వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జింబాబ్వే క్రికెట్ మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్‌పై నిషేధం.. ఎందుకో తెలుసా..?

|
Google Oneindia TeluguNews

దుబాయ్‌: జింబాబ్వే మాజీ కెప్టెన్‌, కోచ్‌ హీత్‌ స్ట్రీక్‌పై అన్ని ఫార్మాట్ల క్రికెట్‌లో ఎనిమిదేళ్ల నిషేధం విధిస్తున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) బుధవారం ప్రకటించింది. ఐసీసీ అవినీతి నిరోధక కోడ్‌ను హీత్‌ ఐదుసార్లు ఉ‌ల్లంఘించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ వెల్లడించింది. మొద‌ట్లో ఈ ఆరోప‌ణ‌ల‌ను ఖండించిన స్ట్రీక్‌.. తాజాగా వాటిని అంగీక‌రించాడు. జింబాబ్వే తరపున హీత్ స్ట్రీక్‌ 189 వన్డేల్లో 239 వికెట్లు, 65 టెస్టుల్లో 216 వికెట్లు తీసి అత్యంత విజయవంతమైన బౌలర్‌గా నిలిచాడు.

హీత్‌ స్ట్రీక్‌ 2016 నుంచి 2018 వరకు జింబాంబ్వేకు, ఇతర దేశవాళీ లీగ్‌లలో జట్లకు కోచ్‌గా పనిచేశాడు. ఆ సమయంలో జరిగిన మ్యాచు‌ల్లోని అంతర్గత సమాచారం బుకీలకు చేరవేయడం, ఆటగాళ్లకు బుకీలను పరిచయం చేశాడనే పలు ఆరోపణలు అతని‌పై ఉన్నాయి. ఇందులో కొన్ని అంత‌ర్జాతీయ మ్యాచ్‌లు కూడా ఉండ‌గా.. ఐపీఎల్‌, బీపీఎల్‌, ఆఫ్ఘ‌నిస్థాన్ ప్రిమియ‌ర్ లీగ్‌ల‌లోని మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్‌ల ఫ‌లితాల‌పై అవి ఎలాంటి ప్ర‌భావం చూప‌లేద‌ని ఐసీసీ అవినీతి నిరోధ‌క శాఖ స్ప‌ష్టం చేసింది.

Former Zimbabwe captain Heath Streak in trouble, banned for 8 Years for corruption by ICC

ఐసీసీ విచారణకు ఆటంకం కలిగించేలా వ్యవహరించాడనే ఆరోపణలు సైతం 47 ఏళ్ల హీత్‌ స్ట్రీక్‌పై వచ్చాయి. ఐసీసీ తీసుకున్న నిర్ణయాన్ని అతడు‌ అంగీకరించాడు. చేసిన తప్పునకు పశ్చాత్తాప పడుతున్నట్లు తెలియజేశాడు. స్ట్రీక్‌పై విధించిన నిషేధం 28 మార్చి 2029న తొలగిపోనుంది. ఓ మాజీ కెప్టెన్‌, కోచ్‌గా ఎన్నో అవినీతి నిరోధ‌క కౌన్సిలింగ్ సెష‌న్ల‌కు హాజ‌రైన స్ట్రీక్ ఇలా చేయ‌డం బాధాక‌ర‌మ‌ని ఐసీసీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ అలెక్స్ మార్ష‌ల్ పేర్కొన్నారు.

KKR vs MI: 99 మీటర్ల భారీ సిక్స్.. నోరెళ్లబెట్టేసిన హార్దిక్ పాండ్యా!! (వీడియో)

English summary
Former Zimbabwe captain Heath Streak banned for 8 Years for corruption.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X