిన ప్రొటీన్లు, మ్యాంగనీస్, విటమిన్ ఇ, ఫైబర్, ఒమేగా త్రీ మరియు ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచటంలో ఎంతగానో సహాయపడతాయి. ఇక మరోవైపు వాల్ నట్ లోను మన శరీరానికి కావలసిన పోషకాలు ఉంటాయి. ప్రొటీన్లు, క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, కాపర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, పాస్పరస్ వంటి అనేక పోషకాలు వాల్ నట్స్ లో ఉండటంవల్ల అవి మన శరీరానికి కావలసిన శక్తిని ఇస్తాయి.

 అల్పాహారంలో ఓట్స్ ఎంతో మంచిది

అల్పాహారంలో ఓట్స్ ఎంతో మంచిది

ఇక అల్పాహారంలో ఓట్స్ తీసుకోవడం కూడా చాలావరకు మేలు చేకూరుస్తుంది. ఓట్స్ తీసుకోవడం వల్ల రోజంతా ఉత్సాహం గా ఉండడమే కాకుండా, బరువు కూడా మన కంట్రోల్ లో ఉంటుంది. ఓట్స్ మన శరీరాన్ని లైట్ గా ఫీలేయ్యేలా చేస్తుంది. మనం శీతాకాలంలో తీసుకోగలిగిన ఉత్తమ అల్పాహారంగా పరిగణిస్తారు. కాబట్టి ఈ సీజన్ లో ఓట్స్ అల్పాహారంలో భాగంగా చేసుకోవడం మంచిదని సలహా ఇవ్వబడింది.

అల్పాహారంలో బొప్పాయితో శరీరానికి కావాల్సిన పోషకాలు

అల్పాహారంలో బొప్పాయితో శరీరానికి కావాల్సిన పోషకాలు

ఇక బొప్పాయి అల్పాహారంలో తీసుకుంటే ఎంతో మంచి జరుగుతుంది. బొప్పాయిని ఖాళీకడుపుతో తీసుకోవడం వల్ల మన జీర్ణ వ్యవస్థ సమతౌల్యం దెబ్బతినకుండా ఉంటుంది. అనేక వ్యాధుల నుండి రక్షించడంలో బొప్పాయి కీలక భూమిక పోషిస్తుంది. బొప్పాయిలో ఉండే విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఈ లు, కెరోటిన్, ఖనిజాలు, ఫ్లేవనాయిడ్లు, ఫోలేట్లు, పీచు పదార్థాలు, పాంతోనిక్ ఆమ్లాలు మన శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తాయి. కనుక ఉదయం అల్పాహారంగా బొప్పాయిని తీసుకుంటే ఎంతో మంచి జరుగుతుందని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

English summary
To stay healthy, make sure to include papaya, oats, soaked almonds and walnuts in your morning breakfast.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X