న్యూఇయర్ విషాదం: డివైడర్‌ను ఢీకొన్న కారు, నలుగురు బీటెక్ విద్యార్థులు మృతి
గుంటూరు: జిల్లాలోని లాలూపురం హైవే పైన సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వెళ్తున్న ఓ కారు డివైడర్‌ను ఢీకొట్టడం వల్ల నలుగురు బీటెక్ విద్యార్థులు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరు ఆర్వీఆర్ కాలేజీలో బీటెక్ చదువుతున్నారని తెలుస్తోంది.
కారులో మొత్తం ఏడుగురు విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. వారు న్యూఇయర్ వేడుకల కోసం ఉత్సాహంగా, కారులో అతివేగంగా వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. దాదాపు 160 కిలో మీటర్ల వేగంతో ఉన్నారని తెలుస్తోంది. వీరి కారు ముందు వెళ్తున్న ఓ కంటెయినర్ లారీ కూడా ఢీకొట్టింది. అంటే వారు వెళ్తున్న హ్యుండాయ్ కారు వెళ్లి లారీనీ డీకొడితే... ఆ లారీ ముందుకెళ్లి బోల్తా పడింది. వారు అంత వేగంతో వెళ్తున్నారు.

గత పది రోజుల్లో గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం కారణంగా దాదాపు ఇరవై మంది మృతి చెందారు. అతివేగం లేదా చలి-మంచు కారణంగా కావొచ్చు.. ఈ ప్రమాదాలు జరిగాయి. గాయపడ్డ వారికి చికిత్స జరుగుతోంది. కాగా, కారు ఢీకొనగా లారీ బోల్తాపడిన విషయం తెలిసిందే. ఆ లారీ డ్రైవర్‌కు కూడా గాయాలయ్యాయి. వారికి చికిత్స అందిస్తున్నారు.
-
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!!












Click it and Unblock the Notifications