ఎంత సంపాదించిన చేతిలో చిల్లిగవ్వ ఉండట్లేదా- ఈ చిట్కాలు పాటించి చూడండి

డబ్బు ఆదా చేయాలనే కోరిక ఈ రోజుల్లో చాలామందికి ఉన్నప్పటికీ, ఎంత ప్రయత్నించినా అది సాధ్యం కాకపోవచ్చు. మనం ఎంత కష్టపడినా కొన్నిసార్లు డబ్బు నిలవదు. దీనికి వాస్తు దోషాలు ఒక ప్రధాన కారణం కావచ్చు. వాస్తుశాస్త్రం ప్రకారం మనకు తెలియకుండా చేసే కొన్ని పొరపాట్ల వల్ల ఇటువంటి పరిస్థితి తలెత్తవచ్చు. వాటిని సరిదిద్దుకుంటే మంచి ఫలితాలు వస్తాయని.

దీనికి సంబంధించిన వాస్తు చిట్కాలు డబ్బు ఆదా చేయడంలో సహాయపడటమే కాకుండా, ఇంట్లో సంపదను, శాంతిని, సానుకూల శక్తిని కూడా పెంచుతాయి. ఈ చర్యల ద్వారా ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది.

ఎంగిలి ప్లేట్లను వదిలివేయవద్దు: భోజనం చేసిన తర్వాత ఎంగిలి పాత్రలను ఎక్కువసేపు వదిలివేయకూడదు. రాత్రంతా సింక్‌లో లేదా వంటగదిలో ఎంగిలి పాత్రలు ఉంచడం వాస్తు దోషాన్ని కలిగిస్తుంది. ఇది ప్రతికూల శక్తిని పెంచుతుంది. తద్వారా ఆర్థిక నష్టాలకు దారితీస్తుంది. రాత్రి నిద్రపోయే ముందు అన్ని పాత్రలను శుభ్రం చేసి, వంటగదిని కూడా చక్కగా శుభ్రం చేయడానికి ప్రయత్నించండి. దీనివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.

ఇంటి పరిశుభ్రత: ఇంట్లో దుమ్ము, ధూళి అధికంగా ఉండటం, వస్తువులను ఓ పొందికగా కాకుండా చిందరవందరగా ఉంచడం కూడా ఓ వాస్తు దోషమే. ఇది ఆకస్మిక ధననష్టానికి దారి తీయవచ్చు. అపరిశుభ్రంగా ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నివసించదు. కాబట్టి- ఇంటిని శుభ్రంగా ఉంచడం ముఖ్యం. ఇంటి ఈశాన్య దిశలో చెత్తను ఎప్పుడూ ఉంచకూడదు. ఈ దిశను దైవ స్థానంగా పరిగణిస్తారు. ఈశాన్య దిశ ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండాలి.

దక్షిణావర్తి శంఖం: ఇంట్లో ఉండే పూజగదిలో దక్షిణావర్తి శంఖాన్ని ఊదడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం దక్షిణావర్తి శంఖం.. ధనాన్ని ఆకర్షించేదిగా పరిగణిస్తారు. ఇది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైనదిగా భావిస్తారు. దీనిని పూజా గదిలో ఉంచి, ప్రతిరోజూ శుభ్రమైన వస్త్రంతో తుడవాలి. ఈ అలవాటు కూడా ఇంట్లో సంపదను పెంచడానికి కారణమౌతుంది.

పూజామందిరంలో ఎండుపూలు వద్దు: పూజామందిరంలో వాడిపోయిన లేదా ఎండుపూలను ఉంచడం అశుభం. ప్రతి ఉదయం పాత పూలను తొలగించి, కొత్త పూలను దేవతలకు సమర్పించాలి. దీనివల్ల పూజా స్థలం పవిత్రంగా ఉంటుంది. లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. ఈ పద్ధతి సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది.

ఇంటి లోపల ముళ్ళ మొక్కలు: వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటి లోపల ముళ్ళ మొక్కలు (కాక్టస్ వంటివి) ఉంచకూడదు. ఇలాంటి మొక్కలు గొడవలు, ఒత్తిడి, పేదరికానికి కారణమవుతాయి. ముళ్ళ మొక్కలను ఇంటి బయట ఉంచాలి. ఇంటి లోపల తులసి, మనీ ప్లాంట్ లేదా మొగలి వంటి శుభప్రదమైన మొక్కలను పెంచాలి. తులసి మొక్క వద్ద ప్రతిరోజూ దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి సంతోషించి, ఇంట్లో ధనం వృద్ధి చెందుతుంది.

చీపురు: చీపురును బయట వదిలివేయకూడదు. రాత్రిపూట చీపురుతో ఇల్లు ఊడవకూడదు. విరిగిన లేదా పాత చీపురును వెంటనే మార్చాలి. ఉదయం పూట చీపురుతో ఇల్లు శుభ్రం చేసిన తర్వాత ధూపం వేయడం శుభప్రదం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+