గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమానుషం: అప్పు తిరిగివ్వమన్నందుకు మహిళను కాలుతో తన్నిన ఆటో డ్రైవర్

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఇచ్చిన అప్పు తిరిగివ్వమన్నందుకు ఓ ఆటో డ్రైవర్ మహిళ పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. ఆటోలోనే ఉండి ఎగిరి కాలుతో తన్నడంతో మహిళ తీవ్రంగా గాయపడింది. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాడేపల్లి మహానాడులో కొంతకాలం జీవనం సాగించిన మహిళ ప్రస్తుతం విజయవాడ రాణిగారితోటలో నివాసం ఉంటోంది. అయితే, మహానాడులో ఉన్న సమయంలో తాపీ మేస్త్రీగా పనిచేసే చిర్రావుిరిక చెందిన గోపీకృష్ణ అనే వ్యక్తికి రూ. 3 లక్షల నగదును వడ్డీకి ఇప్పించింది.

auto driver kicked a woman for asking her money to return.

అప్పటి నుంచి అప్పు తీర్చమని అడుగుతున్నా.. గోపీకృష్ణ పట్టించుకోకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ క్రమంలో చిర్రావురుకు వెళ్లిన మహిళ.. తీసుకున్న అప్పును తిరిగి చెల్లించాలని గోపీకృష్ణను అడిగింది. అయితే, ఆ మహిళను తన ఆటోలో జన సంచారం లేని కృష్ణకరకట్ట వద్దకు తీసుకెళ్లాడు గోపీకృష్ణ.

అక్కడికి చేరుకున్న తర్వాత బాకీ చెల్లించాలని సదరు మహిళ అడిగింది. అయితే, ఆమెకు సరైన చెప్పకుండా నిర్లక్ష్యంగా మాడాడు. ఆమెతో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో ఆగ్రహారానికి గురైన గోపీకృష్ణ,.. ఆమెను ఎగిరి కాలితో తన్నాడు. దీంతో ఆమె కొంతదూరంలో కుప్పకూలిపోయింది. ఈ వ్యవహారాన్నంత ఆమెతోపాటు వచ్చిన వ్యక్తి సెల్‌ఫోన్లో వీడియో తీశాడు.

వెంటనే 100 నెంబర్‌కు ఫోన్ చేసి పోలీసులకు జరిగిన విషయం చెప్పారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మహిళను చికిత్స నిమిత్తం మంగళగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. చిర్రావూరు, రామచంద్రపురం గ్రామాల మధ్య చోటు చేసుకున్న ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

తల్లి కుమార్తె దారుణ హత్య

ఇది ఇలావుండగా, కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం డి.నేలటూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. తల్లి, కుమార్తెలు అంజనమ్మ, లక్ష్మీదేవిని కొందరు దుండగులు కత్తులతో నరికి చంపారు. పాతకక్షల నేపథ్యంలోనే తల్లి, కుమార్తెను చంపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అంజనమ్మ కోడలు ఛరిష్మ 2019లో హత్యకు గురయ్యారు. కోడలిని హతమార్చింది అంజనమ్మ కుటుంబసభ్యులేనన్న ఆరోఫణలున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె ఇంటి ఎదుటే ఛరిష్మ మతదేహాన్ని పూడ్చిపెట్టి అక్కడే సమాధి నిర్మించారు. దీనిపై అప్పట్లో అంజనమ్మ కుటుంబసభ్యులపై కేసు నమోదైంది. కోర్టులో కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే అంజనమ్మ ఆమె కుమార్తు హత్యకు గురయ్యారు. దాదాపు రెండేళ్ల తర్వాత ఇంటికి చేరుకున్న అంజనమ్మ, ఆమె కుమార్తెను ప్రత్యర్థులు దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైంది. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. ముదిగుబ్బ మండలం మంగళమడక గ్రామంలో విద్యుత్ హైవోల్టేజ్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. ఒక్కసారిగా గ్రామంలో హైవోల్టేజ్ సరఫరా అయ్యింది. దీంతో గ్రామంలో చాలా ఇళ్లల్లో విద్యుత్ పరికరాలు టీవీ, ఫ్రిడ్జ్, మోటార్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. పెద్దపెద్ద శబ్దాలతో ఎలక్ట్రానిక్ పరికరాలు కాలిపోయాయి.

ఇదే క్రమంలో గ్రామానికి చెందిన ఓ మహిళ విద్యుత్ లైట్ స్విచ్చాన్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మరణించింది. అనంతరం స్పందించిన అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో ఊరు మొత్తం అంధకారంగా మారిపోయింది. హఠాత్తు పరిణామంలో గ్రామంలో ఏం జరుగుతుందో అర్థం కాక గ్రామస్తులు భయబ్రాంతులకు గురయ్యారు. లక్షలాది రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని, తమను ప్రభుత్వమే ఆదుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళ మృతితో ఆమె కుటుంబంతోపాటు స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

English summary
auto driver kicked a woman for asking her money to return.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X