వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోటి దీపోత్సవంలో పవన్ కళ్యాణ్ (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మనిషి జీవనానికి ఆధారం దీపం. మనిషిలో వెలిగే దీపం ఒకటైతే.. మనిషికి వెలుగునిచ్చే దీపం మరొకటి. బయట వెలిగే దీపం గురువైతే, లోపల వెలిగే దీపం భగవంతుడు. అందుకే దీప జ్యోతిని భగవంతుని స్వరూపంగా చెబుతారు. అలాంటి దీపాలు ఒకటి రెండూ కాదు.. ఏకంగా కోటి దీపాలు వెలిగించి, ప్రపంచ వ్యాప్తంగా సనాతన ధర్మజ్యోతుల వ్యాప్తి చేయాలనే లక్ష్యంతో ప్రారంభించిన కోటి దీపోత్సవం యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. తెలుగు రాష్ట్రల్లోనే కాక, దేశ వ్యాప్తంగా కోటి దీపోత్సవం ఓ ఆధ్యాత్మక ప్రభంజనమే సృష్టించింది.

భక్తి టీవి కోటి దీపోత్సవం ఏడో రోజు కార్యక్రమానికి ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురూజీ శ్రీశ్రీశ్రీ రవిశంకర్ విచ్చేసి తమ అనుగ్రహ భాషణాన్ని అందజేశారు. ఇక ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరు కాగా, చాగంటి వారు తమ ప్రవచన ధారలతో దీపోత్సవ ప్రాంగణంలో ఆధ్మాత్మిక జల్లులు కురిపించారు.

వేదఘోషతో ప్రారంభమైన కార్యక్రమం చాంగటి వారి ప్రవచన ధారలతో ముందుకు సాగింది. దీపం ప్రాధ్యాన్యతను, దీపారాధనలోని విధానాలను కోటి దీపోత్సవం విశిష్టతను, కార్తిక దీపారాధన అవసరాన్ని తెలియజేశారు. మహా ప్రాంగణంలో శివలింగానికి ప్రదోషకాల మహా రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం సుమంగళి పూజ నిర్వహించి, ఆది దంపతులకు కోటిదీపోత్సవ ప్రాంగణంలో గజవాహన సేవను నిర్వహించారు.

 కోటి దీపోత్సవంలో పవన్ కళ్యాణ్

కోటి దీపోత్సవంలో పవన్ కళ్యాణ్

భక్తి టీవి కోటి దీపోత్సవం ఏడో రోజు కార్యక్రమానికి ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురూజీ శ్రీశ్రీశ్రీ రవిశంకర్, పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేస్తున్న దృశ్యం.

కోటి దీపోత్సవంలో పవన్ కళ్యాణ్

కోటి దీపోత్సవంలో పవన్ కళ్యాణ్

భక్తి టీవి కోటి దీపోత్సవం ఏడో రోజు కార్యక్రమానికి ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురూజీ శ్రీశ్రీశ్రీ రవిశంకర్, పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేస్తున్న దృశ్యం.
 కోటి దీపోత్సవంలో పవన్ కళ్యాణ్

కోటి దీపోత్సవంలో పవన్ కళ్యాణ్


రవిశంకర్ గురూజీ, పవన్ కళ్యాణ్, రచన గ్రూప్ నరేంద్రజౌదరి చేతుల మీదగా దీప ప్రజ్వలనతో కోటి దీపోత్సవం కార్యక్రమం ప్రారంభమైంది. చుట్టూ అనంత దీపాల వెలుగుల్లో పరమశివుడు ప్రకాశించాడు.

కోటి దీపోత్సవంలో పవన్ కళ్యాణ్

కోటి దీపోత్సవంలో పవన్ కళ్యాణ్


పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఇంక గొప్ప కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేసిన నరేంద్ర చౌదరి గారికి అభినందలను తెలియజేశారు.

కోటి దీపోత్సవ ప్రాంగణం పంచాక్షరి మంత్రంతో ప్రతిధ్వనించింది. కైలాస నాధుడు కోటి దీపోత్సవానికి విచ్చేసిన భక్తులను కరుణించేందుకు కుమారుడు గణనాధునితో కలిసి విచ్చేసిన అనుభూతిని భక్తులు పొందారు. అనంతరం రవిశంకర్ గురూజీ, పవన్ కళ్యాణ్, రచన గ్రూప్ నరేంద్రజౌదరి చేతుల మీదగా దీప ప్రజ్వలనతో కోటి దీపోత్సవం కార్యక్రమం ప్రారంభమైంది. చుట్టూ అనంత దీపాల వెలుగుల్లో పరమశివుడు ప్రకాశించాడు.

రవిశంకర్ గురూజీ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు భక్తి టీవి వారిని అభినందించాలి. ఇలాంటి నిజమైన సంబరాలు. ఈ కార్యక్రమంలో మీ అందరినీ కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. దీపోత్సవం అనే సాంప్రదాయం ప్రాచీన కాలం నుంచి ఉంది. మనల్ని మనం గౌరవించుకోవాడనికి, సమాజంలో ప్రేమ భావం నెలకొనడానికి, అందరితో వ్యక్తిగత సంబంధాలు పాటించేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపకరిస్తుంది. దీపానికి, జీవితానికి మధ్య మంచి సంబంధం ఉంది. ఆత్మజ్యోతి వెలుగుల్లోనే జీవితం తీర్చిదిద్దబడుతుంది. నరేంద్ర చౌదరిగారు ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని కోరుతున్నానని అన్నారు.

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఇంక గొప్ప కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేసిన నరేంద్ర చౌదరి గారికి అభినందలను తెలియజేశారు.

English summary
Pawan Kalyan Speech At 7th Day Bhakthi TV Koti Deepothsavam. 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X