ఓ వైపు దిశచట్టానికి అమోదం... మరోవైపు గుంటూరులో చిన్నారిపై అత్యాచారం..!

మహిళలు చిన్న పిల్లలపై జరగుతున్న అత్యాచారాలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నా...మరోవైపు మాత్రం అవేమి పట్టించుకోని కొంతమంది మృగాళ్లు తమపని తాము చేసుకుపోతున్నారు. ప్రభుత్వాలు , ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నా... మహిళలు చిన్నపిల్లలపై అత్యాచారాలకు ఒడిగడుతున్నారు. విచిత్రం ఏమిటంటే ఏపీలో మహిళలలపై అత్యాచారాలు చేసిన వారిపై కఠినంగా చర్చించేందుకు దిశ చట్టానికి సవణలు తెచ్చి అసెంబ్లీలో పెట్టి ఆమోదించిన రోజే... గుంటూరు జిల్లాలో మరో చిన్నారీపై ఓ యువకుడు అత్యాచారానికి ఒడిగట్టాడు.

గుంటూరు జిల్లాలోని లక్ష్మారెడ్డి అనే ఇంటర్‌చదువుకున్న ఓ యువకుడు తన ఇంట్లో అద్దెకు ఉంటున్న ఓ చిన్నారీపై లైంగిక చర్యలకు పాల్పడ్డాడు. అనంతరం ఈ విషయాన్ని ఇంట్లోవారికి కూడ చెప్పవద్దని హెచ్చరించాడు. అయితే తరచు చురుకుగా ఉండే చిన్నారీ అనారోగ్యంగా కనిపించడంతో ఆమె కుటుంబసభ్యులు ఆరా తీశారు. దీంతో ఈ విషయం ఎవరికి చెప్పవద్దని అన్నయ్య చెప్పాడని.. అదే సమాధానాన్ని తల్లిదండ్రులకు వివరించింది. అనంతరం జరిగిన విషయాన్ని చెప్పింది.

Intermediate student raped a girl

దీంతో నగరంపాలెం పోలీస్ స్టేషన్‌లో పాప తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. అనంతరం కేసు నమోదు చేసి నిందితుడు లక్ష్మణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇక బాలికను వైద్య పరీక్షల కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. నిందితుడిపై ఫోక్సో చట్టంతో పాటు ఎస్సీ,ఎస్టీ అట్రాసీటి కేసు నమోదు చేశామని నగరపాలెం సీఐ వెంకటరెడ్డి తెలిపారు. అయితే అదృష్టవశాత్తు పాపకు ఏమీ కాలేదని , ఏదైనా జరిగి ఉంటే ఎవరు భాద్యత వహిస్తారని పాప తల్లిదండ్రులు ప్రశ్నించారు. అయినా... అఘాయిత్యానికి పాల్పడిన యువకుడి తల్లిమాత్రం తమకు ఏమీ కాదని అంటుందని చిన్నారీ తల్లిదండ్రులు వాపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+