పెనుభూతమైన అనుమానం.. కట్టుకున్న భార్యనే కడతేర్చాడు
గుంటూరు : అనుమానమే పెనుభూతమైంది. మూడు ముళ్లు వేసి.. ఏడడుగులు నడిచిన తన భార్యనే అనుమానించాడు. అనుమానంతో రగిలిపోయి తన సతీని కడతెర్చాడు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో తన భార్యనే మట్టుబెట్టాడు.

గుంటూరు శివరామనగర్‌లో దాసరి ఏసుబాబు ఉంటున్నాడు. అతనికి 13 ఏళ్ల క్రింతం జ్యోతితో పెళ్లైంది. వివాహం అయ్యాక కొద్దిరోజులు బాగానే ఉన్నాడు. తర్వాత అనుమాన భూతం మొదలైంది. దీంతో భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. తన భార్య మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని రగలిపోయాడు. ఈ అంశంపై భార్యభర్తల మధ్య చాలా సార్లు గొడవ కూడా జరిగింది. కానీ అతని మనసు తృప్తి చెందలేదు. ఈ క్రమంలోనే తన భార్యను కడతేర్చాలని అనుకొన్నాడు ఏసుబాబు. సమయం కోసం చూశాడు. నిన్న అర్ధరాత్రి తన భార్య నిద్రిస్తోండగా ఘాతుకానికి తెగబడ్డాడు. నిద్రిస్తోన్న జ్యోతిని కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడి చేశాడు. మెడపై బలంగా నరకడంతో ఘటనాస్థలంలోనే జ్యోతి మృతిచెందింది. హత్య చేశాక నగరపాలెం పోలీసు స్టేషన్‌లో ఏసుబాబు లొంగిపోయాడు.












Click it and Unblock the Notifications