పిల్లల్లో ఊబకాయానికి ముఖ్యకారణం అదే.. ఊబకాయ చిన్నారుల్లో అనారోగ్య సమస్యలు; బీ అలెర్ట్!!

ఊబకాయం నిస్సందేహంగా ప్రస్తుత అతిపెద్ద వైద్య సమస్యలలో ఒకటి. అధిక బరువు సమస్య ఇప్పుడు ఎక్కువ మంది పిల్లలు మరియు యుక్తవయస్కులను ప్రభావితం చేస్తుంది. దాదాపు 14.4 మిలియన్ల స్థూలకాయ పిల్లలతో భారతదేశం ప్రపంచంలోనే 2వ దేశంగా ఉంది. భారతదేశంలో అధిక బరువు సమస్య ముఖ్యంగా చిన్నారుల్లో ఆహారపు అలవాట్ల వల్లే వస్తుందని చెప్తున్నారు వైద్యులు. ఈ పెరుగుదల వెనుక ఉన్న కారణం కేలరీల అసమతుల్యత. చాలా మంది పిల్లలు వినియోగించే శక్తి మరియు ఖర్చు చేసిన శక్తి యొక్క సమతౌల్యాన్ని కొనసాగించడంలో విఫలమవుతున్నట్టు గుర్తించారు.

 గతంతో పోలిస్తే 10రెట్లు ఎక్కువగా పెరిగిన ఊబకాయం సమస్య

గతంతో పోలిస్తే 10రెట్లు ఎక్కువగా పెరిగిన ఊబకాయం సమస్య


తాజా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం, పిల్లలలో ఊబకాయం రేటు గత సంవత్సరాలతో పోలిస్తే ఇప్పుడు 10రెట్లు ఎక్కువ అని అంచనా వేయబడింది. 2030 నాటికి ప్రతి 10 మంది భారతీయ పిల్లలలో ఒకరు ఊబకాయం బారిన పడతారని అంచనా. ఐరోపాలో పాఠశాల వయస్సు పిల్లలు ప్రతి ఐదుగురిలో ఒకరు అధిక శరీర బరువుతో బాధపడుతున్నాడు. బాల్య, కౌమార దశలో అధిక బరువు మరియు ఊబకాయం యొక్క ప్రాబల్యం సుమారు 14% ఉన్నట్టు ప్రస్తుతం లెక్కలు చెప్తున్నాయి.

 పిల్లల ఆహారపు అలవాట్ల వల్లే ఊబకాయం

పిల్లల ఆహారపు అలవాట్ల వల్లే ఊబకాయం


నేటి జీవనశైలి పిల్లలలో ఊబకాయం అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. పిల్లలు బయట ఆటలకు దూరంగా ఉండటం, శారీరక శ్రమ లేకపోవడం, జీవనశైలి మరియు శక్తి అధికంగా ఉండే ఆహారం తీసుకోవటం శరీరంలో అధిక కొవ్వు పేరుకుపోవడానికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. సరికాని ఆహారపు ప్రవర్తన కారణంగా పిల్లలు ఊబకాయలుగా మారుతున్నారు. అధిక శరీర బరువు కొందరిలో జన్యుపరమైన కారకాలు, ఎండోక్రైన్ రుగ్మతలు లేదా కొన్ని ఔషధాల పర్యవసానంగా ఉండవచ్చు. కానీ చాలా మందిలో ఆహారపు అలవాట్ల వల్ల కూడా వస్తున్నట్టు గుర్తించారు.

 చెడు ఆహారపు అలవాట్ల వల్లే ఊబకాయం

చెడు ఆహారపు అలవాట్ల వల్లే ఊబకాయం


టీవీ స్క్రీన్ ముందు కూర్చుని టీవీ చూస్తూ భోజనం చేయడం, బ్రేక్‌ఫాస్ట్‌లు మానేయడం, చక్కెర-తీపి పానీయాలు తాగడం, తరచుగా బయట తినడం మరియు పిజ్జాలు, బర్గర్ ల వంటి జంక్ ఫుడ్ లు, క్యాలరీలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవటం వల్ల ఊబకాయం వస్తుంది. ఆహారపు అలవాట్లు సాధారణంగా బాల్యంలోనే ఏర్పడతాయి. తల్లిదండ్రులు వారి ఆహార అలవాట్ల అభివృద్ధిలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. అందుకే చిన్నతనం నుండి వారి ఆహారపు అలవాట్లను తల్లిదండ్రులు జాగ్రత్తగా గమనించాలి. మంచి ఆహారం తీసుకోవటాన్ని మాత్రమే ప్రోత్సహించాలి.

ఊబకాయంతో బాధపడే చిన్నారుల్లో ఆరోగ్య సమస్యలు

ఊబకాయంతో బాధపడే చిన్నారుల్లో ఆరోగ్య సమస్యలు


ఇక ఊబకాయంతో బాధపడే చిన్నారులు అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. పిల్లలలో ఊబకాయం పిల్లల శారీరక, మానసిక మరియు సామాజిక శ్రేయస్సును ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. పిల్లలు అనేక అనారోగ్యాల బారిన పడతారు. ఊబకాయంతో బాధపడే చిన్నారులకు టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాదు హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్ సమస్య వచ్చే ప్రమాదం ఉంది. శ్వాసకోశ రుగ్మతలతో, ఆస్తమా వంటి సమస్యలు అధిక బరువు ఉండటం వల్ల వస్తుందని వైద్యులు చెబుతున్నారు.

 అధికబరువు వల్ల ఫ్యాటీ లివర్.. పిల్లలపట్ల జాగ్రత్త .. పేరెంట్స్ కు వైద్యుల సలహా

అధికబరువు వల్ల ఫ్యాటీ లివర్.. పిల్లలపట్ల జాగ్రత్త .. పేరెంట్స్ కు వైద్యుల సలహా

ఇక అధిక బరువు వల్ల ఎముకల సమస్యలు కూడా వచ్చే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. ఫ్యాటీ లివర్ సమస్యను చిన్న వయసులోనే ఎదుర్కోవాల్సి వస్తుందని, అనేక మానసిక సమస్యలు కూడా వారిని వేధిస్తాయి అని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి చిన్నారులలో ఊబకాయం సమస్యకు ప్రధాన కారణమైన ఆహారపు అలవాట్లను తల్లిదండ్రులు మొదటి నుంచి నియంత్రించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. మంచి ఆహారపు అలవాట్లు నేర్చుకుంటే, పౌష్టికాహారం తీసుకుంటే, చిన్నారుల్లో ఎదుగుదల చక్కగా ఉంటుందని, ఊబకాయం సమస్య తగ్గుతుంది అని వైద్యులు సలహా ఇస్తున్నారు. రోజురోజుకు పెరుగుతున్న చిన్నారుల ఊబకాయ సమస్యను మొదటి దశలోనే గుర్తించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+