health tips: చిన్న వయసులోనే ముఖంపై ముడతలు.. కారణాలివే; ముడతలు తగ్గాలంటే చెయ్యాల్సింది ఇదే!!
చాలామంది చిన్న వయసులోనే ముఖంపై ముడతలు వస్తున్నాయని, తమ తోటి వారి కంటే పెద్దవయసు వారి లాగా కనిపిస్తున్నామని బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు చర్మ సంరక్షణ విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు, ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటిస్తే ముఖంపై ముడతలు మాయమవుతాయని చెబుతున్నారు. ఇక ఆ జాగ్రత్తల విషయానికి వస్తే..

ముఖంపై ముడతలకు కారణాలివే..
ముఖంపై పోషకాల లోపంతో, ఒత్తిడి వల్ల, నిద్రలేమి వల్ల, కంప్యూటర్ స్క్రీన్ కు దగ్గరగా కూర్చోవడం వల్ల, ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల, వయసు మళ్ళటం వల్ల, స్మోకింగ్ మరియు డ్రింకింగ్ వంటి చెడు అలవాట్ల వల్ల ముడతలు వస్తాయి ,ముఖ్యంగా కళ్ళు, నుదురు, మెడ, పెదవుల దగ్గర ముడతలు కనిపిస్తాయి. దీంతో చాలామంది ముఖం పైన వచ్చే ముడతలను చూసుకొని ఆందోళనకు గురవుతుంటారు. అయితే ఆందోళనను పక్కనపెట్టి ముఖంపై ముడతలకు కొన్ని చిట్కాలను పాటిస్తే సరిపోతుంది.

ముఖంపై ముడతలు తగ్గించటంలోఆహారానిది కీలక పాత్ర
ఇక వాటిలో ముఖ్యమైనది మనం తీసుకునే ఆహారం. మనం తీసుకునే ఆహారం కూడా మన చర్మంపై ప్రభావం చూపిస్తుంది. బొప్పాయి, దానిమ్మ, బ్లూ బెర్రీస్ వంటి పండ్లు, బ్రోకలీ, అవకాడో, బచ్చలి కూర, రెడ్ బెల్ పెప్పర్ పండ్లు కూరగాయలు మన ముఖం పైన ముడతలను కనిపించకుండా చేస్తాయి. ఇక అంతే కాకుండా డ్రైఫ్రూట్స్ కూడా ముఖం పైన ముడతలు తగ్గించడంలో కీలక భూమిక పోషిస్తాయి. బాదం పప్పులో విటమిన్ ఈ ఉండడంవల్ల, అది ముఖంపై వచ్చే ముడతలను తగ్గిస్తుంది.

ముఖంపై ముడతలు తగ్గించటంలో వీటిని వాడి ఫలితం చూడండి
ఇక ముఖంపై ముడతలను తగ్గించడంలో మాయిశ్చరైజర్స్ కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. మాయిశ్చరైజర్ తో ముఖం మీద సున్నితంగా మసాజ్ చేస్తే ముఖ రక్తప్రసరణ ఉత్తేజంగా జరిగి ముఖంపైన ముడతలను తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. బాదం నూనె, కొబ్బరి నూనె, లావెండర్ నూనె, రోజ్మెరీ, దానిమ్మ నూనె, నిమ్మ నూనె వంటివి కూడా ముఖంపై ముడతలను తగ్గించడంలో కీలక భూమిక పోషిస్తాయి. ముఖం మీద ఆయిల్ తో కానీ, మాయిశ్చరైజర్ తో కానీ మసాజ్ చేయాలనుకుంటే మెడ, దవడ పైన ఉన్న ప్రదేశంలో పై దిశ లోకి వృత్తాకారంలో మసాజ్ చేస్తే మంచిదని చెబుతున్నారు.

ముఖంపై ముడతలు తగ్గాలంటే ఇవి చేసి చూడండి
ఇక ముఖం పై ముడతలు తగ్గడం కోసం అనేక ముఖ్య వ్యాయామాలు ఎంతగానో ఉపయోగపడతాయని, ఫేషియల్ ఎక్సర్సైజెస్ తో ముఖంపై ముడతలు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయవచ్చని చెబుతున్నారు. సాధ్యమైనంత ఎక్కువ విశ్రాంతి తీసుకోవడం, ఒత్తిడి తగ్గించుకోవడం, ఎక్కువగా నీరు తాగడం వంటి పనులు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయని, తద్వారా ముఖం పై ముడతలు కనిపించకుండా పోతాయని చెబుతున్నారు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications