వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

health tips: బరువు త్వరగా తగ్గాలనుకుని చేసే కామన్ మిస్టేక్స్ ఇవే; బీ కేర్‌ఫుల్!!

|
Google Oneindia TeluguNews

ప్రస్తుత సమాజంలో చాలామంది ఊబకాయంతో బాధపడుతున్నారు. విపరీతమైన బరువు పెరగడం వల్ల అనారోగ్యాల బారిన పడుతున్నారు. చాలా రోగాలతో బాధపడుతున్న వారు ఆసుపత్రులకు వెళితే వైద్యులు వారు బరువు తగ్గాలని సూచించడం ప్రధానంగా కనిపిస్తుంది. ఇక బరువు తగ్గడం కోసం ఒక క్రమబద్దమైన ప్రణాళికతో ప్రయత్నం చేయకుండా, ఒక్కసారిగా బరువు తగ్గిపోవాలని చాలామంది అనేక తప్పులు చేస్తూ ఊహించని కొత్త అనారోగ్య సమస్యలను తెచ్చుకుంటున్నారు. త్వరగా బరువు తగ్గాలని సహజంగా చేసే కొన్ని తప్పులను గురించి ఈరోజు తెలుసుకుందాం.

health tips: బరువు తగ్గాలనుకుంటున్నారా? వేగంగా బరువు తగ్గాలంటే ఈ ఫుడ్స్ తినండి!!health tips: బరువు తగ్గాలనుకుంటున్నారా? వేగంగా బరువు తగ్గాలంటే ఈ ఫుడ్స్ తినండి!!

 ఒక్కసారిగా ఆహారం మానెయ్యటంతో కొత్త సమస్యలు

ఒక్కసారిగా ఆహారం మానెయ్యటంతో కొత్త సమస్యలు


బరువు తగ్గాలని భావించేవారు ఒక్కసారిగా ఆహారాన్ని మానేస్తుంటారు. అప్పటి వరకూ విపరీతంగా, శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ కేలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకొని, బరువు తగ్గడం కోసం ఒక్కసారిగా ఆహారాన్ని మానేయడం చేస్తూ ఉంటారు. అయితే అలా ఒక్కసారిగా ఆహారాన్ని మానివేయడం అనారోగ్యానికి కారణం అవుతుందని వైద్యులు సూచిస్తున్నారు. మన శరీరానికి కావలసిన ప్రొటీన్లు, ఫైబర్ కావలసినంత తీసుకోవలసిన అవసరం ఉందని, కానీ బరువు తగ్గాలనుకునేవారు అవేవి పట్టించుకోకుండా మొత్తానికే ఆహారాన్ని మానివేయడం శరీరంలో జీవక్రియను పూర్తిగా దెబ్బతీస్తుందని వైద్యులు చెబుతున్నారు.

టీవీలు, యూ ట్యూబ్ చానల్స్ లో చెప్పే చిట్కాలు పాటించటం మంచిది కాదు

టీవీలు, యూ ట్యూబ్ చానల్స్ లో చెప్పే చిట్కాలు పాటించటం మంచిది కాదు


అతిగా తినడం, అల్పంగా తినడం రెండూ హానికరమని చెబుతున్నారు. శరీరానికి ఏం కావాలి? ఎంత కావాలి? అనేది తెలుసుకుని, పూర్తి అవగాహనతో ఆహారాన్ని తీసుకున్నప్పుడు అది ఆరోగ్యంగా బరువు తగ్గడానికి ఉపయోగపడుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇక ఇదే సమయంలో జీవనశైలి మెరుగుదల కోసం టీవీలలోనూ, యూట్యూబ్ ఛానల్ లోనూ చెప్పే ఆహార చిట్కాలను అందరూ పాటించడం మంచిది కాదని కూడా చెబుతున్నారు. ఎవరు ఏది చెబితే అది పాటిస్తే తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుందని సూచిస్తున్నారు.

శరీరానికి, ఆరోగ్య సమస్యలకు తగ్గట్టు డైట్ ప్లాన్ చేసుకోవాలి

శరీరానికి, ఆరోగ్య సమస్యలకు తగ్గట్టు డైట్ ప్లాన్ చేసుకోవాలి


కొందరు తృణ ధాన్యాలను ఆహారంగా తీసుకోవాలని చెబుతుంటే, మరి కొందరు కేవలం బటర్ చికెన్ ఆహారంగా తీసుకుంటే త్వరగా బరువు తగ్గుతామని చెబుతుంటారు. ఇంకొందరు కొబ్బరి నూనెతో చేసిన వంటకాలతో బరువు త్వరగా తగ్గుతామని చెబుతూ ఉంటారు. అయితే ఈ సూచనలు మంచివే అయినప్పటికీ, ప్రతి ఒక్కరు వారి శరీరానికి తగినట్టుగా, వారి అనారోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకొని న్యూట్రిషనిస్ట్ ను సంప్రదించి డైట్ ప్లాన్ చేసుకోవలసిన అవసరం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అలాకాకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఏది పడితే అది పాటిస్తే తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుందని అంటున్నారు.

మితిమీరిన వ్యాయామం తోనూ డేంజర్

మితిమీరిన వ్యాయామం తోనూ డేంజర్


ఇక బరువు తగ్గాలనుకునేవారు విపరీతమైన వర్కౌట్స్ పై దృష్టి సారిస్తున్నారు. బరువు తగ్గాలనుకునేవారు వ్యాయామం చేయడం తప్పు కాదు కాని, మోతాదును మించి వ్యాయామం చేయడం మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు. అసలే వ్యాయామం చేయకపోవడం, విపరీతంగా బరువు పెరిగిన తర్వాత, ఆ బరువు తగ్గడం కోసం మోతాదును మించి వ్యాయామం చేయడం ఒక్కొక్కసారి తీవ్రమైన అనారోగ్యానికి కారణం అవుతుందని చెబుతున్నారు. బరువు తగ్గాలంటే వ్యాయామం చేయడం తప్పనిసరి అని అయితే ఎలా పడితే అలా వ్యాయమం చేయడం ఒక్కోసారి కొత్త సమస్యలను సృష్టిస్తుందని, సరైన గైడెన్స్ తో ఆరోగ్యకరమైన రీతిలో వ్యాయామం చేయడం మంచిదని సూచిస్తున్నారు.

బరువు తగ్గటంపైనే ధ్యాస మంచిది కాదు

బరువు తగ్గటంపైనే ధ్యాస మంచిది కాదు


ఇక బరువు తగ్గాలని భావించేవారు ఎంత బరువు తగ్గాము అన్నదానిపై పదేపదే దృష్టిని సారిస్తూ ఉండటం మంచిది కాదని, తక్కువ సమయంలో ఎక్కువ బరువు తగ్గాలని ప్రయత్నం చేయడం ఏ మాత్రం మంచిది కాదని చెబుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ బరువు తగ్గాలని పూర్తిగా భోజనం మానేయడం, విపరీతమైన ఎక్సర్సైజులు చేయడం, శరీర మెటబాలిజంను దెబ్బతీస్తాయని వైద్యులు సూచిస్తున్నారు. ఇక పదేపదే బరువు తగ్గామా లేదా అన్న దృష్టి కూడా మంచిది కాదని చెబుతున్నారు.

వాస్తవాలకు దూరంగా బరువు తగ్గటంపై అంచనాలు మంచివి కాదు

వాస్తవాలకు దూరంగా బరువు తగ్గటంపై అంచనాలు మంచివి కాదు


బరువు తగ్గాలి అనే ఆలోచన నిరంతరంగా ఉండాల్సిన ఆలోచన అని, ఒక్కసారే అనుకున్నదే తడవుగా బరువు తగ్గడం కోసం చూపించే అత్యుత్సాహం మంచిది కాదని చెబుతున్నారు. వాస్తవానికి దూరంగా ఉండే అంచనాలు బరువు తగ్గడం విషయంలో పెట్టుకోవడం మంచిది కాదని, అది మన మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని చెబుతున్నారు.

 ఆహారం, వ్యాయామం విషయంలో చెయ్యాల్సింది ఇదే

ఆహారం, వ్యాయామం విషయంలో చెయ్యాల్సింది ఇదే


ఇక ఆహారం విషయంలో మంచి న్యూట్రిషనిస్ట్ సలహా తీసుకోవాలని, వ్యాయామం విషయంలో ఎటువంటి వ్యాయామాలు చేస్తే మంచిది అన్నది ట్రైనర్ ద్వారా తెలుసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. సొంత ప్రయోగాలు ఆరోగ్యానికి మేలు చేయకపోగా మరింత చేటు చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అందుకే బరువు తగ్గాలంటే తగిన జాగ్రత్తలతో నిదానంగా బరువు తగ్గాలని సూచిస్తున్నారు.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

English summary
Wanting to lose weight quickly, they avoid food completely and exercise excessively. Doctors say be careful that there is a possibility of getting into trouble with these common mistakes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X