వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

health tips: హైబీపీ తో బాధపడుతున్నారా? జీవనశైలి మార్చుకుని, ఈ చిట్కాలు పాటించి చూడండి!!

|
Google Oneindia TeluguNews

అధిక రక్తపోటు.. హై బీపీ, హై బ్లడ్ ప్రెజర్ ఇప్పుడు దేశానికి ఉన్న అతి పెద్ద ఆరోగ్య సమస్య . ఎప్పుడూ రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవాలి కానీ ఇప్పుడు మన జీవన శైలి, మనం తీసుకునే ఆహారం, విపరీతమైన పని ఒత్తిడి మనలను బీపీ బాధితులుగా మారుస్తుంది. అధిక రక్తపోటు ఎటువంటి హెచ్చరిక సంకేతాలను చూపకుండా తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది.

అధిక రక్తపోటు.. హై బీపీ, హై బ్లడ్ ప్రెజర్ ఇప్పుడు దేశానికి ఉన్న అతి పెద్ద ఆరోగ్య సమస్య . ఎప్పుడూ రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవాలి కానీ ఇప్పుడు మన జీవన శైలి, మనం తీసుకునే ఆహారం, విపరీతమైన పని ఒత్తిడి మనలను బీపీ బాధితులుగా మారుస్తుంది. అధిక రక్తపోటు ఎటువంటి హెచ్చరిక సంకేతాలను చూపకుండా తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది.

అధిక రక్తపోటు వల్ల ప్రమాదాలు ఇవే

అధిక రక్తపోటు వల్ల ప్రమాదాలు ఇవే

రక్తపోటు అధికంగా ఉంటే, అది గుండె జబ్బులు, స్ట్రోక్, మూత్రపిండాలు దెబ్బ తినటానికి కారణం అవుతుంది. అయితే తెలుసుకోవాల్సిన మంచి విషయం ఏమిటంటే జీవనశైలి మార్పులు మీ రక్తపోటును సహజంగా తగ్గించడంలో మీకు సహాయపడతాయి. అలా రక్తపోటు నార్మల్ గా ఉంచుకుంటే తప్పకుండా పై అనారోగ్య సమస్యల నుండి దూరంగా ఉండే అవకాశం ఉంటుంది.

 సహజంగా రక్తపోటును తగ్గించటానికి చెయ్యాల్సింది ఇదే

సహజంగా రక్తపోటును తగ్గించటానికి చెయ్యాల్సింది ఇదే

రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. సాధారణ శారీరక శ్రమ మిమ్మల్ని మంచి ఆరోగ్యంగా ఉంచడంతో పాటు,వ్యాయామం అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. మీ బరువును నిర్వహించడానికి, మీ హృదయాన్ని బలోపేతం చేయడానికి, మీ ఒత్తిడి స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. ప్రతీ రోజూ చురుకైన నడక వంటి మితమైన-తీవ్రతతో కూడిన శారీరక శ్రమతో వారానికి కనీసం 150 నిమిషాల వ్యాయామాన్ని లక్ష్యంగా పెట్టుకోవడానికి ప్రయత్నించండి అని వైద్యులు చెప్తున్నారు.

 ఉప్పు తక్కువగా తినండి

ఉప్పు తక్కువగా తినండి

చాలామంది తమకు తెలియకుండానే ఉప్పు ఎక్కువగా తింటారు. ఉప్పు ఎక్కువగా తినటం వల్ల బీపీ విపరీతంగా పెరుగుతుంది. మీ ఆహారంలో సోడియం యొక్క తగ్గింపు కూడా మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది . అది మీకు రక్తపోటు ఉన్నట్లయితే మీ రక్తపోటును తగ్గించవచ్చునని వైద్యులు చెప్తున్నారు. మీ ఆహారంలో సోడియం తగ్గించడానికి, ఈ చిట్కాలను ప్రయత్నించండి. ప్రాసెస్ చేసిన ఆహారాలను తక్కువగా తినండి. సహజంగా ఆహారంలో కొద్ది మొత్తంలో సోడియం మాత్రమే ఉంటుంది. మనం తినే సోడియంలో దాదాపు 70 శాతం ప్రాసెస్డ్, ప్రీప్యాకేజ్డ్ మరియు రెస్టారెంట్ ఫుడ్స్ నుండి వస్తుంది. ఎక్కువగా ఉప్పు వేయవద్దు. కేవలం 1 టీస్పూన్ ఉప్పులో 2,300 mg సోడియం ఉంటుంది. మీకు ఇష్టమైన వంటకాలకు రుచిని జోడించడానికి సోడియం తక్కువగా ఉండే ప్రత్యామ్నాయాలను వాడుకోండి. కానీ ఉప్పును విపరీతంగా వాడి ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడెయ్యకండి.

అధిక రక్తపోటును తగ్గించడానికి మీ ఆహారంలో ఎక్కువ పొటాషియం అవసరం

అధిక రక్తపోటును తగ్గించడానికి మీ ఆహారంలో ఎక్కువ పొటాషియం అవసరం

పొటాషియం హృదయ స్పందన రేటును నియంత్రించడంలో సహాయపడటమే కాకుండా, శరీరంలో సోడియం ప్రభావాలను కూడా తగ్గిస్తుంది. పొటాషియం మీ శరీరం సోడియం నుండి బయటపడటానికి సహాయపడుతుంది మరియు మీ రక్తనాళాల గోడలలో ఒత్తిడిని తగ్గిస్తుంది, ఈ రెండూ రక్తపోటును మరింత తగ్గించడంలో సహాయపడతాయి" అని వైద్యులు చెప్తున్నారు. మీ పొటాషియం తీసుకోవడం పెంచడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గం సప్లిమెంట్లను తీసుకోకుండా మీ ఆహారాన్ని సర్దుబాటు చేయడమని సూచిస్తున్నారు.

పొటాషియం ఎక్కువ ఉండే ఆహారాలు ఇవే

పొటాషియం ఎక్కువ ఉండే ఆహారాలు ఇవే

పొటాషియం అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవటం మంచిదని చెప్తున్నారు. అరటిపండ్లు, పుచ్చకాయలు, నారింజలు, ఆప్రికాట్లు, అవకాడోలు మరియు టమోటాలు వంటి పండ్లు, పాలు, పెరుగు మరియు క్రీమ్ చీజ్, ఆకు పచ్చని కూరగాయలు, బంగాళదుంపలు మరియు చిలగడదుంపలు, ట్యూనా మరియు సాల్మన్, బీన్స్ వంటి ఆహారాలను మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మీకు సరైన పొటాషియం స్థాయి గురించి మీ వైద్యునితో మాట్లాడటం చాలా ముఖ్యం. అలాగే, మీకు ముఖ్యమైన మూత్రపిండ వ్యాధి ఉన్నట్లయితే, మీరు పొటాషియం ఎక్కువగా తీసుకోకుండా ఉండాలి, ఎందుకంటే మీ మూత్రపిండాలు దానిని తొలగించలేకపోవచ్చు.

ఆల్కహాల్ వినియోగాన్ని పరిమితం చేయండి

ఆల్కహాల్ వినియోగాన్ని పరిమితం చేయండి

మితంగా మద్యం సేవించడం మీ గుండెకు మేలు చేస్తుందని కొన్ని పరిశోధనలు చూపిస్తున్నాయి. అయితే, ఒక సమయంలో ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల మీ రక్తపోటులో అకస్మాత్తుగా పెరుగుదల వస్తుంది. ఆల్కహాల్ తీసుకోవడం పర్యవేక్షించడం చాలా ముఖ్యం. ఆల్కహాలిక్ పానీయాలు గణనీయమైన మొత్తంలో కేలరీలు మరియు చక్కెరను కలిగి ఉంటాయి. ఇవి శరీర కొవ్వు మరియు బరువు పెరగడానికి దోహదం చేస్తాయి.ఈ రెండూ కాలక్రమేణా అధిక రక్తపోటుకు దారితీసే కారకాలు" అని వైద్యులు చెప్తున్నారు. మీరు ప్రస్తుతం అధిక రక్తపోటు చికిత్సకు మందులు తీసుకుంటుంటే, ఆల్కహాల్ తీసుకోవడం గురించి ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలని చెప్తున్నారు .

మీ రక్తపోటును తగ్గించడానికి మీ ఒత్తిడిని తగ్గించండి

మీ రక్తపోటును తగ్గించడానికి మీ ఒత్తిడిని తగ్గించండి

రోజువారీ జీవితంలో ఒత్తిడిని కలిగి ఉంటాము. ఇది రక్తపోటులో తాత్కాలిక పెరుగుదలకు కారణమవుతుంది. చాలా సందర్భాలలో, ఒత్తిడితో కూడిన పరిస్థితి పరిష్కరించబడిన తర్వాత, మీ హృదయ స్పందన రేటు మరియు రక్తపోటు సాధారణ స్థితికి వస్తాయి. అయినప్పటికీ, దీర్ఘకాలిక ఒత్తిడి అధిక రక్తపోటు, గుండె జబ్బులు మరియు స్ట్రోక్‌తో సహా అనేక రకాల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు మిమ్మల్ని ప్రమాదంలో పడేస్తుంది. కనుక ఒత్తిడి తగ్గించుకోండి.

బీపీ ఏ విధంగా ఉందో ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకోండి

బీపీ ఏ విధంగా ఉందో ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకోండి

ఇక హైబీపీతో బాధపడుతున్న వారు ఎప్పటికప్పుడు బ్లడ్ ప్రెషర్ ఏవిధంగా ఉంది అనేది మానిటర్ చేయాల్సిన అవసరం ఉంటుందని చెబుతున్నారు. రెగ్యులర్ గాహెల్త్ చెకప్ చేయించుకోవడం మంచిదని సూచిస్తున్నారు. జీవన సరళిలో మార్పులు చేసుకోవటంతో పాటు గా ఆరోగ్యంపట్ల శ్రద్ధ వహించాలని సూచిస్తున్నారు. రెగ్యులర్ గావైద్యులను సంప్రదించి బ్లడ్ ప్రెషర్ ను ఏవిధంగా కంట్రోల్లో ఉంచుకోవాలోవైద్యులు చేసే సూచనల ద్వారా తెలుసుకోవాలని చెబుతున్నారు.

కుటుంబం మరియు స్నేహితుల సహకారం తీసుకోండి

కుటుంబం మరియు స్నేహితుల సహకారం తీసుకోండి

మంచి ఆరోగ్యానికిసహాయం చేసే కుటుంబంమరియు స్నేహితులు ముఖ్యం.వారు రక్తపోటు సమస్య నుండి మాత్రమే కాకుండా, ఇతర అనారోగ్య సమస్యల నుండి కూడా మీరు బయట పడడానికి కావలసిన మద్దతునిస్తారు. మీకు తగిన ధైర్యాన్ని అందించి మీరు ఆ సమస్యలను అధిగమించడానికి ఆచరణాత్మకమైన చిట్కాలను ఇచ్చి మిమ్మల్ని ముందుకు నడిపిస్తారు.కాబట్టి కుటుంబ సహకారం కూడా బీపీ వంటి సమస్యలనే కాదు, ఇతర అనారోగ్య సమస్యలను తగ్గించుకోవడంలోకీలక పాత్ర పోషిస్తుంది.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

English summary
Suffering from high BP? Try to change your lifestyle, exercise, reduce salt in your diet, consume more potassium, and reduce stress along with proper eating habits. BP is well controlled.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X