మరోసారి బటన్ నొక్కనున్న సీఎం వైఎస్ జగన్-
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 27వ తేదీన గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటించనున్నారు. రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు.
గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. రైతు భరోసా కింద నిధులను విడుదల చేయనున్నారు. బటన్ నొక్కి- ఇన్ పుట్ సబ్సిడీ మొత్తాన్ని రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు. దీనికోసం ఈ నెల 27వ తేదీన జిల్లాలోని తెనాలికి వెళ్లనున్నారాయన. ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
తెనాలిలోని జూనియర్ కళాశాల మైదానంలో హెలిప్యాడ్ ను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అక్కడి నుంచి సభా ప్రాంగణానికి జగన్ రోడ్డు మార్గంలో చేరుకుంటారు. ముఖ్యమంత్రి ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, స్థానిక వైసీపీ శాసనసభ్యుడు అన్నాబత్తుని శివకుమార్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, గుంటూరు రూరల్ పోలీస్ సూపరింటెండెంట్ ఆరిఫ్ హఫీజ్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణం, జూనియర్ కళాశాల మైదానాన్ని పరిశీలించారు.

రైతులను ఇన్ పుట్ సబ్సిడీ మొత్తాన్ని విడుదల చేయడానికి జగన్ ప్రభుత్వం వైఎస్సార్ రైతు భరోసా- ప్రధాని మంత్రి కిసాన్ పథకాన్ని అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద మొత్తం 58 లక్షల మందికి పైగా రైతులను అర్హులుగా గుర్తించింది. ఈ పథకం కింద ఇప్పటివరకు మూడు విడతల్లో 19,812.79 కోట్ల రూపాయల మేర పెట్టుబడి సాయాన్ని అందించింది ప్రభుత్వం. ఒక్కో రైతుకు 13,500 రూపాయలు చొప్పున అందుతుంది.
మూడు విడతల్లో 6,899.67 కోట్ల రూపాయల మొత్తాన్ని ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయంగా అందించింది. ఇందులో రైతు భరోసా కింద 3,907.06 కోట్లను ప్రభుత్వం జమచేయగా, పీఎం కిసాన్ వాటా 2,992.61 కోట్ల రూపాయలు. నాలుగో విడత లబ్దిదారుల వివరాలను రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉంచారు.
-
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు!












Click it and Unblock the Notifications