• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మా చేతిలో కత్తులు కూడా ఉన్నాయి జాగ్రత్త: జైట్లీ

By Nageswara Rao
|

న్యూఢిల్లీ: కాశ్మీర్ వద్ద అంతర్జాతీయ సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే, భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని పాకిస్ధాన్‌కు భారత్ గట్టిగా హెచ్చరించింది. ఓ ప్రముఖ టీవి ఛానల్‌కు మంగళవారం ఇచ్చిన ఇంటర్యూలో "మా చేతుల్లో డాలు మాత్రమే కాదు, కత్తులు కూడా ఉన్నాయి జాగ్రత్త" అని రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీ హెచ్చరించారు.

సాహసాలు చేయాలనుకుంటే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. ఇప్పటిదాకా పాక్ దాడి చేసిన ప్రతిసారీ రక్షణాత్మక ధోరణితో వ్యవహరించామని... ఇకపై ఎదురు దాడి చేస్తామని హెచ్చరించారు.

ఈ ఒక్క నెలలోనే 20 మంది భారత పౌరులు సరిహద్దు కాల్పుల్లో మరణించారని అన్నారు. చాలా మంది గాయపడ్డారు. ఇలాంటి పరిస్ధితి మునుపెన్నడూ లేదు. దాంతో సరహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్ధితి నెలకొంది.

 Sword, Not Just Shield, in India's Hand, Defence Minister Arun Jaitly Warns Pakistan

సరిహద్దులో శాంతి నెలకొనేందుకు ఏం చేసినా తనకు అభ్యంతరం లేదని ఇప్పటికే భారత సైన్యానికి ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం అరుణ్ జైట్లీ టీవి ఛానల్‌కు ఇచ్చిన భారత సరిహద్దుల్లో పాక్‌ బలగాలు మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడింది.

కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ, తాజాగా, జమ్మూకాశ్మీర్ లోని రాంగఢ్ ప్రాంతంలో బీఎస్ఎఫ్ పోస్టులపై పాక్ రేంజర్లు కాల్పులు జరిపారు. బుధవారం ఉదయం జరిగిన ఆ దాడుల్లో పాక్ సైనికులు తేలికపాటి ఆటోమేటిక్ ఆయుధాలు వినియోగించారని ఓ పోలీసు అధికారి తెలిపారు.

పాక్ కాల్పులను బీఎస్ఎఫ్ జవాన్లు సమర్థంగా తిప్పికొట్టారు. దీంతో, అక్కడ కాల్పులు ఆగిపోయాయి. అనంతరం, పాక్ సైనికులు ఆర్ఎస్ పురాలో కాల్పులకు దిగారు. ప్రస్తుతం అక్కడ కాల్పులు జరుగుతున్నాయని ఆ పోలీసు అధికారి చెప్పారు.

నల్లధన కుబేరుల పేర్లు బయటపడితే కాంగ్రెస్‌కే చిక్కులు

నల్లధనం విషయంలో ఎన్డీఏ ప్రభుత్వం వెనకడుగు వేస్తోందంటూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తిప్పి కొడుతూ, విదేశీ బ్యాంకుల్లో అక్రమ ఖాతాలు కలిగి ఉన్న వారి పేర్లను బయటపెడితే కాంగ్రెస్ పార్టీయే చిక్కుల్లో పడుతుందన్నారు.

‘నల్లధనం ఖాతాలు కలిగిన వారి పేర్లు త్వరలోనే బహిర్గతమవుతాయి.. ఈ పేర్లను బయటపెట్టినప్పుడు బిజెపికి ఎలాంటి ఇబ్మంది ఉండదని నేను మీకు హామీ ఇస్తున్నాను. ఈ పేర్ల కారణంగా కాంగ్రెస్ పార్టీకే కొంత ఇబ్బంది కలుగుతుంది' అని జైట్లీ చెప్పారు.

English summary
India warned Pakistan on Tuesday of "pain" if it continues to violate the ceasefire along the Kashmir border. Defence Minister Arun Jaitley told tv channel it's up to Islamabad to create the conditions for a resumption of talks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more