వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Food In News Paper: న్యూస్ పేపర్‍లో ఆహారం తీసుకుంటున్నారా.. అయితే మీరు ప్రమాదంలో పడినట్లే..!

|
Google Oneindia TeluguNews

మనం న్యూస్ పేపర్ ఎందుకు వేయించుకుంటాం. వార్తలు చదవడానికి. ఆ తర్వాత ఆ పేపర్లను ఏం చేస్తాం.. అమ్మేస్తాం.. ఆ పేపర్లను రిసైక్లింగ్ పంపిస్తారు.అయితే కొందరు ఈ న్యూస్ పేపర్లను షాపులు, బజ్జీల బండ్లు, హోటళ్లలో ఈ పేపర్లను వాడాతారు. ముఖ్యంగా నూనె ఉండే పదార్థాలు వేడి వేడి బజ్జీలు, పకోడాలు, స్పైసీ ఫుడ్స్ ని న్యూస్ పేపర్లలో చుట్టి ఇస్తుంటారు. చిన్న చిన్న దుకాణాల్లో, బండ్లపై అమ్మేవాళ్లు.. ఇలా న్యూస్ పేపర్లలలో ఈ ఆహార పదార్థాలను చుట్టి ఇవ్వడం చూస్తూ ఉంటాం. అయితే న్యూస్ పేపర్లలో పెట్టిన ఆహారం తీసుకుంటే మంచి కాదట. ఇలా చేయడం వల్ల వ్యాధులు వచ్చే అవకాశం ఉందట.

ఇంకు

ఇంకు

న్యూస్ పేపర్లలో వేడి ఆహారాన్ని చుడుతూ ఉంటారు. ముఖ్యంగా ఎక్కువ ఆయిల్, డీప్ ఫ్రై చేసిన ఆహారాలు న్యూస్ పేపర్ లో ఇంకుని, కెమికల్స్ ని గ్రహిస్తాయట. అలాగే కొంతమంది ఇంట్లో కూడా ఆయిలీ ఫుడ్స్ చేసేటప్పుడు కింద న్యూస్ పేపర్లను వాడుతూ ఉంటారు. అది కూడా ఏమాత్రం మంచిదట. న్యూస్ పేపర్ ప్రింటింగ్ కి ఉపయోగించే ఇంకులో ఉండే కెమికల్స్ ఆరోగ్యంపై వ్యతిరేక ప్రభావం చూపుతాయి. అలాగే అనేక అనారోగ్య సమస్యలకు కారణమవుతాయట. ముఖ్యంగా ఇమ్యునిటీ తక్కువగా ఉండే పిల్లలు, పెద్దవాళ్లపై తీవ్ర దుష్ర్పభావం చూపుతుందట.

మీ కంటి చూపు

మీ కంటి చూపు

కొందరు అనివార్య కారణాల వల్ల ప్రతిరోజూ బయటి ఆహారాన్ని తింటారు. రోజుకు మూడు పూటలా వార్తాపత్రికలో చుట్టి ఆహారం తినే వారు కూడా ఉన్నారు.ఇలా చేయడం వల్ల ఇంక్ లోని కెమికల్స్ శరీరంలోకి వెళ్తాయి. దీంతో కళ్లు దెబ్బతినే అవకాశం ఉందట. అందుకే ఫుడ్ సేఫ్టీ అథారిటీ కూడా.. న్యూస్ పేపర్లలో చుట్టిన ఆహారాలు తినకూడదని పేర్కొంది. ఇది ఆరోగ్యంపై దుష్ర్పభావం చూపుతాయని హెచ్చరించింది. పరిశుభ్రమైన వాతావరణంలో చేసిన ఆహారాలే ఆరోగ్యానికి మంచిదని స్పష్టం చేసింది.

లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం

లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం

న్యూస్ పేపర్ ప్రింట్స్ కెమికల్స్ ని కలిగి ఉంటాయి. అవి ఇంకుని త్వరగా డ్రైగా మార్చడానికి సహాయపడతాయి. దీంతో ఆహార పదార్థాలకు అతుక్కుపోతాయి. దీంతో బ్లాడర్, లంగ్ క్యాన్సర్ అవకాశం ఉందట. న్యూస్‌పేపర్లో ఆహారాన్ని అందించడాన్ని నివారించేందుకు చట్టబద్ధమైన చర్యలు తీసుకునే అవకాశం ఏదీ లేదు. కాకపోతే ప్రజల్లోనూ, అమ్మకందారుల్లోనూ తగిన అవగాహన కల్పించేందుకు దేశమంతటా ప్రచారం చేసే దిశగా FSSAI చర్యలు తీసుకుంటోంది.

హార్మోన్లపై ప్రభావం

హార్మోన్లపై ప్రభావం

న్యూస్ పేపర్లలో ప్రింటింగ్ కి ఉపయోగించే ఇంకులో కొన్ని హానికారక కెమికల్స్ ఉంటాయి. అవి హార్మోన్ల పనితీరుపై దుష్ర్పభావం చూపుతాయి. దీంతో తీవ్రవైన అనారోగ్య సమస్యలకు కారణమవుతాయి. FSSAI ప్రకారం న్యూస్‌పేపర్‌ ముద్రణలో వాడే నానారకాల రంగులు, రసాయనాల వల్ల ఆరోగ్యానికి తీవ్రహాని అవకాశం ఉందట.

English summary
There is a possibility of contracting diseases if food is consumed in newspapers. Especially problems like cancer are likely to occur.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X