ఆ పార్టీలను బంగాళాఖాతంలో వేస్తారు.. కొడాలి నాని సెన్సేషనల్ కామెంట్స్
విపక్షాలను మాజీ మంత్రి కొడాలి నాని ఏకీపారేశారు. బీజేపీ, టీడీపీ, జనసేనలను ప్రజలు విశ్వసించరని చెప్పారు. మంగళవారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజల సమస్యల్ని తెలుసుకుంటామని.. గ్రామాల్లో బూత్ కమిటీలు, అనుబంధ కమీటీలు వేసి పార్టీని సమాయత్తం చేస్తామని అన్నారు. ప్రభుత్వం, పార్టీ కలిసి పనిచేస్తాయని కొడాలి నాని అన్నారు.
ఎంత మంది కలిసి పోటీ చేసినా రాష్ట్రంలో వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టంచేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ను చూసి భయపడేది లేదని.. అసలు వాళ్ళలో వాళ్ళకే ధైర్యం లేదని కామెంట్ చేశారు. పవన్ పదేళ్ళ క్రితమే దత్త పుత్రుడు అయ్యాడని గుర్తుచేశారు. చంద్రబాబు, పవన్ ఎప్పుడు విడిపోయారో చెప్పాలని అన్నారు.

లోకేష్ ఒక చోట ఓడితే పవన్ కళ్యాణ్ రెండు పరాజయం పాలయ్యాడని మండిపడ్డారు. చంద్రబాబు జీవితమే మోసం, కుట్ర అని మండిపడ్డారు. చంద్రబాబును పవన్ రెండు సార్లు నమ్మాడని మూడో సారి విశ్వసించి మునిగిపోతాడని తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ అందరిని మూటగట్టి ప్రజలు బంగాళాఖాతంలో కలిపేస్తారని హాట్ కామెంట్స్ చేశారు. వారు కలిసి పద్నాలుగు గంటల పాటు కలిసి కూడా ఉండలేరని.. 14 నెలలు ఎలా కలిసి ఉంటారని ప్రశ్నించారు.
టీడీపీ, జనసేన కలిస్తే చంద్రబాబు, లోకేష్‌కు అధికారం వస్తుందని... పవన్‌కి డబ్బు వస్తోందన్నారు. ఇటీవల ఏపీలో పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజిపై కూడా మాట్లాడారు. ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించడానికి చంద్రబాబు నారాయణతో కలిసి పేపర్ లీకేజీ కుట్ర పన్నారని ఆరోపించారు. పూర్తి స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించడానికి ప్రయత్నిస్తే నారాయణకి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారురు. తప్పు చేస్తే నారాయణనే కాదు ఎవరిని వదిలి పెట్టమని వార్నింగ్ ఇచ్చారు.












Click it and Unblock the Notifications