వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

health tips: సీతాఫలాలను తినటానికి ఆలోచిస్తున్నారా? వీటిలో ఉండే పోషకాలు తెలిస్తే తినకుండా ఉండలేరు!!

|
Google Oneindia TeluguNews

సీతాఫలం.. పేదల యాపిల్ గా పిలిచే సీతాఫలం మనకు దొరికే శీతాకాలం వచ్చేసింది. అటు మార్కెట్లోనూ, ఇటు ఎక్కడ చూసినా ఇబ్బడిముబ్బడిగా సీతాఫలం చెట్లు తీయటి సీతాఫలాలను ఇస్తున్నాయి. చాలా తియ్యగా ఉండే సీతాఫలం ఎంత తిన్నా తనివి తీరదు. అయితే చాలామంది సీతాఫలం తినాలంటే భయపడుతూ ఉంటారు. ముఖ్యంగా డయాబెటిస్ బాధితులు, బీపీ ఉన్నవారు, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారు, కిడ్నీ సమస్యలు ఉన్న వారు సీతాఫలం తినకూడదని భావిస్తూ ఉంటారు. కానీ డయాబెటిస్ బాధితులు కూడా సీతాఫలాలను తినొచ్చని, అయితే మితంగా తినాలి అని తాజా పరిశోధనలలో వెల్లడైనట్టు తెలుస్తుంది. సీతాఫలాలు తినడం వల్ల కొంతమందికి కలిగే ఆరోగ్య నష్టం కంటే, కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధనల్లో తేలింది.

సీతాఫలంలో ఎనలేని పోషకాలు

సీతాఫలంలో ఎనలేని పోషకాలు

సీతాఫలంలో పుష్కలంగా ఉండే ప్రోటీన్, క్యాల్షియం, విటమిన్ సి,మెగ్నీషియం, పొటాషియం, పాస్పరస్, ఐరన్, విటమిన్ బి 6, విటమిన్స్ బీ2, జింక్, విటమిన్ బి 5, ఫైబర్ మనకు ఎంతో ఆరోగ్యప్రయోజనాలను చేకూరుస్తాయని చెబుతున్నారు. సీతాఫలంలో కార్బోహైడ్రేట్లు, సుక్రోజ్, గ్లూకోజ్, ఫ్రక్టోజ్ , కొవ్వు కొంతమంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారిలో చిన్నచిన్న ఇబ్బందులకు కారణం అయినప్పటికీ, మొత్తంగా చూస్తే వీటిల్లో ఉండే పోషక విలువలు మన ఆరోగ్యానికి మంచి చేస్తాయని వైద్యులు చెబుతున్నారు.

సీతాఫలం తింటే గుండె ఆరోగ్యం

సీతాఫలం తింటే గుండె ఆరోగ్యం

సీతాఫలాన్ని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని సూచిస్తున్నారు. గుండెజబ్బులు ఉన్నవారు సీతాఫలం తినడానికి భయపడాల్సిన అవసరం లేదని, సీతాఫలం లో ఉండే మంచి పోషక విలువలు గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి అని సూచిస్తున్నారు. సీతాఫలం లో ఉండే పొటాషియం మన శరీరంలోని బ్లడ్ ప్రెషర్ ను నియంత్రించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. కిడ్నీ సమస్యలు లేని వారు సీతాఫలాన్ని తీసుకున్నట్లయితే అందులో ఉండే పొటాషియం గుండెపోటు వచ్చే అవకాశాలను 24 శాతం తగ్గిస్తుందని చెబుతున్నారు.

సీతాఫలంతో చర్మ ఆరోగ్యం , యాంటీ ఆక్సిడెంట్ గుణాలు

సీతాఫలంతో చర్మ ఆరోగ్యం , యాంటీ ఆక్సిడెంట్ గుణాలు

సీతాఫలం తినేవారిలో చర్మ సంబంధిత సమస్యలు తక్కువగా వస్తాయని, చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుందని, జుట్టు ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు . సీతాఫలం లో ఉండే విటమిన్ సి వల్ల చర్మ ఆరోగ్యం బాగుంటుందని, విటమిన్ సి యు వి రేడియేషన్ నుంచి మన శరీరాన్ని కాపాడుతుందని చెబుతున్నారు. సీతాఫలం లో ఉండే మంచి యాంటీ ఆక్సిడెంట్ గుణాలు మన శరీరానికి నష్టం కలిగించే ఫ్రీ రాడికల్స్ నుంచి మనల్ని కాపాడతాయి చెబుతున్నారు.

ఎముకల ఆరోగ్యానికి, జీర్ణ వ్యవస్థ మెరుగుదలకు సీతాఫలం

ఎముకల ఆరోగ్యానికి, జీర్ణ వ్యవస్థ మెరుగుదలకు సీతాఫలం

సీతాఫలం ఇమ్యూనిటీని పెంచడంలో కీలకంగా పనిచేస్తుందని చెబుతున్నారు. సీతాఫలం శరీరంలో వచ్చే వాపులకు, నొప్పులకు ఒక మందులా పనిచేస్తుందని సూచిస్తున్నారు. అంతేకాదు ఎముకల ఆరోగ్యానికి సీతాఫలం ఎంతగానో ఉపయోగపడుతుందని సూచిస్తున్నారు. సీతాఫలం మన జీర్ణ వ్యవస్థను సక్రమంగా పనిచేసేలా చేస్తుందని , అంతేకాదు కంటి ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో సీతాఫలం ఎంతగానో ఉపయోగ పడుతుందని సూచిస్తున్నారు.

సీతాఫలాలు తింటే నో డిప్రెషన్

సీతాఫలాలు తింటే నో డిప్రెషన్

సీతాఫలాలు తినడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని, మెదడు ఆరోగ్యంగా ఉంటుందని, జ్ఞాపకశక్తి పెరుగుతుందని సూచిస్తున్నారు. సీతాఫలాలు తినే తినేవారు డిప్రెషన్ నుండి కూడా బయట పడవచ్చని చెబుతున్నారు. అయితే సీతాఫలం తీసుకోవడంలో సమయపాలన చేయాలని, రాత్రి వేళల్లో ఎట్టిపరిస్థితిలోనూ సీతాఫలాన్ని తినొద్దు అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

అలాగే మితంగా సీతాఫలాలు తినడం వల్ల ఎలాంటి ప్రమాదమూ రాదని, విపరీతంగా తినడం వల్ల కొందరిలో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఎన్నో పుష్కలమైన పోషక విలువలు ఉన్న, మన ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్న సీతాఫలాలు తినే విషయంలో అపోహలను పక్కనపెట్టి మితంగా తిని ఆరోగ్యంగా ఉండాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

English summary
It is said that the abundant protein, calcium, vitamin C, magnesium, potassium, phosphorus, iron, vitamin B6, vitamins B2, zinc, vitamin B5 and fiber in the custard apple bring many health benefits to us.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X