Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు

వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటి ప్రధాన ద్వారం (మెయిన్ డోర్) ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. ఇది ఇంటిలోకి పాజిటివ్, నెగటివ్ ఎనర్జీ ప్రవేశించే కీలకమైన మార్గం కావడం వల్ల గుమ్మం విషయంలో వాస్తు ప్రకారం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడ ఆనవాయితీగా వస్తోంది. ప్రధాన ద్వారానికి సంబంధించిన నియమాలను సరిగ్గా పాటిస్తే, ఇంట్లో సుఖశాంతులు, సంతోషం వెల్లివిరుస్తాయి. శ్రేయస్సు సిద్ధిస్తుంది. కుటుంబ సభ్యులు జీవితంలో పురోగతిని సాధిస్తారు.

తెలియకుండా చేసే కొన్ని పొరపాట్లు వాస్తు నియమాలకు విరుద్ధంగా మారతాయి. ప్రతికూల వాతావరణానికి కారణమౌతాయి. ఈ తప్పుల కారణంగా ఇంట్లో వాస్తు దోషాలు ఏర్పడి, అనేక ఇబ్బందులను, సమస్యలను, నిరంతర ఒత్తిడిని తలెత్తుతాయి. ఇంట్లో ప్రతికూల ప్రభావాలు ప్రబలకుండా ఉండాలంటే ప్రధాన ద్వారం విషయంలో వాస్తు నియమాలను పాటించాలి. వాస్తు దోషాలు కలగకుండా ఎలాంటి పొరపాట్లు చేయకూడదో ఇప్పుడు పరిశీలిద్దాం.

Welcome Prosperity Essential Vastu Tips to Enhance Entrance Energy Align Main Door for a Positive

1. ప్రధాన ద్వారం శుభ్రంగా, చెక్కుచెదరకుండా ఉండాలి: వాస్తు ప్రకారం, ఇంటి ప్రధాన ద్వారం ఎల్లప్పుడూ శుభ్రంగా, చెక్కు చెదరకుండా ఉండాలి. తలుపు విరిగిపోయినా, పగుళ్లు ఉన్నా వెంటనే మరమ్మత్తు చేయించాలి. తెరిచేటప్పుడు లేదా మూసేటప్పుడు శబ్దం రాకూడదు, ఇది అశుభకరం. ద్వారం దగ్గర దుమ్ము, చెత్త పేరుకుపోకుండా చూసుకోవాలి, లేకపోతే ఇది ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది. ద్వారాన్ని సమయానుసారం శుభ్రం చేస్తూ ఉండాలి.

2. ప్రధాన ద్వారం వద్ద వ్యర్థాలు, చెప్పులు వద్దు: ప్రధాన ద్వారం వద్ద చెత్తకుండీలు, చెప్పులు లేదా అనవసరమైన వస్తువులను ఉంచకూడదు. ఇది వాస్తు దోషంగా పరిగణిస్తారు. ఇవి సానుకూల శక్తి ప్రవాహానికి అడ్డంకులు సృష్టిస్తాయి. ఇంటికి అశుభాలను కలిగిస్తాయి. శుభ శక్తులు ఇంట్లోకి ప్రవేశించకుండా నిరోధిస్తాయి. ముఖ ద్వారం రూపాన్ని కూడా దెబ్బతీస్తుంది.

స్థలం కొరత ఉన్నప్పటికీ, చెప్పుల స్టాండ్‌ను ప్రక్కన ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. చెత్తకుండీని ప్రధాన ద్వారానికి దూరంగా, కనిపించకుండా ఉంచడం శ్రేయస్కరం. ఇలా చేయడం వల్ల ద్వారం చుట్టూ విశాలమైన, శుభ్రమైన వాతావరణం ఏర్పడుతుంది. గాలి ధారాళంగా ఇంటిలోనికి ప్రవేశిస్తుంది. ఇలాంటి జాగ్రత్తలు ఇంటికి సానుకూలతను తీసుకొస్తాయి.

ప్రధాన ద్వారం వద్ద చీకటి ఉండకూడదు: ప్రధాన ద్వారం చుట్టూ ఎప్పుడూ చీకటి ఆవరించకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇక్కడ తగినంత కాంతి, ప్రకాశవంతమైన దీపాలు ఉండటం శ్రేయస్కరం. చీకటి ఉన్న ఇళ్లలో ప్రతికూల శక్తి ప్రబలుతుంది, వాతావరణం సానుకూలంగా ఉండదు. పగటిపూట సహజ కాంతి ప్రసరించేలా చూసుకోవాలి. సాధ్యం కాకపోతే, సాయంత్రం పూట దీపాలు వెలిగించాలి. ఇది ఇంటికి పాజిటివ్ ఎనర్జీని పెంపొందిస్తుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+