వెలగపూడిలో అర్దరాత్రి మరియమ్మ అంత్యక్రియలు .. ఎంపీ సురేష్ పేరు ఎఫ్ఐఆర్ లో చేరుస్తామని హోం మంత్రి హామీ
రాజధాని గ్రామమైన వెలగపూడిలో ఎస్సీ కాలనీలో రెండు వర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ తో మరియమ్మ అనే మహిళ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘర్షణ కారణంగా రాజధాని గ్రామమైన వెలగపూడిలో ఉద్రిక్త వాతావరణం నిన్న అర్ధరాత్రి వరకు కొనసాగింది. రోజంతా రెండు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనలు, నినాదాలు, బైఠాయింపు లతో రాజధాని గ్రామమైన వెలగపూడి హోరెత్తింది. వెలగపూడి రణరంగాన్ని తలపించింది.

వెలగపూడి ఉద్రిక్తతల నేపధ్యంలో రంగంలోకి దిగిన హోం మంత్రి సుచరిత
పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి నేరుగా హోంమంత్రి రంగంలోకి దిగారు.
ఆదివారం రోజు రాత్రి నుండి చోటు చేసుకున్న వివాదం నిన్న అర్ధరాత్రి వరకు ఉద్రిక్తం గానే ఉంది . మరియమ్మ మృతితో వెలగపూడి గ్రామంలో టెన్షన్ వాతావరణం నెలకొంది .ఈ ఘటనకు ఎంపీ నందిగం సురేష్ ప్రోద్బలం ఉందని, ఆయనపై కేసు నమోదు చేయాలని బాధితులు ఆందోళన చేశారు. మరియమ్మ మృతదేహాన్ని పెట్టుకొని అర్ధరాత్రి వరకు ఆందోళన కొనసాగించారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో హోం మంత్రి సుచరిత రంగంలోకి దిగి అర్ధరాత్రి ఎస్సీ సంఘాలతో చర్చలు జరిపారు

ఎంపీ నందిగం సురేష్ పేరును ఎఫ్ఐఆర్లో చేరుస్తామని హోం మంత్రి హామీ
ఎంపీ సురేష్ పేరును ఎఫ్ఐఆర్లో చేరుస్తామని హోం మంత్రి హామీ ఇవ్వడంతో అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో మరియమ్మ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.
ఎస్సీ కాలనీలో ఆర్చి నిర్మాణం విషయంలో తలెత్తిన వివాదం చిలికి చిలికి గాలివానగా మారగా 50 సంవత్సరాల మరియమ్మ అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. గ్రామంలోని ఎస్సీ కాలనీ లో కొత్తగా వేసిన సిమెంట్ రహదారి ప్రారంభంలో ఆర్చి నిర్మాణం విషయంలో తలెత్తిన వివాదం కాలనీవాసులు మధ్య చిచ్చు పెట్టింది. ఆర్చి నిర్మాణానికి ఓ వర్గం వారు బాబు జగ్జీవన్ రామ్ పేరు పెట్టాలని పేర్కొనగా, మరో వర్గం అభ్యంతరం తెలిపింది.

ఆర్చి నిర్మాణం విషయంలో వివాదం .. ఇంటి ముందు పని చేసుకుంటున్న మరియమ్మ మృతి
దీనిపై అప్పుడు ఘర్షణ జరగగా పోలీసులు సర్ది చెప్పి పంపించారు . మరోసారి చర్చించటానికి రెండు వర్గాలు ప్రయత్నించిన క్రమంలో విభేదాలు తీవ్ర రూపం దాల్చాయి . పరస్పరం రాళ్లు, ఇటుకలతో కొట్టుకోవడం తో ఈ ఘర్షణ సమయంలో ఇంటి ముందు అంట్లు తోముకుంటున్న, ఈ ఘర్షణతో ఎలాంటి సంబంధం లేని మహిళ మరియమ్మ కు రాళ్లు వచ్చి తగిలి దీంతో తీవ్ర గాయాలపాలైన ఆమె ఆస్పత్రిలో మరణించింది.మరణించిన మహిళ మరియమ్మ కు ముగ్గురు కుమారులు.
Recommended Video

మరియమ్మ మృతదేహంతో ఆందోళన .. అర్దరాత్రి వరకు వెలగపూడిలో హైడ్రామా
మరియమ్మ మృతితో ఆమె భర్త, కుమారులు తీవ్ర ఆగ్రహంతో ఆందోళనకు దిగారు .తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ దాడిలో మరో ఏడుగురికి తీవ్రగాయాలు కాగా, 30 మంది క్షతగాత్రులయ్యారు. ఈ ఘటనకు ఎంపీ నందిగం సురేష్ బాధ్యుడని వారు ఆరోపించారు . మరియమ్మ మృతదేహంతో ఆందోళనకు దిగారు . ఆయన పేరును కూడా తమ ఫిర్యాదులో చేర్చారు . రణరంగంగా మారిన వెలగపూడి వ్యవహారం ముందు ముందు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో వేచి చూడాలి.
-
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..?











Click it and Unblock the Notifications