వాస్తు ప్రకారం వంటగదిలో ఈ 3 వస్తువులు ఉంటే నెగెటివిటీ చూడమన్నా చూడదు

ఇంట్లో తరచుగా ప్రతికూల వాతావరణం, తెలియని భారమైన భావన లేదా అకారణ చికాకు కలుగుతుందా? చాలామంది ఇలాంటి అనుభవాలను ఎదుర్కొంటారు. ఇంటిలోని ప్రతికూల శక్తి దీనికి ప్రధాన కారణం కావొచ్చు. ఈ ప్రతికూలతను తొలగించడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. మీ వంటగదిలో నిత్యం అందుబాటులో ఉండే మూడు సాధారణ వస్తువులతోనే ఇంటి వాతావరణాన్ని సానుకూలంగా మార్చవచ్చని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వాస్తు శాస్త్రం ప్రకారం, ప్రతికూల శక్తిని తొలగించడంలో సైంధవ లవణం అత్యంత శక్తివంతమైనది. ఇది ఇంట్లోని నెగెటివ్ ఎనర్జీని గ్రహించి, వాతావరణాన్ని శుద్ధి చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. మీ ఇంట్లో ప్రతికూలత అధికంగా ఉందని భావిస్తే, ఒక చిన్న గాజు గిన్నెలో సైంధవ లవణాన్ని ఉంచి, ఇంటిలోని ఏదైనా మూలలో ఉంచండి. ప్రతి 12 నుండి 15 రోజులకు ఒకసారి ఈ ఉప్పును మార్చండి. ఇలా చేయడం ద్వారా ఇంట్లో ప్రతికూల వాతావరణం తగ్గి, సానుకూల శక్తి విస్తరిస్తుంది.

Kitchen Vastu Tips Discover The Power Of Salt Clove And Turmeric To Banish Negative Energy At Home

వంటగదిలో కనిపించే పసుపు ఇంట్లోని ప్రతికూలతను దూరం చేయగలదు. నిత్యం సాయంత్రం వేళ దీపారాధన చేసేటప్పుడు దీపపు ప్రమిదలో చిటికెడు పసుపు వేయండి. ఈ చిన్న మార్పు ఇంటిలోకి సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. అలాగే పసుపుతో మీ ఇంటి ప్రధాన ద్వారంపై శుభ చిహ్నమైన స్వస్తిక్ గుర్తును గీయడం ద్వారా సానుకూల శక్తి ప్రవాహం మెరుగుపడుతుంది.

సాయంత్రం వేళ లవంగాలు, కర్పూరం కలిపి వెలిగించడం వల్ల ఇంటిలోని ప్రతికూల శక్తులు తక్షణమే దూరం అవుతాయని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ఇది దుష్ట శక్తులను, చెడు దృష్టిని కూడా తొలగిస్తుందని నమ్ముతారు. ఒక మట్టి దీపంలో లేదా ధూప పాత్రలో రెండు లవంగాలను కొద్దిపాటి కర్పూరంతో కలిపి వెలిగించండి. ఆ పొగను ఇంటిలోని ప్రతి మూలకు చూపించడం ద్వారా ఇంటి వాతావరణం తాజాగా మారి సానుకూలత పెరుగుతుంది.

వాస్తు నియమాల ప్రకారం, వంటగదిని పరిశుభ్రంగా నిర్వహించుకుంటే ఇంటిలోని సగం ప్రతికూలత అక్కడి నుండే తొలగిపోతుంది. చాలా ఇళ్లలో రాత్రిపూట మురికి పాత్రలను సింక్‌లోనే వదిలివేసే అలవాటు ఉంటుంది. ఇది వాస్తు ప్రకారం సరైన పద్ధతి కాదు, ఇంట్లోకి ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది. కాబట్టి, నిద్రపోయే ముందు గిన్నెలు శుభ్రం చేసుకోవడం ఉత్తమం. వీటితో పాటు, వంటగదిలోని ఉప్పు, పసుపు డబ్బాలు ఎప్పుడూ ఖాళీగా ఉండకుండా చూసుకోండి. అవి ఖాళీగా ఉంటే ఇంటికి శ్రేయస్సు దూరమవుతుందని ప్రబల నమ్మకం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+