Mustard Benefits: ఆవాలే కదా ని తీసుపారేయకండి.. ఎందుకంటే..
మనం కర్రీ చేసుకునేటప్పుడు తప్పకుండా జీలకర్ర, ఆవాలు వేస్తుంటం. కానీ కొంత మంది ఆవాలు అంటే ఇష్టముండదు. దీంతో తినేటప్పుడు ఆవాలు తీసిపడేస్తారు. కానీ ఆవాలతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
ఆవాలలో మినరల్స్ సమృద్ధిగా ఉంటాయట. కాల్షియం, పొటాషియం, మెగ్నిషియం, పాస్ఫరస్ తదితర పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

జీర్ణ సమస్యలు
శ్వాసకోశ సమస్యలు, నొప్పులు, జీర్ణ సమస్యలు ఉన్నవారు ఆవాలను తింటే ప్రయోజనంగా ఉంటుదట.
ఆవాలలో ఉండే ఫైబర్ జీర్ణ ప్రక్రియను మెరుగుపరచడమే కాకుండా... విరేచనం సులభంగా అయ్యేలా చేస్తుందట. ఆవాలలో ఉండే కాపర్, ఐరన్, మెగ్నిషియం, సెలీనియంలు హైబీపీని తగ్గిస్తాయట.ఆస్తమా ఉన్నవారు ఆవాలను నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు.

విటమిన్ ఎ, సి, కె
ఆవాలలో విటమిన్ ఎ, సి, కెలు సమృద్ధిగా లభిస్తాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్లలా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఫంగస్, ఇతర చర్మ ఇన్‌ఫెక్షన్లు ఉన్నవారు ఆవాలను తినడం ద్వారా ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చని వివరిస్తున్నారు. ఆవాలు నెల నూనె కూడా శరీరానికి మంచిదట. ఇందులో ఉండే
ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి.

చెడు కొలెస్ట్రాల్
చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి ఆవాల నూనె బాగా ఉపయోగపడుతుందట. రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. అలానే స్వెల్లింగ్ సమస్యలను తగ్గిస్తుంది. దగ్గు, జలుబు, అలర్జీ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందట. ఆవాల నూనె యాంటీ బయోటిక్ గా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications